Begin typing your search above and press return to search.

బాబు-ప‌వ‌న్‌-జ‌గ‌న్‌.. ప్ర‌జ‌లేమ‌న్నారు...?

రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాది ఆయన సందర్భంగా పలు సర్వే సంస్థలు ప్రజాప్రతినిధుల పనితీరుపై ప్రజానాడిని తెలుసుకునే ప్రయత్నం చేశాయి

By:  Tupaki Desk   |   22 Jun 2025 4:00 AM IST
బాబు-ప‌వ‌న్‌-జ‌గ‌న్‌.. ప్ర‌జ‌లేమ‌న్నారు...?
X

రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాది ఆయన సందర్భంగా పలు సర్వే సంస్థలు ప్రజాప్రతినిధుల పనితీరుపై ప్రజానాడిని తెలుసుకునే ప్రయత్నం చేశాయి. దీనిలో భాగంగా మూడు పార్టీలకు చెందిన ముఖ్య నాయకుల పట్ల ఆయా నియోజకవర్గాల్లో ప్రజలు ఏమనుకుంటున్నారు, వారి పనితీరు ఎట్లా ఉంది అనే విషయాలను తెలుసుకునే ప్రయత్నం చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పం నియోజకవర్గంలో ప్రజలు సీఎం చంద్రబాబు పనితీరు పట్ల సంతోషం వ్యక్తం చేశారు. సమస్యలపై స్పందించేందుకు నియోజకవర్గంలో మండలాల భారీగా నాయకులను ఎంపిక చేయడం వారి ద్వారా సమస్యలను సత్ప్రరమే పరిష్కరించే లా ఏర్పాట్లు చేయడం స్థానికంగా చంద్రబాబు పేరును స్మరించేలా చేస్తుంది.

ముఖ్యంగా కుప్పం నియోజకవర్గంలోని పలు మండలాల్లో పీఎం సూర్యగర్ యోజన పథకం కింద ఇంటింటికి సోలార్ విద్యుత్తు యూనిట్ లను బిగించారు. అదేవిధంగా ప్రతి మండలంలోనూ తాగునీటి సౌకర్యం సాగునీటికి సంబంధించిన చిన్నపాటి ప్రాజెక్టులను కూడా ఇటీవల కాలంలో ప్రారంభించారు. ప్రస్తుతం ఏడాది పాలనపై ముఖ్యంగా చంద్రబాబు పనితీరుపై కుప్పం ప్రజలు హ్యాపీగా ఫీలవుతున్నారు. ఇక ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ విషయానికి వస్తే పిఠాపురం ప్రజలు కూడా పవన్ కళ్యాణ్ పట్ల సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

ఆయన పట్ల ఉన్న అభిమానం ఎక్కడ చెక్కుచెదరకపోవడం గమ‌నార్హం. ఇటీవల నిర్వహించిన ఓ సంస్థ సర్వేలో పిఠాపురం నియోజకవర్గంలో పవన్ కళ్యాణ్ కు 99 శాతం మంది అనుకూలంగా తమ ఫీడ్బ్యాక్ ఇవ్వడం విశేషం. ముఖ్యంగా అభివృద్ధి గ్రామీణ ప్రాంతాల్లో జరుగుతున్న రహదారుల నిర్వహణ వంటివి పవన్ కళ్యాణ్ కి మంచి పేరుతెస్తున్నాయి. చిన్నపాటి వివాదాలు ఉన్నప్పటికీ వాటిని పవన్ కళ్యాణ్ తో ముడిపెట్టి చూసేందుకు ప్రజలు సిద్ధంగా లేరు. ఆ వివాదాలకు పవన్కు సంబంధం లేదని మెజారిటీ ప్రజలు అభిప్రాయం వ్యక్తం చేశారు.

అదే విధంగా పవన్ కళ్యాణ్ కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా తమకు సహాయం చేస్తున్నారని మెజారిటీ వర్గాలు చెప్పడం విశేషం. ఇక వైసిపి అధినేత పులివెందుల ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి విషయానికి వచ్చిన దాదాపు ఇదే పరిస్థితి కనిపిస్తోంది. ఆయన నియోజకవర్గానికి దూరంగా ఉన్నప్పటికీ ఎంపీ అవినాష్ రెడ్డి నేతృత్వంలో పనులు జరుగుతున్నాయని ఎక్కడ వారు చెప్తున్నారు. పార్టీ అధికారంలో లేకపోయినా ఇక్కడ అభివృద్ధి పనులు జరుగుతున్నాయని చెప్పడం విశేషం.

జగన్ విషయంలో ఇక్కడ మెజారిటీ ప్రజలు సానుభూతి కోణంలోనే ఉన్నారు అధికారం పోయింది అన్న ఆవేదన కొంతమందిలో కనిపించిన ఎక్కువమంది ప్రజలు అధికారంలో ఉన్న లేకపోయినా జగన్ వెంట ఉన్నట్టుగా మాట్లాడటం ఆయన పట్ల సానుభూతి కోణం వ్యక్తం చేయడం విశేషం. మొత్తంగా ఈ ముగ్గురు కీలక నాయకులు పనితీరుపై ప్రజలు సంతృప్తితో ఉండడం విశేషం.