'కింజారాపు' మనవడిని ముద్దాడిని చంద్రబాబు.. `3 తరాల` అనుబంధం
రామ్మోహన్ ఆహ్వానం మేరకు ఆయన నివాసానికి వెళ్లిన చంద్రబాబు.. రామ్మోహన్ మాతృమూర్తి, సతీమణి లతో పలు విషయాలను పంచుకున్నారు.
By: Tupaki Desk | 23 Aug 2025 7:48 PM ISTశ్రీకాకుళం ఎంపీ, కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు దంపతులకు ఇటీవల జన్మించిన కుమారుడిని సీఎం చంద్రబాబు ముద్దు చేశారు. శుక్రవారం ఢిల్లీలో పర్యటించిన చంద్రబాబు.. కార్యక్రమా ల అనంతరం.. కేంద్ర మంత్రి, పార్టీ యువ నాయకుడు కింజరాపు రామ్మోహన్ నాయుడి ఆహ్వానం మేర కు.. ఆయన నివాసానికి వెళ్లారు. ఇటీవల రామ్మోహన్ దంపతులకు బాబు జన్మించాడు. ఈ నేపథ్యంలోనే చంద్రబాబును ఆయన ప్రత్యేకంగా తన నివాసానికి ఆహ్వానించారు.
రామ్మోహన్ ఆహ్వానం మేరకు ఆయన నివాసానికి వెళ్లిన చంద్రబాబు.. రామ్మోహన్ మాతృమూర్తి, సతీమణి లతో పలు విషయాలను పంచుకున్నారు. అనంతరం.. బాబును ఒళ్లోకి తీసుకుని ముద్దు చేశారు. బాబుకు సంబంధించిన వివరాలను కూడా అడిగి తెలుసుకున్నారు. కాగా.. దీనికి సంబంధించిన విశేషాలను కేం ద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు సోషల్ మీడియాలో పంచుకున్నారు. తన ఇంటికి వచ్చిన చంద్రబాబు కు కృతజ్ఞతలు తెలిపారు.
మూడు తరాలతో..
కింజరాపు కుటుంబంలోని మూడు తరాలతో చంద్రబాబుకు అనుబంధం ఏర్పడింది. తొలినాళ్లలో కింజ రాపు ఎర్రన్నాయుడుతో చంద్రబాబు సుదీర్ఘ అనుబంధం కొనసాగించారు. కేంద్రంలో మంత్రిని చేయడం తోపాటు. ఎన్డీయే వ్యవహారాలను చక్కబెట్టడం వంటివి కీలక బాధ్యతలను కూడా అప్పటించారు. ఎర్రన్నాయుడు అకాల మరణంతో ఆయన కుమారుడు ప్రస్తుత కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడును చంద్రబాబు చేరదీశారు.
గతంలో ఎర్రన్నాయుడిని కేంద్ర మంత్రిని చేసినట్టే.. ఇప్పుడు రామ్మోహన్‌ను కూడా కేంద్ర మంత్రిని చేశారు. ఇక, తాజాగా రామ్మోహన్ నాయుడి కుమారుడు(ఇంకా పేరు పెట్టలేదు)ని ముద్దాడడం ద్వారా.. చంద్రబాబు కింజరాపు మూడో తరంతోనూ అనుబంధం పెంచుకున్నట్టు అయింది.
