బాబు పక్కా క్లారిటీ...చూసుకోవాల్సింది జగనే !
టీడీపీ అధినేత ముఖ్యమంత్రి చంద్రబాబు ఎపుడూ ఇంత విస్పష్టంగా చెప్పినది లేదు. అసలు ఆయన వైఖరి కూడా వేరుగా ఉంటుంది.
By: Satya P | 16 Aug 2025 1:25 AM ISTటీడీపీ అధినేత ముఖ్యమంత్రి చంద్రబాబు ఎపుడూ ఇంత విస్పష్టంగా చెప్పినది లేదు. అసలు ఆయన వైఖరి కూడా వేరుగా ఉంటుంది. ట్రూ పాలిటిక్స్ చేస్తారు అని పేరు. ఆయనది కక్ష పూరిత మనస్తత్వం కాదని ఆయన కెరీర్ లో అలాంటి రాజకీయాలు చేయలేదని కూడా చెబుతారు. అయితే ఈసారి మాత్రం బాబులో రాజకీయ మార్పు చాలానే ఉంది అని అంతా అంటారు. దానికి గత పద్నాలుగేళ్ళ పాలనలో జరిగిన అనేక ఉదంతాలు ఉదాహరణగా కనిపిస్తున్నాయి అని అంటారు.
ఎందుకలా ఏమిటలా :
ఇక చూస్తే చంద్రబాబు ఈ విధంగా ఎందుకు మారాల్సిన్ వచ్చింది, ఎందుకు అలా అన్నదే చర్చగా సాగుతోంది. బాబు సీఎం గా ఉంటూ ఎపుడూ డెవలప్మెంట్ మీద ఫోకస్ పెట్టేవారు, విపక్షాలను రాజకీయంగా విమర్శించడం తప్పించి గట్టిగా టార్గెట్ చేసింది అయితే లేదు అన్నది ఆయన పొలిటికల్ ట్రాక్ రికార్డు చూస్తే అర్ధం అవుతుంది అని గుర్తు చేసేవారూ ఉన్నారు. కానీ ఈసారి మాత్రం వైసీపీ మీద ఫుల్ ఫోకస్ పెట్టేశారు. చిన్న స్థాయి నుంచి బిగ్ షాట్స్ దాకా ఆయన హయాంలో అరెస్టులు కేసులు పడుతున్నాయి. మరి బాబు ఎందుకు ఇలా చేస్తున్నారు అంటే దానికి ఆయనే క్లారిటీగా జవాబు చెప్పేశారు.
మా జోలికి వస్తే మాత్రం :
విజయవాడలో స్త్రీ శక్తి పధకం ప్రారంభోత్సవం సందర్భంగా జరిగిన సభలో చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. మేము ఎవరి జోలికి వెళ్లమని చంద్రబాబు అన్నారు. అయితే రాజకీయంగా మమ్మల్ని ఇబ్బందిపెడితే వదిలిపెట్టమని స్వీట్ అండ్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చేశారు ఇప్పుడు ఏపీలో ముఖ్యమంత్రిగా ఉన్నది 2014 బాబు కాదని 1995 నాటి బాబు అని ఆయన పక్కా క్లారిటీ ఇచ్చారు. ఇక పులివెందులకు 79 ఏళ్ల తర్వాత స్వాతంత్ర్యం వచ్చిందని అన్నారు. వారంతా 30 ఏళ్ల తర్వాత పులివెందుల ప్రజలు ఓటేశారని చంద్రబాబు కామెంట్స్ చేశారు. దీనిని బట్టి పరోక్షంగా ఆయన వైసీపీకి ఒక హెచ్చరికనే పంపించారు అనుకోవాలని అంటున్నారు.
వైసీపీ సిద్ధపడాల్సిందేనా :
రాజకీయంగా మమ్మల్ని ఇబ్బంది పెట్టిన వారుని వదలమని బాబు ఫుల్ క్లారిటీగా చెప్పేశారు. గడచిన అయిదేళ్ళలో వైసీపీ పాలనలో బాబు అరెస్టు తో పాటు జైలు పాలు చేశారు అలాగే అనేక మంది టీడీపీ నాయకుల మీద కేసులు పెట్టారు. దాంతో చంద్రబాబు ఈ విషయాలనే ప్రస్తావిస్తూ రాజకీయంగా ఇబ్బంది పెట్టారు అని అన్నారని అంతా భావిస్తున్నారు. మరి తాను 1995 నాటి చంద్రబాబుని అని కూడా చెప్పేశారు. అపుడు చంద్రబాబు అయితే దూకుడుగా ఉండేవారు. దాంతో బాబు దూకుడుని తట్టుకోవాల్సిందే అని వైసీపీకి అర్ధం కావాల్సి ఉందని అంటున్నారు.
ఇదే తీరు సాగుతుందా :
ఇక చూస్తే 2019 నుంచి అయిదేళ్ళ పాటు ఇబ్బంది పెట్టారని వదలమని టీడీపీ అంటోంది. అయితే ఇపుడు తమను బాధ పెడుతున్నారని రేపు అధికారంలోకి వస్తే వదలమని వైసీపీ నేతలు అంటున్నారు. దీంతో ఏపీలో ఇలాగే తీరు కొనసాగుతుందా అన్నదే చర్చగా ఉంది. మొత్తం మీద చూస్తే కనుక ఎవరు ఏమి చేసినా జస్టిఫికేషన్ కోసం మాత్రమే చూస్తున్నారని అంటున్నారు. జనాలకు తాము చేసింది ఒప్పు అని చెప్పుకోవడానికి ఆచీ తూచీ మాట్లాడుతున్నారు తప్ప వైసీపీ వర్సెస్ టీడీపీ రాజకీయం ఇలాగే సాగేలా ఉందని అంటున్నారు. సో బాబు తాజా వ్యాఖ్యలు మాత్రం ఇపుడు చర్చకు దారితీస్తున్నాయని అంటున్నారు.
