బాబు సరికొత్త రికార్డు
ఇక తెలుగుదేశం పార్టీని 1983లో స్థాపించారు. ఆనాడు అన్న ఎన్ టీఆర్ తొలి ప్రెసిడెంట్ అయ్యారు. ఆయన 1995లో పార్టీ చీలిపోయేంతవరకూ అదే హోదాలో కొనసాగారు.
By: Tupaki Desk | 28 May 2025 3:15 PMతెలుగునాట ఒక బలమైన పార్టీకి నాలుగు దశాబ్దాలకు పైగా చరిత్ర ఉన్న పార్టీకి దశాబ్దాల తరబడి నాయకత్వం వహించడం మామూలు విషయం కానే కాదు. ఆ రికార్డుని చంద్రబాబు సాధించారు. తెలుగుదేశం పార్టీ మహానాడులో చంద్రబాబు మరోసారి ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడిగా ఎన్నిక అయ్యారు. చంద్రబాబు ఈ ఎన్నికతో సరికొత్త రికార్డుని సృష్టించారు అని చెప్పాలి.
ఇదిలా ఉంటే చంద్రబాబు ఇప్పటికి టీడీపీ అధ్యక్ష పగ్గాలు అందుకుని మూడు దశాబ్దాలు అయింది. ఆయన 1995లో తెలుగుదేశం పార్టీకి అధ్యక్షుడిగా తొలిసారి ఎన్నిక అయ్యారు. అప్పట్లో హైదరాబాద్ లోని బసంత్ టాకీస్ లో జరిగిన తెలుగుదేశం పార్టీ ముఖ్య నేతల సమావేశంలో బాబుని పార్టీ ప్రెసిడెంట్ గా ఎన్నుకుంటూ తీర్మానాన్ని ఆమోదించారు. ఆ తరువాత 1995లో సెప్టెంబర్ ఒకటవ తేదీన ఉమ్మడి ఏపీకి బాబు ముఖ్యమంత్రి అయ్యారు
ఇక చూసుకుంటే 2024లో జరిగిన ఎన్నికలతో చంద్రబాబు నాలుగవ సారి సీఎం గా బాధ్యతలు స్వీకరించారు. ఇది కూడా ఒక రికార్డు. తెలుగు నాట ఉమ్మడి ఏపీకి తొమ్మిదేళ్ళకు పైగా సీఎం గా పనిచేసిన ఘనత బాబుదే. ఇక విభజన ఏపీలో ఈ టెర్మ్ తో పదేళ్ళ పాటు సీఎం గా పనిచేసిన క్రెడిట్ ఆయనకే ఉంటుంది. ఆ విధంగా బాబు మాదిరిగా ఎవరూ కూడా ఇంత సుదీర్ఘ కాలం రెండు రాష్ట్రాలలోనూ సీఎంలు అయిన హిస్టరీ లేదు. ఉమ్మడి ఏపీకి సీఎం గా చేసి ఈ రోజుకీ రాజకీయంగా చురుకుగా ఉంటూ సీఎం గా చేస్తున్న వారుగా బాబుని చూడాల్సి ఉంటుంది.
అలాగే తెలుగుదేశం పార్టీకి మరో రెండేళ్ల పాటు ఆయన ప్రెసిడెంట్ గా ఉంటారు. ఇక 2027లో మరోసారి జరిగే మహానాడులో బాబు అదే పదవిలో కొనసాగుతారు అని అంటున్నారు. టోటల్ గా చూస్తే టీడీపీ ప్రెసిడెంట్ గా ఆయన కొత్త హిస్టరీ క్రియేట్ చేశారు అని చెప్పాలని అంటున్నారు.
ఇక తెలుగుదేశం పార్టీని 1983లో స్థాపించారు. ఆనాడు అన్న ఎన్ టీఆర్ తొలి ప్రెసిడెంట్ అయ్యారు. ఆయన 1995లో పార్టీ చీలిపోయేంతవరకూ అదే హోదాలో కొనసాగారు. అంటే మొత్తం 13 ఏళ్ళ పాటు అని చెప్పారు. కానీ బాబు మాత్రం టీడీపీకి ఎన్ టీఆర్ కంటే రెట్టింపు కాలం ఆ పదవిలో కొనసాగడం విశేషంగా చెప్పుకోవాలి. క్యాడర్ తో మమేకం కావడం పార్టీని తనదైన శైలిలో తీర్చిదిద్దడం ద్వారానే బాబు టీడీపీ అధ్యక్షుడిగా లాంగ్ టెర్మ్ కొనసాగుతున్నారని అంటున్నారు.
టీడీపీలో బాబు 1984లో చేరారు. ఒక తరువాత ఆయన పార్టీ ప్రధాన కార్యదర్శిగా వ్యవహరించేవారు. ఒక దశలో పార్టీ కో ఆర్డినేటర్ గా కూడా ఎన్టీఆర్ హయాంలో పనిచేశారు. ఆయన పార్టీలో అంచెలంచెలుగా ఎదిది ఈ రోజున పార్టీని మొత్తాన్ని శాసించే స్థాయికి చేరుకున్నారు బాబు లేని టీడీపీని ఊహించుకోవడం చాలా కష్టమన్నది అందరి మాటగా ఉంది. అంతలా పసుపు పార్టీతో బాబు బంధం పెనవేసుకుని పోయింది.
బాబు నాయకత్వ లక్షణాలే ఆయనకు ఇంతటి ప్రాధాన్యతను ఇచ్చాయని చెప్పాలి. పార్టీలో అందరితో ఆయన మెలిగే విధానం క్యాడర్ కి లీడర్ కి ఇచ్చే గౌరవం మర్యాద మిగిలిన రాజకీయ పార్టీల అధినేతలకు కూడా ఒక స్పూర్తి అని చెప్పాల్సి ఉంటుంది. పార్టీని పదికాలాల పాటు మనుగడలో ఉంచాలంటే ఏమి చేయవచ్చే బాబుని చూసే నేర్చుకోవాలి.
బాబు నాయకత్వ పటిమ దీక్షా దక్షతలు దేశంలో చాలా కొద్ది మందిలో మాత్రమే కనిపిస్తాయి. ఇక రాజకీయాలను తన ఆశగా శ్వాసగా మార్చుకుని నిరంతరం పనిచేసే ఆయన తత్వం మాత్రం ఎవరికీ దాదాపుగా లేవనే చెప్పాలి. అందుకే బాబు భారత దేశ రాజకీయ నాయకులలో ఒక అరుదైన నేతగా నిలిచారు. ఆయనకు దేశ రాజకీయ చరిత్రలో ఒకే పేజి అంటూ ఉంటుంది అనే చెప్పాలి అదంతా ఆయన కష్టంతో సాధించుకున్నదే అని కూడా చెప్పాలి.