తమ్ముళ్లపై బాబు యాక్షన్.. ఈ సారి ఎలా ఉందంటే..!
ఈ క్రమంలో తాజాగా పార్టీ నాయకులతో భేటీ అయిన ఆయన సహజంగానే అదే యాంగిల్‌లో క్లాస్ తీసు కుంటారని నాయకులు లెక్కలువేసుకున్నారు.
By: Garuda Media | 12 Jan 2026 12:00 PM ISTప్రతి శనివారం.. పార్టీ నేతలతో భేటీ అవుతున్న టీడీపీ అధినేత, సీఎం చంద్రబాబు... తాజాగా కూడా పార్టీ నాయకులతో మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో భేటీ అయ్యారు. అయితే.. తరచుగా ఆయన పార్టీ నేతల వైఖరిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న విషయం తెలిసిందే. కొన్ని రోజుల కిందట కూడా.. పార్టీ నాయకు లు సరిగా పనిచేయడం లేదన్నారు. తాను చెప్పినట్టు నడచుకోవడం లేదని ఆవేదన, ఆగ్రహం కూడా వ్యక్తం చేశారు.
ఈ క్రమంలో తాజాగా పార్టీ నాయకులతో భేటీ అయిన ఆయన సహజంగానే అదే యాంగిల్‌లో క్లాస్ తీసు కుంటారని నాయకులు లెక్కలువేసుకున్నారు. పార్టీ కార్యాలయానికి 30 మంది నాయకులు, 120 మంది కార్యకర్త లకు పైగా వచ్చారు. కానీ, వారంతా బాబు వచ్చి వెళ్లే వరకు కూడా బిక్కు బిక్కుమంటూనే ఉన్నా రు. ఏ సమస్యలను ప్రస్తావిస్తారో.. ఎక్కడ లోపాలు ఉన్నాయని చెబుతారోఅని వాటిల్లారు. కానీ, వారు ఊహించిన దానికి భిన్నంగా చంద్రబాబు వ్యవహరించారు.
ఈ సారి నాయకుల వ్యవహార శైలిపై ఆయన ఒకింత సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ నెల 1కి ముందుగానే పింఛన్లు పంపిణీ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన ఈ కార్యక్రమంలో తాను విదేశాల్లో ఉన్నప్పటికీ.. నాయకులు జోరుగా పాల్గొని సక్సెస్ చేయడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. ఇక, ప్రభుత్వ కార్యక్రమాల తీరును ప్రజల్లోకి తీసుకువెళ్లడంలో 88 శాతం మంది నాయకులు బాగానే పనిచేశారని తెలిపారు. దీనిని కొనసాగించాలని.. 100 శాతం మంది ప్రజల్లో ఉండాలని చంద్రబాబు సూచించారు.
అయితే.. క్షేత్రస్థాయిలో వైసీపీని టార్గెట్ చేసే విషయంలో మాత్రమే ఇంకా చాలా మంది నాయకులు వెనుకాడుతున్నారని చెప్పారు. వైసీపీ నుంచి టీడీపీలో ఉన్నవారు టార్గెట్ చేస్తున్నట్టుగా కూడా టీడీపీ సంస్థాగత నాయకులు వైసీపీని టార్గెట్‌చేయలేకపోతున్నారని ఆయన చెప్పారు. ఈ విషయంలో ఎందుకు వెనుకబడుతున్నారని.. నాయకులను ప్రశ్నించారు. కార్యకర్తలను కలుపుకొని వెళ్లడంతోపాటు.. జనసేన, బీజేపీతోనూ టచ్‌లో ఉండాలని, ఉమ్మడి కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. దీంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.
