Begin typing your search above and press return to search.

ఇప్ప‌టి వ‌ర‌కు చంద్ర‌బాబుదే పైచేయి.. నో డౌట్‌..!

తాజాగా జాతీయ ఆంగ్ల మీడియా ఇండియ‌న్ ఎక్స్ ప్రెస్ చేసిన స‌ర్వే, వెలువ‌రించిన నివేదిక‌లో అఖిల భార‌త స్థాయిలో చంద్ర‌బాబు 14వ స్థానంలో నిలిచారు.

By:  Tupaki Desk   |   31 March 2025 7:30 AM
ఇప్ప‌టి వ‌ర‌కు చంద్ర‌బాబుదే పైచేయి.. నో డౌట్‌..!
X

ఏపీ సీఎం, టీడీపీ అధినేత చంద్ర‌బాబుతో రాజ‌కీయాలు చేయొచ్చు.. కానీ, ఆయ‌న సంపాయించుకున్న రాష్ట్ర‌, జాతీయ‌, అంత‌ర్జాతీయ స్థాయి గౌర‌వాన్ని.. రాజ‌కీయాల‌ను మాత్రం వైసీపీ అధినేత జ‌గ‌న్ అందు కుంటారా? అంటే.. క‌ష్ట‌మేన‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. రాజ‌కీయంగా ఏపీలో చంద్ర‌బాబును అంతో ఇంతో ఢీ కొట్టే ప్ర‌య‌త్నంవ‌ర‌కు మాత్ర‌మే జ‌గ‌న్ ప‌రిమితం అవుతార‌ని ప‌రిశీల‌కులు చెబుతున్నారు. కానీ, చంద్ర‌బాబు సంపాయించుకున్న ఇమేజ్‌ను ఆయ‌న ఏమాత్రం చేరుకోలేర‌ని చెబుతున్నారు.

తాజాగా జాతీయ ఆంగ్ల మీడియా ఇండియ‌న్ ఎక్స్ ప్రెస్ చేసిన స‌ర్వే, వెలువ‌రించిన నివేదిక‌లో అఖిల భార‌త స్థాయిలో చంద్ర‌బాబు 14వ స్థానంలో నిలిచారు. ఇదేమంత తేలిక విష‌యం కాదు. అనేక మంది నాయ‌కుల‌ను తోసిపుచ్చి మ‌రీ చంద్ర‌బాబు ఈ స్థాయికి చేరుకున్నార‌ని పత్రిక పేర్కొంది. ఇది.. జ‌గ‌న్‌కు సాధ్య‌మ‌య్యే ప‌నికాద‌ని.. ప‌రిశీల‌కులు చెబుతున్నారు. తాను జైల్లో ఉన్నా.. త‌న వారిని బ‌లంగా బ‌య‌ట‌కు తీసుకువ‌చ్చి.. త‌న‌కు అనుకూలంగా రాజ‌కీయాలు చేసుకున్న చంద్ర‌బాబు.. కేవ‌లం ఏడాది కాలంలో అధికారంలోకి వ‌చ్చారు.

అంతేకాదు.. ఇక‌, టీడీపీ ప‌ని అయిపోయింద‌ని.. బీజేపీతో చేతులు క‌ల‌ప‌డం క‌ష్ట‌మేన‌ని సంకేతాలు వ‌చ్చి నా ఆయ‌న ఎక్క‌డా కుంగిపోకుండా.. ఎక్క‌డ త‌గ్గాలో అక్క‌డ త‌గ్గి.. పార్టీని నిల‌బెట్టుకున్న తీరును ప‌త్రిక ప్ర‌ధానంగా ప్ర‌శంసించింది. ఒక‌ప్పుడు వాజ‌పేయి హ‌యాంలో చంద్ర‌బాబుపేరు జాతీయ‌స్థాయిలో వినిపించింది. ఇప్పుడు అంత‌కుమించి వినిపిస్తున్న‌ట్టు ప‌త్రిక పేర్కొన‌డం గ‌మ‌నార్హం. పైగా ఇన్నేళ్ల రాజ‌కీయ జీవితంలో ఎక్క‌డా ఒక్క మ‌చ్చ కూడా లేక‌పోవ‌డం మ‌రింత విశేష‌మ‌ని పేర్కొంది.

అంత‌ర్జాతీయంగా కూడా.. చంద్ర‌బాబు ఇమేజ్‌ను ఎవ‌రూ చేరుకునే ప‌రిస్థితి లేద‌ని ప‌రిశీల‌కులు చెబుతు న్నారు. ఆర్బీఐ స‌హా.. ప్ర‌పంచ బ్యాంకుల వ‌ద్ద చంద్ర‌బాబు పేరు చెబితే.. ఠ‌క్కున గుర్తించే ప‌రిస్థితి ఉంద‌ని.. కానీ, ఈ త‌ర‌హా గుర్తింపు జ‌గ‌న్‌కు ఏమాత్రం లేద‌ని అంటున్నారు. అయితే.. రాష్ట్రం వ‌ర‌కు చూసుకుంటే మాత్రం చంద్ర‌బాబుతో రాజ‌కీయంగా మాత్ర‌మే జ‌గ‌న్ త‌ల‌ప‌డే అవ‌కాశంఉంద‌ని చెబుతున్నారు. అదికూడావిజ‌న్‌, అభివృద్ధి, సంప‌ద సృష్టి వంటివాటివిష‌యంలో చంద్ర‌బాబుదే ఇప్ప‌టి వ‌ర‌కు పైచేయిగా ఉంద‌ని అంటున్నారు.