అశోక్ గజపతిరాజు.. సింగపూర్.. సిగరెట్... చంద్రబాబు ఇంట్రస్టింగ్ కామెంట్స్!
అవును... పెట్టుబడులే లక్ష్యంగా ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు సింగపూర్ లో పర్యటిస్తున్న సంగతి తెలిసిందే.
By: Tupaki Desk | 28 July 2025 9:28 AM ISTపెట్టుబడులే లక్ష్యంగా చంద్రబాబు సింగపూర్ పర్యటనకు వెళ్లిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా... తెలుగు డయాస్పోరా ఫ్రమ్ సౌత్ ఈస్ట్ ఏషియా కార్యక్రమంలో సీఎం పాల్గొని, ప్రసంగించారు. ఈ సందర్భంగా... సింగపూర్ లో 40వేల మంది తెలుగు ప్రజలు ఉన్నారంటే గర్వంగా ఉందని చెప్పిన చంద్రబాబు... అమరావతి మాస్టర్ ప్లాన్ ను సింగపూర్ ప్రభుత్వం ఉచితంగా తయారు చేసి ఇచ్చింది. ఈ సందర్భంగా అశోక్ గజపతిరాజు గురించి ఓ ఆసక్తికర విషయం పంచుకున్నారు!
అవును... పెట్టుబడులే లక్ష్యంగా ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు సింగపూర్ లో పర్యటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా... ఏపీ ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త పాలసీలు, పెట్టుబడులకు గల అవకాశాలను ఆయన వివరించారు. ఇదే సమయంలో... సింగపూర్ లో నిబంధనలు ఎంత కఠినంగా ఉంటాయో చెప్పే ప్రయత్నంలో... గోవా గవర్నర్ గా తాజాగా బాధ్యతలు చేపట్టిన టీడీపీ మాజీ నేతపూసపాటి అశోక్ గజపతిరాజు గురించి ఓ విషయాన్ని వెల్లడించారు.
ఇందులో భాగంగా... నాలుగు దశాబ్దాల పాటు టీడీపీలో వివిధ హోదాల్లో పనిచేసిన అశోక్ గజపతిరాజు గతంలో చంద్రబాబు కేబినెట్లో ఆర్ధిక శాఖ మంత్రిగా కూడా పనిచేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో... ఆయన చంద్రబాబుతో పాటు సింగపూర్ కు వెళ్లారు. అప్పటికి అశోక్ గజపతిరాజు చైన్ స్మోకర్ గా ఉండేవారంట. అలాంటి అశోక్ గజపతిరాజుతో సింగపూర్ సిగరెట్ మానిపించిందని చంద్రబాబు తెలిపారు.
ఈ సందర్భంగా స్పందించిన చంద్రబాబు... సింగపూర్ లో పొగ తాగితే 500 డాలర్ల జరిమానా విధిస్తారని తెలిపారు. ఈ నిబంధన తెలిసిన అశోక్ గజపతిరాజు పొగ తాగకుండా ఉండిపోయారని చెబుతూ... ఈ విషయాన్ని అక్కడి తెలుగు వారితో పంచుకున్నారు. సింగపూర్ లో నిబంధనలు ఎంత కఠినంగా ఉంటాయన్న విషయాన్ని చెప్పే క్రమంలో... అశోక్ గజపతిరాజు సీక్రెట్ కూడా చెప్పారు.
ఈ నేపథ్యలోనే... సింగపూర్ లో చట్టాలు కఠినంగా ఉంటాయని, అక్కడ బహిరంగంగా సిగరెట్ తాగితే 500 డాలర్లు ఫైన్ వేస్తారని చంద్రబాబు తెలిపారు. దీంతో... తాను తెచ్చుకుందే 500 డాలర్లు, ఆ డబ్బు మొత్తం ఒక్క సిగరెట్ కే ఖరు పెట్టేస్తే మిగిలిన రోజుల్లో ఖర్చులకు డబ్బులు ఎలా అని ఆలోచించిన ఆశోక్ గజపతిరాజు.. సింగపూర్ లో ఉన్నన్ని రోజులు సిగరెట్ తాగలేదని చంద్రబాబు గుర్తు చేసుకున్నారు.
ఈ సందర్భంగా... చట్టాలను అమలు చేయడంలో ఎంతో మంచి పేరున్న, అవినీతికి ఆస్కారం లేని సింగపూర్ అంటే తనకుఎంతో అభిమానమని చంద్రబాబు తెలిపారు. ఒక వ్యక్తి ఫౌండేషన్ ద్వారా సింగపూర్ గౌరవప్రదమైన దేశంగా ఎదిగిందని తెలిపారు. గతంలో జరిగిన తప్పులు సరిదిద్దాలని సింగపూర్ పర్యటనకు వచ్చినట్లు వెల్లడించారు.
