Begin typing your search above and press return to search.

తుఫాన్ అంటే జోక్ కాదు.. బాబు హాట్ కామెంట్స్ !

ఇదంతా ప్రకృతి చేసే మ్యాజిక్. అయితే దీనిని కూడా అత్యాధునిక సాంకేతికత ఆసరాతో కనుగొంటూ ఎక్కడికక్కడ ప్రభుత్వాలు అప్రమత్తం చేస్తున్నాయి.

By:  Satya P   |   28 Oct 2026 11:29 PM IST
తుఫాన్ అంటే జోక్ కాదు.. బాబు హాట్ కామెంట్స్ !
X

ఆర్నాబ్ తుఫాన్ వస్తుందని ఏపీని ముంచెత్తుతుందని గత వారం రోజులుగా వాతావరణ శాఖ అయితే హెచ్చరికలు జారీ చేస్తోంది. అయితే చాలా మంది మాత్రం అది నమ్మడం లేదు. నిజానికి ఈ నెల 27 మంగళవారం నుంచి ఆర్నాబ్ తుఫాను ప్రతాపం చూపిస్తుంది అంటే సోమవారం కూడా భీకరమైన ఎండ ఏపీ అంతా కాసింది. దాంతో తుఫాను అంటున్నారు. ఆ అలజడి ఎక్కడా లేదు కదా అనుకున్నారు. నిజానికి అది తుఫాను ముందు నిశ్శబ్దం. తుఫాన్ ఉండేది ఉద్భవించేది భూమి మీద కాదు సాగర గర్భంలో. వాతావరణ శాఖ దానిని స్టడీ చేసి చెబుతుంది. ఒక ఒక్కసారి తుఫాన్ ప్రకంపనలు మొదలయ్యాక కారు మేఘాలు క్షణాలలో కమ్ముకుంటాయి. ఆ మీదట అంతటా భారీ వర్షాలు కురవడం స్టార్ట్ అయిపోతుంది. ఇదంతా ప్రకృతి చేసే మ్యాజిక్. అయితే దీనిని కూడా అత్యాధునిక సాంకేతికత ఆసరాతో కనుగొంటూ ఎక్కడికక్కడ ప్రభుత్వాలు అప్రమత్తం చేస్తున్నాయి.

బాబు ఆగ్రహం :

ఆర్నాబ్ తుఫాన్ తీరం దాటిపోయిన తర్వాత బాబు మీడియాతో మాట్లాడుతూ తుఫాను గురించి ముందస్తు సమాచారం ఇస్తే ఎక్కడ వచ్చింది అని కొంతమంది సోషల్ మీడియాలో జోక్స్ వేస్తున్నారు అని ఆగ్రహం వ్యక్తం చేశారు. వాళ్ళ అమాయకత్వానికి నవ్వుకోవాల్సి వస్తోంది అని అన్నారు. ఇదే నేపథ్యంలో కొంతమంది అయితే రాజకీయాల్లో ఉంటూ విమర్శించేందుకు అవకాశంగా తీసుకుంటున్నారు అని బాబు అన్నారు. ఒకప్పుడు తుఫాన్ అంటే శ్రీకాకుళం నుంచి నెల్లూరు వరకూ అప్రమత్తం చేసే యంత్రాంగమంతా అక్కడే ఉండాల్సి వచ్చేది అని అన్నరు. అయితే ఇప్పుడు సాంకేతికత సాయంతో ఎక్కడ కచ్చితంగా వస్తుందో ముందే గుర్తించి ప్రభావం చూపే ప్రాంతాల్లో అలెర్ట్ చేస్తున్నామని చెప్పుకొచ్చారు. ప్రిడిక్షన్, అక్యురెసీ, ఫీల్డ్‌లో అప్రమత్తత ఇదీ కూటమి ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలు అని ఆయన చెప్పారు. తుఫాను ప్రభావాన్ని సమర్ధంగా ఎదుర్కొని ప్రాణ, ఆస్తి నష్టాలను గణనీయంగా తగ్గించటమే ప్రభుత్వ లక్ష్యం అన్నారు.

బాధ్యతగా ఉండాలి :

తమ ప్రభుత్వం బాధ్యతగా ఉండబట్టే విశ్వసనీయత ఉందని అన్నారు. తుఫాను ఎక్కడ వస్తుంది ఎలా వస్తుంది, ఎలా తీరం దాటుతుంది అన్నది పూర్తిగా సాంకేతికతతో తాము అధ్యయనం చేసి మరీ ప్రజలకు ఈ రోజు సమాచారం అందించగలుగుతున్నామని అన్నారు. ఆర్నాబ్ తుఫాన్ విషయంలో తనతో సహా అధికారులు, కలెక్టర్లు, క్షేత్రస్థాయి సిబ్బంది రాత్రంతా నిద్ర సైతం మానుకుని పని చేశారని బాబు చెప్పారు. తుఫాను కారణంగా ఎక్కడెక్కడ తీవ్రత ఉంటుందో సాంకేతికత సాయంతో అంచనా వేశామని చెప్పరు. ఐఎండీతో పాటు ఇతర ఉపగ్రహ ఛాయాచిత్రాలను ఎప్పటికప్పుడు బేరీజు వేస్తూ పనిచేశామని తెలిపారు. సముద్రంలో వివిధ వాతావరణ పరిస్థితుల వల్ల ఏపీ తీరంపై తుఫాను ఏకంగా పది గంటలపాటు నిలిచి పోయిందని బాబు చెప్పారు. ఇక ప్రభుత్వ యంత్రాంగాన్ని అంతా అన్ని చోట్లా మొహరించకుండా ఎక్కడ అవసరమో అక్కడే ఏర్పాటు చేశామని అన్నారు. ఇక తుఫాను కారణంగా రాష్ట్రంలో సగటు లోటు వర్షపాతం 39 నుంచి 27 శాతానికి తగ్గిందని బాబు చెప్పారు. ఇది సాంకేతిక పరంగా సాధించిన విజయం అని ఆయన అంటూ గత పాలకులు కక్షపూరితంగా రియల్ టైమ్ గవర్నెన్స్ కేంద్రాన్ని నిర్లక్ష్యం చేశారని బాబు విమర్శించారు.