జగన్ మీద బాబు కామెంట్స్ వైరల్
వైసీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్ కి ఒక మానసిక వ్యాధి ఉందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తాజాగా చేసిన సంచలన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.
By: Satya P | 1 May 2026 11:36 PM ISTవైసీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్ కి ఒక మానసిక వ్యాధి ఉందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తాజాగా చేసిన సంచలన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. చంద్రబాబు కృష్ణా జిల్లా పర్యటనలో భాగంగా పమిడి ముక్కలలో నిర్వహించిన ప్రజా దీవెన సభలో మాట్లాడుతూ వైసీపీ మీద జగన్ మీద తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. మాజీ ముఖ్యమంత్రి జగన్ ఒక రకమైన మానసిక వ్యాధితో బాధపడుతున్నారని చంద్రబాబు ఈ సందర్భంగా పేర్కొనడం విశేషం. చంద్రబాబు జగన్ మానసిక వ్యాధి గురించి వివరిస్తూ ఆయనకు ఉన్న వ్యాధి వల్ల ఒకరు బాగుపడకూడదు మరొకరు ఆనందంగా ఉండకూడదు అన్న ధోరణి కనిపిస్తుందని అన్నారు.
సర్వనాశనం అంటూ :
అంతే కాదు జగన్ రాష్ట్రాన్ని ఐదేళ్ల పాలల్లో సర్వనాశనం చేశారని చంద్రబాబు విమర్శించారు. వైసీపీ అధికారంలోకి వస్తూనే ప్రజల సొమ్ముతో కట్టిన ప్రజా వేదికను జగన్ కూల్చేశారని బాబు గుర్తు చేశారు. ఆనాటి నుంచి మొదలైన వైసీపీ విధ్యంశం ఐదేళ్లపాటు యథేచ్ఛగా కొనసాగిందని చంద్రబాబు విమర్శించారు. అదే సమయంలో రాష్ట్రంలో ప్రజలు ప్రతిపక్షాలు అందరూ కూడా నానా ఇబ్బందులు పడ్డారని ఆయన అన్నారు. రాష్త్రంలో జనం కనీసం నవ్వుకునేందుకు కూడా ఆనాటి పాలనలో అవకాశం లేకుండా పోయిందని చంద్రబాబు నాయుడు చెప్పడం విశేషం. ఇక వైసీపీని గొడ్డలి పార్టీగా బాబు అభివర్ణించడం మరో విశేషం.
కూటమిని గెలిపించారు :
2024 ఎన్నికల్లో వైసీపీ ప్రభుత్వం విషయంలో ప్రజలు సరైన నిర్ణయం తీసుకుని మంచి తీర్పు ఇచ్చారని బాబు అన్నారు. అయితే వైసీపీ వైఖరి ఇప్పటికి కూడా మారకపోవడం దారుణమని చంద్రబాబు చెప్పుకొచ్చారు. ఈరోజు కూడా వైసీపీ మీద అభిమానంతో ఎవరైనా ఉంటే వారు మారాల్సిన అవసరం ఉందని బాబు సూచించడం విశేషం. రాష్ట్రంలో అభివృద్ధి పెద్ద ఎత్తున సాగుతుందని గడచిన 22 నెలల్లో రాష్ట్ర నిర్మాణం కోసం కూటమి ప్రభుతవ్మ్ సర్వశక్తులు ఒడ్డి పనిచేస్తోందని బాబు చెప్పారు. ఈ కీలక సమయంలో ప్రజలు వైకుంఠపాళి ఆట ఆడితే కనుక రాష్ట్ర అభివృద్ధి ఇబ్బందులో పడుతుందని బాబు హెచ్చరించడం గమనార్హం.
మరోసారి ఎన్డీయే :
రాష్ట్రంలో అభివృద్ధి సంక్షేమం సజావుగా సాగాలి అంటే ఎన్డీఏ ప్రభుత్వాన్నే తిరిగి గెలిపించాలని బాబు ప్రజలకు పిలుపునిచ్చారు. వైసీపీ హయాంలో ఎటు చూసినా అశాంతి, అక్రమాలు వంటివి చోటుచేసుకున్నాయని ఆయన చెప్పారు. అమరావతిని కూడా స్మశానమని అపహాస్యం చేసి ఏమాత్రం అభివృద్ధి చేయలేదని బాబు మండిపడ్డారు. అటువంటి వైసీపీని గెలిపిస్తే రాష్ట్రానికి ఏమాత్రం మేలు జరగకపోగా అంతా నష్టపోతారని హెచ్చరించారు. ఈ విషయంలో ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని చంద్రబాబు సూచించడం విశేషం. రాష్ట్ర అభివృద్ధి కోసం తాను పవన్ కళ్యాణ్ నరేంద్ర మోడీ కలిసికట్టుగా కృషి చేస్తున్నామని ఆయన గుర్తు చేశారు. ఇవన్నీ పక్కన పెడితే వైసీపీని గొడ్డలి పార్టీ జగన్ కి మానసిక వ్యాధి ఉందని చంద్రబాబు చేసివ్ ఈ హాట్ కామెంట్స్ అట్ల వైసీపీ మీద చేసిన ఘాటు విమర్శల పట్ల వైసీపీ ఏ విధంగా స్పందిస్తుంది అన్నది చూడాల్సి ఉంది.
