Begin typing your search above and press return to search.

సింగయ్య మృతిపై స్పందించిన బాబు.. జగన్ పై నిప్పులు!

జూన్‌ 18న మాజీ సీఎం, వైసీపీ అధినేత జగన్ పల్నాడు జిల్లా పర్యటన సందర్భంగా సింగయ్య అనే వ్యక్తి మృతి చెందిన సంగతి తెలిసిందే.

By:  Tupaki Desk   |   1 July 2025 9:58 PM IST
సింగయ్య మృతిపై స్పందించిన బాబు.. జగన్  పై నిప్పులు!
X

జూన్‌ 18న మాజీ సీఎం, వైసీపీ అధినేత జగన్ పల్నాడు జిల్లా పర్యటన సందర్భంగా సింగయ్య అనే వ్యక్తి మృతి చెందిన సంగతి తెలిసిందే. దీనికి సంబంధించిన కేసులో జగన్ ని ఏ2గా చేర్చారు పోలీసులు. ఇదే సమయంలో... సింగయ్య మృతికి జగన్‌ ప్రయాణించిన వాహనమే కారణమని ఫోరెన్సిక్‌ నిపుణులు స్పష్టం చేశారు! ఈ నేపథ్యంలో చంద్రబాబు స్పందించారు.

అవును.. జగన్ పర్యటనలో సింగయ్య అనే వ్యక్తి మృతి చెందిన సంగతి తెలిసిందే. ఈ కేసు ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. ఈ కేసులో తనను ఏ2గా చేర్చడంపై జగన్ హైకోర్టును ఆశ్రయించగా.. మంగళవారం బిగ్ రిలీఫ్ దక్కింది! ఈ నేపథ్యంలో తాజాగా చంద్రబాబు ఈ విషయంపై తొలిసారిగా స్పందించారు. ఈ సందర్భంగా... జగన్ పై తీవ్ర విమర్శలు గుప్పించారు.

ఇందులో భాగంగా.. జగన్ ప్రజల ప్రాణాలను కూడా పట్టించుకోడని.. సింగయ్య తన కారు కింద నలిగిపోయినప్పుడు, అతన్ని కూడా పట్టించుకోలేదని అన్నారు. అతని శరీరాన్ని పక్కకు విసిరివేశారని.. గాయపడిన వ్యక్తిని ఆసుపత్రికి తీసుకెళ్లడంలో ఆలస్యం జరిగిందని.. దురదృష్టవశాత్తు ఆయన మరణించారని చంద్రబాబు అన్న్నారు.

అయితే.. దీన్ని కప్పిపుచ్చడానికి జగన్ ఉపయోగించిన కారుతో కాకుండా వేరే కారుతో ప్రమాదం జరిగిందని చెప్పి కొత్త కథను అల్లడానికి ప్రయత్నించారని తెలిపారు. అయితే... తనకు ఫోరెన్సిక్ నివేదిక వచ్చిందని.. ఆ సంఘటనలో జగన్ కారు ఉందని స్పష్టంగా తేలిందని చంద్రబాబు అన్నారు.

దీంతో... ఇప్పటి వరకూ ఈ విషయంపై స్పందించని చంద్రబాబు... ఫోరెన్సిక్ కన్ఫర్మేషన్ కూడా వచ్చిన తర్వాత ఘాటుగా తొలిసారి ఘాటుగా రియాక్ట్ అవ్వడం గమనార్హం!