చంద్రబాబు - కొత్త కేడర్-కొత్త ఫార్ములా.. సక్సెస్ అయితే తిరుగుండదు...!
తాజాగా ఎన్టీఆర్ భవన్‌కు వచ్చిన చంద్రబాబు ఎమ్మెల్యేల వివరాలను తెలుసుకున్నారు. ఎవరెవరు ఏం చేస్తున్నారన్న వివరాలను పార్టీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు నుంచి తెలుసుకున్న ఆయన విస్మయం వ్యక్తం చేశారు.
By: Garuda Media | 3 Nov 2025 11:31 AM ISTసీఎం చంద్రబాబు పార్టీని కొత్త ఫార్ములాతో నడిపించాలని భావిస్తున్నారు. ప్రస్తుతం ఉన్న కేడర్‌పై ఆయనకు నమ్మకం ఉన్నా.. క్షేత్రస్థాయిలో కొందరు చేతులు చాపుతున్నారన్న వాదన బలంగా వినిపిస్తోంది.వీటిపై విమర్శలు, వార్తలు కూడా పెరుగుతు న్నాయి. ఈ నేపథ్యంలో ఎవరినీ నిందించకుండా... ఎవరినీ తప్పుబట్టకుండా.. తనంతట తాను ఒక నిర్ణయం తీసుకుని దానిని అమలు చేయాలని భావిస్తున్నట్టు సీఎం చంద్రబాబు చెబుతున్నారు. ఈ క్రమంలోనే కొత్త ఫార్ములా.. కొత్త కేడర్ విధానాన్ని ఆయన తాజాగా వివరించారు. ఈ క్రమంలో పార్టీకి పనిచేసేవారికి పెద్దపీట వేస్తామన్నారు.
ప్రస్తుతం ఇలా..
తాజాగా ఎన్టీఆర్ భవన్‌కు వచ్చిన చంద్రబాబు ఎమ్మెల్యేల వివరాలను తెలుసుకున్నారు. ఎవరెవరు ఏం చేస్తున్నారన్న వివరాలను పార్టీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు నుంచి తెలుసుకున్న ఆయన విస్మయం వ్యక్తం చేశారు. మొత్తం 134మంది టీడీపీ ఎమ్మెల్యేల్లో 80 మంది విస్తృతంగా వ్యాపారాలు చేస్తున్నారని పల్లా వివరించారు. మిగిలిన వారిలో కొందరు జాయింట్ వ్యాపారాలు చేస్తున్నట్టు చెప్పారు. ఇక, విస్తృత వ్యాపారాలు చేసేవారిలో సగం మంది రాష్ట్ర ప్రభుత్వ మద్యం వ్యాపారంలో ఉన్నట్టు తెలుసుకుని సీఎం చంద్రబాబు విస్మయం వ్యక్తం చేశారు.
అందుకే.. వారు పార్టీ కార్యక్రమాల్లోనూ.. ప్రభుత్వ కార్యక్రమాల్లోనూ పాల్గొనడం లేదని .. ఒక నిర్ణయానికి వచ్చిన చంద్రబాబు వ్యాపారాలు తగ్గించుకుని ప్రజల సేవకు సమయం కేటాయించాలని సూచించారు. దీనికి సంబంధించి మూడు మాసాల సమయం ఇస్తున్నామన్నారు. ఒకవేళ అప్పటికీ.. ఆయా నియోజకవర్గాల్లో మార్పు రాకపోతే.. అక్కడే.. కొత్త కేడర్‌ను ఏర్పాటు చేస్తామన్నారు. వారికి తర్ఫీదును ఇస్తామని.. వ్యాపారంతో సంబంధం లేని వారు.. మాత్రమే పార్టీకి సేవ చేసేవారిని మాత్రమే ఇకపై ఎంచుకోనున్నట్టు చంద్రబాబు తేల్చి చెప్పారు.
అంటే.. ఇక, నుంచి ఫుల్ టైమ్ పార్టీకి పనిచేసే కేడర్‌ను ఆయన ఎంచుకుంటారని స్పష్టం చేశారు. అదేసమయంలో ఆదాయం గురించి కూడా ప్రస్తావించిన చంద్రబాబు.. కుటుంబానికి తగినంత ఆదాయం పార్టీ నుంచే తీసుకోవచ్చని.. వ్యాపారాలు వ్యవహా రాలు చేసేవారితో పార్టీ ఇబ్బందులు పడుతోందని చెప్పారు. వచ్చే ఎన్నికల్లో తిరిగి విజయం దక్కించుకునేందుకు ఇప్పటినుంచి ప్రజల మధ్యకు వెళ్లాల్సి ఉంటుందని చెప్పిన చంద్రబాబు.. ఆదిశగా పనిచేయాలని సూచించారు. అదేసమయంలో కొత్త కేడర్‌ను ఎంచుకుంటామన్న విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు. ఇదే జరిగితే.. పార్టీ నుంచి పదవులవరకు అన్నీ.. వారికే దక్కుతాయ ని నిర్మగర్భంగా వ్యాఖ్యానించారు.
