బటన్ నొక్కి చేయి వాచింది ...బాబుని చూసి జగన్ !
ఇక చూస్తే జగన్ అయిదేళ్ళూ సంక్షేమ క్యాలెండర్ పెట్టి మరీ పధకాలను అమలు చేశారు. ఆయన అన్ని పధకాలను తాడేపల్లిలోని తన ఆఫీసులో కూర్చుని బటన్ నొక్కి ఇచ్చేవారు.
By: Satya P | 7 Oct 2025 3:00 PM ISTఏది ఏమైనా చంద్రబాబుని ట్రూ పొలిటీషియన్ గా చెప్పాలి. బాబు లాంటి నాయకుడు దేశంలో ఎక్కడా లేరు అని కూడా చెప్పవచ్చు అదేదో సినిమాలో భానుమతి సింగిల్ పీస్ అని హీరోయిన్ అంటుంది. అలా రాజకీయలలో చూస్తే చంద్రబాబు సింగిల్ పీస్. ఆయన లాంటి వారు ఆయనకు ముందు ఎవరూ లేరు. తరువాత వస్తారు అన్న నమ్మకం కూడా లేరు. చంద్రబాబు బుర్ర ఒక పాదరసం. ఆయన ఆలోచనలు అందుకోవడం చాలా కష్టం. ఓటములు అన్నవి రాజకీయంగా మామూలే కానీ బాబు ఒక పొలిటీషియన్ గా ఎపుడూ ఫెయిల్ కాలేదు.
పీక్స్ లోకి వెళ్ళిందిగా :
బాబుని ప్రేమించవచ్చు, లేదా ద్వేషించవచ్చు కానీ ఏదో సమయంలో ఆయన చేసినది రైట్ అని కొన్ని అంశాలలో అయినా అనుకోవడం మాత్రం ఎవరైనా చేయాల్సిందే అంటున్నారు. ఇక ఏపీలో చూస్తే జగన్ సంక్షేమ పధకాలను వెల్లువలా ఇచ్చారు. కానీ ఏమి ప్రయోజనం 2024 ఎన్నికల్లో ఓటమి పాలు అయ్యారు. అదే చంద్రబాబు గత పదిహేను నెలలుగా పధకాలు ఇస్తున్నారు. అందులో చాలా వరకూ ఆయన హయాంలో లేదా జగన్ హయాంలో లేదా పొరుగు రాష్ట్రాలలో ఇచ్చినవీ అమలు అయినవే. ఏ ఒక్కటీ కొత్త కానే కాదు, కానీ జనాలకు మాత్రం ఆ పధకాలు సరికొత్తగా చేర్చడంతో వాటి గురించి పీక్స్ లో పబ్లిసిటీ చేసుకోవడం ద్వారా బాబు జనంలోకి దూసుకునిపోతున్నారు. ఆయనే ఆ పధకాల సృష్టి కర్త అని ఆయన చేతులకు ఎముక లేదని కూడా జనాలు అనేక మంది అనుకునేటట్లుగా చేసుకోగలుతున్నారు అని అంటున్నారు.
జగన్ ఫెయిల్ అయ్యారా :
ఇక చూస్తే జగన్ అయిదేళ్ళూ సంక్షేమ క్యాలెండర్ పెట్టి మరీ పధకాలను అమలు చేశారు. ఆయన అన్ని పధకాలను తాడేపల్లిలోని తన ఆఫీసులో కూర్చుని బటన్ నొక్కి ఇచ్చేవారు. అంతే గుట్టు చప్పుడు కాకుండా రెండవ కంటికి తెలియకుండా ఆ పధకాలు లబ్దిదారుల ఖాతాల్లోకి వెళ్ళిపోయాయి. వాటిని వారు అందుకున్నారు తమ ఖాతాలలో పడింది వారు హ్యాపీగా ఖర్చు చేసుకున్నారు. కానీ ఇచ్చింది ఎవరు అన్నది జనాలకు గుర్తు చేసే మెకానిజం వైసీపీ వాడలేదు. పైగా జగన్ కూడా ఎక్కడికీ పోలేదు. ఆయన బటన్ నొక్కుతూనే ఉన్నారు. అలా తాను 275 సార్లు బటన్ నొక్కానని జగన్ ఎన్నికల సభలలో చెప్పుకున్నారు కానీ రిజల్ట్ మాత్రం తేడా కొట్టేసింది. జగన్ అయితే బటన్ నొక్కి అలసి పోయారు. తన పధకాలను తాను సృష్టించిన పధకాలను సైతం ప్రచారం చేసుకోవడంలో చేతగాక ఫెయిల్ అయ్యారు అని అంటున్నారు.
అందరికీ గురువుగానే :
ఇక్కడే బాబుని చూసి అంతా నేర్చుకోవాలని అంటున్నారు. చంద్రబాబు కూటమి నేతలకే గురువు పెద్ద కాదు వింటే నేర్చుకునే ఓపిక ఉంటే అందరికీ గురువే అంటున్నారు. పధకం ఇచ్చేశాం బాధ్యత తీరిపోయింది అని బాబు అనుకోలేదు. ప్రతీ నెలా పెన్షన్ పంపిణీ కోసం జిల్లాలు పట్టుకుని తిరుగుతున్నారు. ఆయన అన్ని చోట్లకు వెళ్తున్నారు జనాలతో మమేకం అవుతున్నారు. ఎన్నికల్లో గెలిచిన మరుసటి రోజు నుంచే 2029 ఎన్నికల ప్రచారాన్ని ఒక విధంగా మొదలెట్టేశారా అని కూడా అంటున్నారు. ఇపుడు బాబున్ చూసి వైసీపీ జగన్ సైతం తాము ఆ విధంగా ఎందుకు ప్రచారం చేసుకోలేకపోయామని అంతర్మధనం చెందితే ఆ తప్పు వారిదే తప్ప బాబుది కాదు, నాయకుడు అంటే ఇలాగే ఉండాలి మరి అదే బాబు చేసి చూపిస్తున్నారు అని అంటున్నారు పధకాలు తీసుకునే జనాలు అన్నీ మరచిపోతారు అన్నది బాబుకు బాగా తెలుసు అందుకే పదే పదే గుర్తు చేస్తున్నారు జనాలు అలా కాదు దేవుళ్ళు అని భావించి వారికే వదిలేసిన జగన్ ఇపుడు మాజీ అయ్యారు. ఇకనైనా వైసీపీ జనంలోకి వెళ్ళి తమ హయాంలో చేసిందేంటో చెప్పుకోవాలని అంటున్నారు.
