Begin typing your search above and press return to search.

బాబు నివాసానికి కేంద్ర మంత్రి.. పొగాకు పైచ‌ర్చ‌!

ఉండవల్లి క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో కేంద్ర వాణిజ్యం, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ భేటీ అయ్యారు.

By:  Tupaki Desk   |   16 Jun 2025 12:21 AM IST
బాబు నివాసానికి కేంద్ర మంత్రి.. పొగాకు పైచ‌ర్చ‌!
X

ఉండవల్లి క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో కేంద్ర వాణిజ్యం, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ భేటీ అయ్యారు. రాష్ట్రంలోని వివిధ అంశాలపై ముఖ్యమంత్రి-కేంద్ర మంత్రి చర్చించారు. `హెచ్ డీ బర్లీ` పొగాకు కొనుగోళ్లు, పామాయిల్ పై దిగుమతి సుంకం తగ్గింపు, ఆక్వా ఎగుమతులు, మ్యాంగో పల్ప్ పై జీఎస్టీ తగ్గింపు స‌హా వివిధ‌ అంశాలపై వినతి పత్రం అందించారు. హెచ్‌డీ బర్లీ పొగాకు కొనుగోళ్లు, పామాయిల్ పై దిగుమతి సుంకం తగ్గింపు, ఆక్వా ఎగుమతులు, మ్యాంగో పల్ప్ పై జీఎస్టీ తగ్గింపుపై చర్చించారు.

టొబాకో బోర్డు ద్వారా ఏపీలో పొగాకు కొనుగోళ్ల నిమిత్తం రూ.150 కోట్లు కేటాయించాలని ముఖ్యమంత్రి విన్న‌వింంచారు. పొగాకు ధరలు తగ్గిన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వమే రూ.300 కోట్లతో 20 మిలియన్ కేజీలు కొనుగోలు చేస్తున్నట్టు వెల్లడించారు. బాపట్ల, గుంటూరు, పల్నాడు, ప్రకాశం జిల్లాల్లో ఏడు చోట్ల పొగాకు కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశామని వివరించారు. పొగాకు కొనుగోళ్ల నిమిత్తం రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేసే రూ. 300 కోట్లలో టొబాకో బోర్డు రూ.150 కోట్లు భరించేలా చూడాలన్నారు.

పొగాకు ఉత్పత్తి, మార్కెటింగ్ వంటి అంశాలను టొబాకో బోర్డు ద్వారా నియంత్రించేలా చట్టసవరణ చేయాలని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్‌ను సీఎం చంద్రబాబు కోరారు. ఆయిల్ పాం దిగుమతి సుంకాన్ని 10 శాతానికి తగ్గించడంపై పునరాలోచన చేయాలని కోరారు. దిగుమతి సుంకం తగ్గించడం వల్ల రాష్ట్రంలోని పామాయిల్ రైతులకు సరైన ధర రావడం లేదని.. తీవ్రంగా నష్టపోతారని కేంద్ర మంత్రికి వివరించారు. దిగుమతి సుంకం తగ్గింపు నిర్ణయం.. కేంద్రం నిర్దేశించిన నేషనల్ మిషన్ ఆన్ ఎడిబుల్ ఆయిల్స్ లక్ష్యాలకు కూడా ఇబ్బందికరంగా ఉంటుందనే విషయాన్ని గుర్తు చేశారు.

ఆక్వా ఎగుమతులపై అమెరికా విధించిన సుంకాల విషయంలో ఆ దేశంతో చర్చలు జరపాలని సూచించారు. సీఫుడ్ పై అమెరికా విధించిన 27 శాతం సుంకాలు ఏపీలోని 8 లక్షల మంది ఆక్వా రైతులపై ప్రభావితం చూపుతోందన్నారు. ఏపీ ఆక్వా రైతులపై ఈ భారాన్ని తగ్గించేలా చొరవ తీసుకోవాలని కోరారు. మ్యాంగో పల్ప్ పై జీఎస్టీని 12 నుంచి 5 శాతానికి తగ్గించాలని కోరారు.