తల్లికి వందనం.. తెచ్చిన గ్రాఫ్ ఎంత ..!
కానీ, ఎన్నికలకు ముందు ప్రజలకు ఇచ్చిన మాట ను నిలబెట్టుకునే క్రమంలో చంద్రబాబు ఈ సొమ్మును ప్రజలకు పంపిణీ చేసేందుకు రెడీ అయ్యారు.
By: Tupaki Desk | 14 Jun 2025 9:30 PMఅసలు అమలు చేస్తారా? చేయరా? అనే వందల ప్రశ్నలకు.. సమాధానం చెబుతూ.. సీఎం చంద్రబాబు సూపర్ సిక్స్‌లో కీలకమైన తల్లికి వందనం పథకానికి శ్రీకారం చుట్టారు. 67 లక్షల మందికిపైగా లబ్ధిదారు లకు సంబంధించి 8,745 కోట్ల రూపాయలను విడుదల చేశారు. ఇది సహజంగానే చంద్రబాబు రాజకీయ వ్యూహానికి పెను సవాల్. ఎందుకంటే.. ఇదే సొమ్ము ఉంటే.. పోలవరంలో పాతిక శాతం పనులు అవుతాయి. అమరావతిలో రెండు బిల్డింగులు ఏర్పడతాయి.
కానీ, ఎన్నికలకు ముందు ప్రజలకు ఇచ్చిన మాట ను నిలబెట్టుకునే క్రమంలో చంద్రబాబు ఈ సొమ్మును ప్రజలకు పంపిణీ చేసేందుకు రెడీ అయ్యారు. తొలి రోజు నిధుల విడుదలకు పరిమితం అయ్యారు. ఇక, ఈ పథకానికి సంబంధించిన నిబంధనలు.. విధి విధానాలు కూడా.. పెద్దగా మార్పులేకుండానే విడుదల చేశారు. గతంలో వైసీపీ హయాంలో ఎలాంటి నిబంధనలు పెట్టారో.. ఇప్పుడు కూడా.. సేమ్.. కాపీ పేస్ట్ అన్నట్టుగానే వ్యవహరించారు. దీంతో వైసీపీ ని ప్రజలు గుర్తు చేసుకున్నారు.
మరోవైపు.. కీలకమైన ఇంకో విషయం 15 వేలు ఇస్తామని.. ఒక్కరూపాయి కూడా కట్ చేయబోమని ఎన్నికల కు ముందు చెప్పిన మాటలు మరోసారి వైరల్ అయ్యాయి. ఎందుకంటే.. గతంలో వైసీపీ 14 వేలు ఒకసారి 13 వేలు మరో మూడు సార్లు ఇచ్చింది. ఇప్పుడు కూటమి 13 వేలతో ప్రారంభించింది. దీనిపై మహిళల్లో కొంత అసంతృప్తి కనిపించినా.. గతంలో వైసీపీ ఇచ్చినట్టే ఇప్పుడు అమలు కావడంతో సర్దుకుపోయారు. ఎక్కువ మంది హ్యాపీ ఫీలయ్యారు.
మొత్తంగా చూస్తే.. తల్లికి వందనం పథకంతో సర్కారుకు గ్రాఫ్ అయితే పెరిగింది. ఈ విషయంలో సందే హం లేదు. ఎందుకంటే.. అసలు ఇవ్వరన్న ప్రచారం నుంచి ఇస్తారన్న ప్రచారం దాకా.. ఇచ్చే వరకు తీసుకువచ్చిన పథకం పేదల కుటుంబాల్లో పండుగ వచ్చేలా చేసిందనే చెప్పాలి. సో..దీనికి విధించిన నిబంధనలు చూసుకుంటే పెద్దగా వ్యతిరేకత రాలేదు. చంద్రబాబు తమకు మేలు చేస్తారన్న నమ్మకాన్నే తల్లులు వ్యక్తం చేశారు. ఎలా చూసుకున్నా.. ఈ పథకం గ్రాఫ్ కొంత మేరకు పెంచిందనడంలో సందేహం లేదు.