Begin typing your search above and press return to search.

టాప్ సెగ్మెంట్‌: స‌ర్వేల హుషారు.. !

రాష్ట్రంలో నియోజకవర్గాల విషయం అదేవిధంగా టాప్ సెగ్మెంట్ విషయంపై సీఎం చంద్రబాబు చర్చిస్తున్నారు. ఉత్తమ పనితీరు అదేవిధంగా నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని టాప్ సెగ్మెంట్ ని ఎంపిక చేసే దిశగా చంద్రబాబు అడుగులు వేస్తున్నారు.

By:  Garuda Media   |   14 Dec 2025 1:00 PM IST
టాప్ సెగ్మెంట్‌:  స‌ర్వేల హుషారు.. !
X

రాష్ట్రంలో నియోజకవర్గాల విషయం అదేవిధంగా టాప్ సెగ్మెంట్ విషయంపై సీఎం చంద్రబాబు చర్చిస్తున్నారు. ఉత్తమ పనితీరు అదేవిధంగా నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని టాప్ సెగ్మెంట్ ని ఎంపిక చేసే దిశగా చంద్రబాబు అడుగులు వేస్తున్నారు. దీనికి సంబంధించి సర్వేల ద్వారా అదేవిధంగా పార్టీ పరంగా కూడా నివేదికలు తప్పించుకునే దిశగా అడుగులు పడుతున్నాయి. టాప్ సెగ్మెంట్ వచ్చిన నియోజకవర్గానికి భారీ ఎత్తున నిధులు ఇవ్వడంతో పాటు రాజకీయంగా కూడా అక్కడ పార్టీని మరింతగా బలోపేతం చేసే దిశగా అడుగులు వేయాలని నిర్ణయించారు.

ప్రస్తుతం ఉన్న 175 నియోజకవర్గాల్లో చంద్రబాబు ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పం నియోజకవర్గం టాప్ లో ఉంది. కానీ తన నియోజకవర్గం కన్నా మరింతగా డెవలప్ చేసుకునే పరిస్థితి, అవకాశం ఉన్న నియోజ కవర్గాల జాబితాను చంద్రబాబు సేకరిస్తున్నారు. ప్రస్తుతం 33 నియోజకవర్గాలు అభివృద్ధిలో దూసుకు పోతున్నాయి అన్నది పార్టీకి అందిన సమాచారం. ఇదే వ్యవహారంపై చంద్రబాబు కూడా దృష్టిపెట్టారు. మరింతగా అభివృద్ధి చెందే దిశగా ఈ 33 నియోజకవర్గాల్లో టాప్ స్థాయిలో ఉన్న నియోజకవర్గాన్ని ఎంపిక చేసే బాధ్యతను కూడా నాయకులకు అప్పగించారు.

టాప్ సెగ్మెంట్ ద్వారా మరిన్ని కార్యక్రమాలు అమలు చేయడంతో పాటు రాష్ట్రంలో ఆ నియోజకవర్గాన్ని ఉదాహరణగా తీసుకొని మరిన్ని నియోజకవర్గాలకు స్ఫూర్తిగా నిలబడేలాగా చేయాలనేది చంద్రబాబు ఆలోచన. మొత్తంగా ఈ వ్యవహారం అయితే ప్రస్తుతం చర్చల దశలో ఉంది. టాప్ సెగ్మెంట్లను ఎంపిక చేయడంతో పాటు వాటికి అభివృద్ధి నిధులను కూడా పంపిణీ చేయనున్నారు. నిజానికి ఎమ్మెల్యేల నుంచి అభివృద్ధి నిధులు కోరుతూ చాలా రోజులుగా విజ్ఞాపన‌లు అందుతున్నాయి. పార్టీకి ప్రభుత్వానికి కూడా నిధుల కోసం ప్రయత్నం జరుగుతున్నాయి.

కానీ అభివృద్ధి పథంలో ఇప్పటివరకు ముందున్న నియోజకవర్గాల‌కు వచ్చే ఏడాది నుంచి నిధులు ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. దీనిలో భాగంగానే ఇటీవల చంద్రబాబు దీనికి సంబంధించి కీలక ఆదేశం చేశారు. టాప్ సెగ్మెంట్ల‌ను ఎంపిక చేయాలని కూడా చంద్రబాబు చెప్పారు. దీని ప్రకారం తొలి దశలో 25 నుంచి 30 నియోజకవర్గాలకు భారీ ఎత్తున నిధులు ఇచ్చే అంశంపై దృష్టి పెట్టినట్టు తెలిసింది. మరి ఆ దిశగా ఎమ్మెల్యేలు ప్రయత్నం చేస్తే నియోజకవర్గాలను అభివృద్ధి చేసుకోవడం తేలిక అవుతుంది.