Begin typing your search above and press return to search.

ఎరువులు బొక్కిన త‌మ్ముళ్లెవ్వ‌రు?: చంద్ర‌బాబు నిప్పులు

``రాష్ట్రంలో రైతుల కోసం కేంద్రాన్ని బ‌తిమాలి.. తెచ్చిన ఎరువులు మ‌నోళ్లే దారి మ‌ళ్లించారు. ఈ విషయంలో దాప‌రికాలు లేవ్‌.

By:  Garuda Media   |   23 Aug 2025 2:00 AM IST
ఎరువులు బొక్కిన త‌మ్ముళ్లెవ్వ‌రు?: చంద్ర‌బాబు నిప్పులు
X

``రాష్ట్రంలో రైతుల కోసం కేంద్రాన్ని బ‌తిమాలి.. తెచ్చిన ఎరువులు మ‌నోళ్లే దారి మ‌ళ్లించారు. ఈ విషయంలో దాప‌రికాలు లేవ్‌. మీ వ‌ల్ల నేను చెడ్డ‌పేరు తెచ్చుకోను. వారెవ‌రో.. ఎందుకు దారి మ‌ళ్లించారో.. తెలు సుకుని.. 24 గంట‌ల‌లో తేల్చేయండి.`` అని సీఎం చంద్ర‌బాబు వ్య‌వ‌సాయ శాఖ మంత్రి అచ్చెన్నాయు డుకు తేల్చి చెప్పారు. ఎవ‌రినీ వ‌దిలి పెట్టొద్ద‌ని ఆదేశించారు. ప్ర‌స్తుతం రాష్ట్ర వ్యాప్తంగా రైతులు డీఏపీ, ఎరువుల కోసం ఎదురుచూస్తున్నారు. ఇటీవ‌ల కేంద్రం కూడా.. ఇత‌ర రాష్ట్రాల కంటే కూడా.. ఎక్కువ‌గానే ఏపీకి ఎరువులు ఇచ్చింది.

అయితే.. వ‌చ్చిన పాయింట్ నుంచే ఎవ‌రులు స‌గానికిపైగా దారి మ‌ళ్లాయి. దొంగ పేర్ల‌తో.. న‌కిలీరైతుల పేర్ల‌తో డీఏపీని దారి మ‌ళ్లించార‌న్న ఆరోప‌ణ‌లు వ‌చ్చాయి. అయితే.. ఇది జ‌రిగి మూడు రోజులు అయింది. ఈ క్ర‌మంలోతాజాగా టీడీపీ అనుకూల మీడియా ఒక‌టి పెద్ద ఎత్తున దీనిని హైలెట్ చేసింది. ఎరువులూ.. తినేశారు.. అంటూ.. పెద్ద ఎత్తున క‌థ‌నం రాసింది. దీనిపై ఆగ్ర‌హం వ్య‌క్తం చేసిన‌.. చంద్ర‌బాబు ప్ర‌స్తుతం ఢిల్లీలో ఉన్న‌ప్ప‌టికీ, అక్క‌డి నుంచే వీడియో కాన్ఫ‌రెన్సు ద్వారా వ్య‌వ‌సాయ శాఖ మంత్రి అచ్చెన్నాయు డు, సీఎస్ విజ‌యానంద్‌తో మాట్లాడారు.

రైతుల కోసం అనేక ప‌నులు చేస్తున్నామ‌ని.. ఇటీవ‌లే అన్న‌దాత సుఖీభ‌వ నిధులు కూడా ఇచ్చామ‌ని చంద్ర‌బాబు చెప్పారు. ఇప్పుడు వారు ఆ సొమ్ముతో ఎరువులు కొనుగోలు చేసుకునేందుకు రెడీ అయితే.. దారి మ‌ళ్లించ‌డం ఏంట‌ని నిల‌దీశారు. ఎక్క‌డెక్క‌డ దారి మ‌ళ్లాయో.. అక్క‌డ విస్తృతంగా త‌నిఖీలు చేసి.. తిరిగి గోడౌన్ల‌కు చేర్చాల‌ని.. ఎరువులు బొక్కేసిన వారు ఎంత‌టి వారైనా క్రిమిన‌ల్ కేసులు పెట్టాల‌ని ఆదేశించారు. ``ఉపేక్షిస్తుంటే.. ఆట‌గా ఉంది. సహించేది లేదు. రైతుల‌కు మేలు జ‌ర‌గాలి. రైతుల‌కు వాటిని అందించాలి.`` అని తేల్చి చెప్పారు.