తోకలు కట్ చేస్తానంటూ బాబు రీ సౌండ్ !
తెలుగుదేశం పార్టీ అధినేత సీఎం చంద్రబాబు కడప జిల్లా జమ్మలమడుగు సభలో వైసీపీకి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు.
By: Satya P | 1 Aug 2025 9:00 PM ISTతెలుగుదేశం పార్టీ అధినేత సీఎం చంద్రబాబు కడప జిల్లా జమ్మలమడుగు సభలో వైసీపీకి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. ఓవర్ గా చేస్తే తోకలు కట్ చేస్తా అంటూ పవర్ ఫుల్ వార్నింగ్ ఇచ్చేశారు. తోకలు తిప్పాలని చూస్తే మాత్రం సీరియస్ గానే సీన్ ఉంటుందని క్లారిటీ పక్కాగా ఇచ్చేశారు. నెల్లూరులో జగన్ గురువారం చేసిన పరామర్శ యాత్రకు ఇది అసలు సిసలు కౌంటర్ గా భావిస్తున్నారు.
మంచిగా తిరిగితే నో అబ్జెక్షన్ :
పర్యటనలకు అనుమతులు ఇస్తామని మంచిగా జనంలో తిరగాలనుకుంటే ఎవరూ అభ్యంతరం చెప్పరని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. అలా కాకుండా జనాలను ఇబ్బంది పెడతామని మభ్యపెడతామని అందరికీ అసౌకర్యం కలిగిస్తామని అనుకుంటే మాత్రం తీవ్రంగానే పరిణామాలు ఉంటాయని బాబు హెచ్చరించారు.
తప్పు చేస్తే ఓదార్పునా :
వైసీపీ అధినేత జగన్ నెల్లూరు పర్యటనలో నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డిని పరామర్శించడం మీద చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు తప్పు చేసిన వారిని పార్టీ తరఫున శిక్షించాల్సింది పోయి ఆయనను పరామర్శ పేరుతో మరింత రెచ్చగొడతారా అని బాబు ఫైర్ అయ్యారు ఒక మహిళ మీద ప్రసన్నకుమార్ రెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేశారని బాబు పరోక్షంగా పేర్కొన్నారు. తమ పార్టీలో అయినా తప్పు చేస్తే ఖండించాల్సిందే అని ఆయన అన్నారు.
బాబాయ్ గొడ్డలి కధ :
జమ్మలమడుగులో మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య కేసుని చంద్రబాబు మరోమారు ప్రస్తావించారు. సొంత బాబాయ్ విషయమే చూస్తే మొదట గుండె పోటు అన్నారని, మధ్యాహ్నానికి మాట మార్చారని తెల్లారేసరికల్లా తన చేతిలోనే కత్తి పెట్టి నారాసుర చరిత్ర అని తమ మీద విష ప్రచారం చేశారు అన్నారు. రాజకీయాల్లో దుర్మార్గులు కొనసాగడం మంచిది కాదని ఆయన అన్నారు.
వైసీపీ మీద విమర్శలు :
వైసీపీ హయాంలో పెన్షన్లు సరిగ్గా ఇచ్చేవారు కాదని బాబు అన్నారు ఒక నెలలో ఏ కారణం అయినా పెన్షన్ తీసుకోకపోతే దానిని ఇచ్చేవారు కాదని ఆయన గుర్తు చేశారు. అయితే తమ ప్రభుత్వం పాలనలో మాత్రం పెన్షన్ ఒక నెల రెండు నెలలు తీసుకోకపోయినా వారికి ఇస్తున్నామని ఆయన చెప్పుకొచ్చారు. అభివృద్ధి కోసం తమ ప్రభుత్వం తపన పడుతోందని అదే విధంగా సంక్షేమం విషయంలో కూడా ప్రాధాన్యత ఇస్తున్నామని చెప్పారు. ప్రజలు ఇవ్వన్నీ గమనించాలని ఆయన కోరారు.
మొత్తం మీద చూస్తే కనుక చంద్రబాబు కడప జిల్లాలో జగన్ అండ్ కో మీద ఘాటుగానే విరుచుకుపడ్డారు. నెల్లూరు జగన్ పర్యటన మీద కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. జన సందోహంతో పర్యటనలు చేస్తమంటే కుదరదు అని హెచ్చరించారు. వైసీపీ జోరుకు ఎక్కడికక్కడ అడ్డుకట్ట వేస్తామని ఆయన తేల్చేశారు. తన పర్యటనలను అడ్డుకుంటున్నారు అని ఒక వైపు జగన్ విమర్శిస్తున్న నేపథ్యం ఉంది. అయితే ప్రజలకు అసౌకర్యంగా టూర్లు చేస్తే ఊరుకోమని బాబు జవాబు చెప్పినట్లు అయింది. ఈ తరహా రాజకీయం ముందు ముందు ఏ విధంగా సాగుతుందో చూడాల్సి ఉంది.
