ఇంటింటికీ వెళ్లకపోతే.. ఇంటికెళ్లిపోతారు: చంద్రబాబు
కూటమి ప్రభుత్వాన్ని లీడ్ చేస్తున్న టీడీపీ.. గత సోమవారం నుంచి `ఇంటింటికీ` కార్యక్రమాన్ని ప్రారంభించింది.
By: Garuda Media | 1 Aug 2026 12:00 AM ISTకూటమి ప్రభుత్వాన్ని లీడ్ చేస్తున్న టీడీపీ.. గత సోమవారం నుంచి `ఇంటింటికీ` కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఈ క్రమంలో గత ఐదురోజుల్లో జరిగిన కార్యక్రమంపై పార్టీ అధినేత, సీఎం చంద్రబాబు సమీక్షించారు. మంగళగిరిలోని పార్టీ కార్యాలయానికి శనివారం చేరుకున్న ఆయన.. ఇంటింటికీ కార్యక్రమంపై ఆరా తీశారు. అయితే.. కొన్ని జిల్లాల్లో ఇంకా ఈ కార్యక్రమం ప్రారంభం కాలేదని సీనియర్లు చెప్పారు. ముఖ్యంగా సీమలోని 4 జిల్లాల్లో కేవలం చిత్తూరులో మాత్రమే ప్రారంభమైందన్నారు.
ఉత్తరాంధ్రలో మాత్రం భోగాపురం విమానాశ్రయం ప్రారంభోత్సవం ఉన్న నేపథ్యంలో అక్కడ మినహాయించారు. ఉత్తరాంధ్ర జిల్లాల్లో వచ్చే సోమవారం నుంచి ఇంటింటికీ కార్యక్రమాన్ని చేపట్టాలని ఆదేశిం చారు. మరి మిగిలిన కోస్తా, సీమల్లో పరిస్థితి ఎలా ఉందన్న ప్రశ్నకు నామమాత్రంగానే సాగుతోందని.. ఇంకా నాయకులు ముందుకు రావడం లేదని పలువురు నేతలు వెల్లడించారు. ఇదేసమయంలో మై టీడీపీ యాప్ ద్వారా కూడా.. చంద్రబాబు పరిశీలన చేశారు.
దీనిలోనూ కొద్ది మంది నేతలు మాత్రమే ఇంటింటికీ కార్యక్రమానికి సంబంధించిన ఫొటోలను, వీడియోల ను షేర్ చేశారు. దీంతో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబు.. ఇది సరైన విధానం కాదన్నారు. పార్టీ ఇచ్చిన పిలుపును ఇలా లైట్‌గా తీసుకోవడాన్ని ఉపేక్షించేది లేదని తేల్చి చెప్పారు. పార్టీ ముందు.. అన్న నినాదాన్ని ఎందుకు పాటించడం లేదని ప్రశ్నించారు. ఇంటింటికీ వెళ్లి .. ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలను.. పెట్టుబడులను వివరించాల్సిందేనని తేల్చి చెప్పారు.
అదేసమయంలో కూటమి పార్టీలను కూడా కలుపుకొని పోవాలని చంద్రబాబు మరోసారి సూచించారు. సీమలోని చిత్తూరులో పార్టీ నాయకులు ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నా..కూటమి నాయకులు లేకపోవడా న్ని ఆయన సీరియస్‌గా తీసుకున్నారు. తక్షణమే అందరికీ సందేశం పంపించాలని.. సీనియర్ నేతలను ఆదేశించారు. జిల్లాలఇంచార్జ్‌లు, మండలస్థాయి నాయకులను సమన్వయం చేసుకుని.. పార్టీ తరఫున ప్రజలను కలుసుకోవాలని.. ప్రజల నుంచి ఫీడ్ బ్యాక్ తీసుకుని మై టీడీపీ యాప్ లో అప్‌లోడ్ చేయాలని సూచించారు. ఇంటింటికీ కార్యక్రమానికి వెళ్లని వారు.. ఇక, ఇంటికే పరిమితమై పోతారని ఘాటుగా హెచ్చరించారు.
