Begin typing your search above and press return to search.

ఎవ‌రికీ ప‌ట్ట‌లేదు.. కానీ, బాబు సాధిస్తే.. హిస్ట‌రీనే!

జ‌లం జీవం.. జీవ‌నాధారం. `అప్పిచ్చువాడు, వైద్యుడు, ఎడ‌తెగ‌క పారు సెల‌యేరు..` అంటూ నీటికి ఉన్న ప్రాధా న్యాన్ని పెద్ద‌లు ఎప్పుడో చెప్పారు.

By:  Garuda Media   |   8 Oct 2026 8:00 PM IST
ఎవ‌రికీ ప‌ట్ట‌లేదు.. కానీ, బాబు సాధిస్తే.. హిస్ట‌రీనే!
X

జ‌లం జీవం.. జీవ‌నాధారం. 'అప్పిచ్చువాడు, వైద్యుడు, ఎడ‌తెగ‌క పారు సెల‌యేరు..' అంటూ నీటికి ఉన్న ప్రాధా న్యాన్ని పెద్ద‌లు ఎప్పుడో చెప్పారు. నీరు లేని చోట నారే కాదు.. ప్రాణాలు కూడా నిల‌వ‌వ‌న్న‌ది అంద‌రికీ తెలిసిన స‌త్య‌మే. ప్ర‌స్తుతం దేశ‌వ్యాప్తంగా నీటి ఎద్ద‌డి పెరుగుతోంది. ఎల్ నినో ప్ర‌భావం ఈ ఏడాది ఉండ‌డం వ‌ల్ల మాత్ర‌మే కాదు!. ప్ర‌స్తుతం పెరుగుతున్న జ‌నాభాను దృష్టిలో పెట్టుకుంటే.. 2050 నాటికి వాట‌ర్ విక్ర‌యించే కేంద్రాలు మ‌రిన్ని పెరుగుతాయ‌ని.. ఇటీవ‌ల పెద్ద నివేదిక‌నే కేంద్రం విడుద‌ల చేసింది.

అంటే.. నీటి ల‌భ్య‌త ఏ స్థాయికి దిగ‌జారుతోందో ఈ నివేదిక స్ప‌ష్టం చేసింది. మ‌రి దీని నుంచి బ‌య‌ట ప‌డ‌డం ఎలా? ఇదే ఇప్పుడు ప్ర‌శ్న‌. దీనికి సీఎం చంద్ర‌బాబు చెబుతున్న కీల‌క ప్ర‌తిపాద‌న `న‌దుల అనుసంధానం`. గంగ నుంచి కావేరి వ‌ర‌కు.. గోదావ‌రి నుంచి పెన్నా వ‌ర‌కు.. ఇలా.. దేశ‌వ్యాప్తంగా ప్ర‌ధాన‌మైన 5 న‌దులను అనుసంధానం చేయ‌డం ద్వారా.. దేశం ఎదుర్కొంటున్న‌.. భ‌విష్య‌త్తులో ఎదుర‌య్యే నీటి ఎద్ద‌డిని నివారించ‌వ‌చ్చ‌న్న‌ది బాబు చెబుతున్న కీల‌క స‌ల‌హా. దీనిని అనేక మంది మేధావులు కూడా స‌మ‌ర్థిస్తున్నారు.

గ‌తంలో సీపీఎం నాయ‌కుడు పుచ్చ‌ల‌ప‌ల్లి సుంద‌రయ్య కూడా 5 ద‌శాబ్దాల కింద‌టే `న‌దుల అనుసంధానం` పేరుతో ఓ పుస్త‌కం కూడా రాశారు. నీటి ప్రాధాన్యాన్ని ఆయ‌న వివ‌రించారు. ఇక‌, త‌ర‌చుగా ప్ర‌ధాని కూడా ఈ విష‌యాన్ని ప్ర‌స్తావిస్తున్నారు. ప్ర‌స్తుతం మాత్రం దీనిపై గ‌ట్టిగా ప‌ట్టుబ‌డుతున్న నాయ‌కుడు ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబేన‌ని చెప్పాలి. న‌దులపై ప్రాజెక్టులు క‌ట్ట‌డం స‌రే.. ఆ న‌దుల‌ను అనుసంధానం చేయ‌డం ద్వారా మ‌రిన్ని ఫ‌లాల‌ను అందుకోవ‌చ్చ‌న్న‌ది బాబు ఆలోచ‌న‌.. దూర‌దృష్టి. కానీ, ఇత‌ర రాష్ట్రాల ముఖ్య‌మంత్రులు మాత్రం ఈ విష‌యంపై నిర్లిప్తంగా ఉంటున్నారు. ఒక ర‌కంగా చెప్పాలంటే.. బాబుతో క‌లిసి రావ‌డం లేదు.

అయినా.. ప‌ట్టువ‌ద‌ల‌ని విక్ర‌మార్కుడి టైపులో చంద్ర‌బాబు న‌దుల అనుసంధానంపై కృషి చేస్తూనే ఉన్నారు. తాజాగా గురువారం ప్ర‌ధాని మోడీని క‌లుసుకోనున్న చంద్ర‌బాబు.. తాను చ‌ర్చించే కీల‌క అంశాల్లో న‌దుల అనుసంధానాన్ని కూడా చేర్చుకున్నారు. త‌ద్వారా ప్ర‌స్తుతం వృథాగా పోతున్న నీటిని ఒడిసిప‌ట్టి.. ప్ర‌జ‌ల‌కు, ప్రాజెక్టుల‌కు నీటి ల‌భ్య‌త‌ను పెంచాల‌న్న‌ది ఆయ‌న సూచ‌న‌. దీనికి అనేక రాష్ట్రాల‌ను ఒప్పించాల్సి ఉంటుంద‌న్న‌ది కేంద్రం చెబుతున్న‌మాట‌. ఈ నేప‌థ్యంలో బాబు ప్ర‌య‌త్నం స‌ఫ‌లం అయితే.. దేశ‌వ్యాప్తంగా తాగు, సాగునీటికి ఎలాంటి ఇబ్బంది ఉండ‌ద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. అంతేకాదు.. దేశంలో న‌దుల అనుసంధానం జ‌రిగితే.. ఒక హిస్ట‌రీ క్రియేట్ అవుతుంద‌ని కూడా చెబుతున్నారు.

చేసి చూపించిన బాబు..

ఇక‌, చంద్ర‌బాబు మాట‌ల మ‌నిషికాదు.. తన ప‌రిధిలో ఈ న‌దుల అనుసంధానాన్ని చేసి చూపించారు. ఏపీలోకి వ‌చ్చే గోదావ‌రి, కృష్ణాన‌దుల‌ను విజ‌య‌వాడ‌లోని సంగ‌మ ప్రాంతంలో క‌లిపారు. త‌ద్వారా సీమ‌కు నీటిని విడుద‌ల చేశారు. ఇటీవ‌ల వెలిగొండ ప్రాజెక్టుకు నీటిని ఈ మార్గం ద్వారానే పంపించి.. క‌డ‌ప‌, నెల్లూరు, ప్ర‌కాశం వంటి జిల్లాల‌కు నీటిని పంపించే బృహ‌త్త‌ర ప్ర‌ణాళిక‌కు శ్రీకారం చుట్టారు. ఇప్పుడు దేశ‌వ్యాప్తంగా ఇలా న‌దుల అనుసంధానం జ‌ర‌గాల‌న్న‌ది బాబు ప‌ట్టుద‌ల. ఆయ‌న ఆశ‌యం సిద్ధించాల‌ని కోరుకుందాం.