Begin typing your search above and press return to search.

సీమ గడ్డ మీద జగన్ తప్పు ఎత్తి చూపిన బాబు !

వైసీపీ అధినేత మాజీ సీఎం వైఎస్ జగన్ మీద టీడీపీ కూటమి ఎన్నో విమర్శలు చేస్తూ ఉంటుంది.

By:  Satya P   |   7 Oct 2026 9:15 AM IST
సీమ గడ్డ మీద జగన్ తప్పు ఎత్తి చూపిన బాబు !
X

వైసీపీ అధినేత మాజీ సీఎం వైఎస్ జగన్ మీద టీడీపీ కూటమి ఎన్నో విమర్శలు చేస్తూ ఉంటుంది. అయితే అవి రొటీన్ గా ఉండొచ్చు కానీ వాటి వెనక వ్యూహాలు పదును తేరి ఉంటాయి. ఈ విషయంలో ముఖ్యమంత్రి టీడీపీ అధినేత చంద్రబాబు చాతుర్యాన్ని ఎవరూ తక్కువ అంచనా వేయలేరు. ఆయన ఎక్కడ ఎలా రియాక్ట్ కావాలో ఏ వేదిక మీద ఏ రకమైన విమర్శలు చేయాలో అంతా లెక్క చూసుకుని మరీ ప్రత్యర్ధుల మీద బాణాలు సంధిస్తారు. ఇకపోతే రాయలసీమ రీజియన్ అన్నది వైసీపీకి హార్డ్ కోర్ పొలిటికల్ రీజియన్ అన్నది తెలిసిందే.

జనంలో చర్చకు :

అలాంటి చోట కడప జిల్లాలోని ప్రొద్దుటూర్ సభలో చంద్రబాబు జగన్ మీద అనేక విమశలు చేశారు. అందులో కీలకమైనది చూస్తే జగన్ అసెంబ్లీకి రెండేళ్లకు పైగా గైర్ హాజరు అన్నది ఉంది. ఇదే హైలెట్ గా ఈ సభలో బాబు ప్రస్తావించారు. ఎందువల్ల ఈ ఇష్యూని ఆయన అందుకున్నారు అంటే దానికీ ఒక లెక్క ఉందని అంటున్నారు. కడప జిల్లా వైఎస్సార్ ఫ్యామిలీకి పెట్టని కోట. అయితే ఆ కోటకు బీటలు 2024 ఎన్నికల వేళ పడిపోయాయి. అది వేరే సంగతి. ఇపుడు మళ్లీ వైసీపీ అక్కడ నెమ్మదిగా పుంజుకుంటోంది అని వార్తలు వస్తున్న వేళ జగన్ మీద బాబు చేసిన ఈ విమర్శలు జనంలోకి చర్చగా పెట్టడమే ముఖ్య ఉద్దేశ్యం అని అంటున్నారు.

తప్పులను చూపుతూ :

జగన్ చేసిన తప్పు ఇది అని సీమ గడ్డ మీద బాబు ఎత్తి చూపారు. 2024 ఎన్నికల్లో రాయలసీమలో కూడా వైసీపీకి సీట్లూ ఓట్లూ ఇవ్వలేదని బాబు విమర్శించారు. అలా ఎందుకు చేశారు అంటే అయిదేళ్ళలో అభివృద్ధి కాకుండా అరాచక పాలన చేసినందుకు అని ఆయన ఆరోపించారు. కేవలం 11 సీట్లు మాత్రమే వైసీపీకి దక్కాయని కూడా గుర్తు చేశారు. ప్రతిపక్ష హోదా లేకుండా ఏపీ ప్రజలు వైసీపీని ఓడించారు అని కూడా బాబు హాట్ కామెంట్స్ చేశారు.

వైసీపీ డొల్లతనాన్ని :

అయినా సరే ప్రతిపక్ష హోదా కావాలని జగన్ కోరుతున్నారని బాబు జనం ముందే వైసీపీ డొల్లతనాన్ని బయటపెట్టారు. అసెంబ్లీలో మొత్తం సీట్లలో పది శాతం అంటే 18 స్థానాలు వస్తేనే ప్రతిపక్ష హోదా ఇస్తారని నిబంధనలను ఆయన తెలియచేశారు. ప్రజలు సీట్లు ఇవ్వకుండా తాను ఎలా విపక్ష హోదా ఇస్తాను అని ఆయన ప్రశ్నించారు. విపక్ష హోదా ఇవ్వలేదని జగన్ సభకు రావడం లేదని బాబు జగన్ మీదనే అయిదు వేళ్ళూ చూపిస్తూ జనంలో ఆలోచనలకు తెర లేపారు.

సభకు వస్తేనే :

వైసీపీ బయట విమర్శలు చేస్తోంది కానీ సభకు రావడం లేదని బాబు ఫైర్ అయ్యారు. సభకు వస్తే ప్రతీ విషయం మీద చర్చించి జవాబు చెబుతామని ఆయన అన్నారు. అసెంబ్లీకి వచ్చేది ఉందా అని జగన్ కే సవాల్ చేశారు. ఈ విధంగా జగన్ అసెంబ్లీకి రావడం లేదన్న సంగతి అందరికీ తెలిసినా మరో సారి దాన్ని జనం ముందు పెట్టి వైసీపీ ఎమ్మెల్యేల తీరుతో పాటు జగన్ విధానాలను కూడా ఎండగట్టారు. వైసీపీకి ఎందుకు ఓటేయాలన్నది జనంలో ప్రశ్నలు రేగేలా బాబు వ్యూహాత్మకంగానే ఈ అంశాన్ని తెర మీదకు తెచ్చారని అంటున్నారు. నిజానికి జగన్ అసెంబ్లీకి వెళ్లడం లేదన్న అసంతృప్తి అయితే జనంలో ఉంది. దాంతో జగన్ సొంత జిల్లాలోనే ఆ పార్టీ విధానాలను ప్రజల ముందు ఉంచి మీరే న్యాయం చెప్పాలన్నట్లుగా బాబు లెక్క తేల్చేశారు అని అంటున్నారు.