మంత్రులకు క్లాసులు.. గ్రౌండ్ రిపోర్టు బ్యాడేనా ..!
గతంలో వైసీపీ మంత్రి వర్గం.. ఇలానే సాగింది. వన్స్ ఎంపిక చేసిన తర్వాత.. జగన్ తన టీంపై ఎక్కడా ఒక్క మాట కానీ.. ఒక హెచ్చరిక కానీ చేసినట్టు వార్తలు రాలేదు.
By: Tupaki Desk | 13 July 2025 12:00 AM ISTసీఎం చంద్రబాబు.. తరచుగా మంత్రులకు క్లాసులు ఇస్తున్నారని.. వారిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారని.. వార్తలు వస్తున్నాయి. ముఖ్యంగా కేబినెట్ మీటింగ్ ఎప్పుడు జరిగినా.. ఈ తరహా వార్తలు మాత్రం ఖచ్చి తంగా ఉంటున్నాయి. అయితే.. గుండుగుత్తగా అందరినీ హెచ్చరించారని.. లేకపోతే.. ఒక్కొక్కరిగా క్లాస్ ఇచ్చారని తరచుగా వార్తలు రావడం తెలిసిందే. అయితే.. ఇది ఎంతవరకు సమంజసం..? అనేది ప్రశ్న. ఇలా చేస్తే.. మంత్రుల మనోభావాలు దెబ్బతినవా? అనేది మరో అంశం.
అదేసమయంలో ఇలా తరచుగా చంద్రబాబు తన టీంను అదిలించడం అంటే.. ఆయన ఎంపిక సరికాద న్న భావన కూడా వ్యక్తమవుతుంది. సీఎం చంద్రబాబు అంటే.. విజనరీ ముఖ్యమంత్రిగా పేరుంది. సో.. పాలనలో ఆయన మెరుపులు మెరిపిం చాలని భావిస్తారు. ఇది సహజం. దీనికి తగిన విధంగానే మంత్రుల ఎంపిక ఉండాలి. ఉంటుంది. ఒక్కసారి మంత్రి వర్గంలోకి తీసుకున్నాక.. మళ్లీ రీషఫిల్ చేసే వరకు కూడా.. వారిని కాపాడాల్సిన బాధ్యత టీం లీడర్‌గా చంద్రబాబుకే ఉంటుంది.
గతంలో వైసీపీ మంత్రి వర్గం.. ఇలానే సాగింది. వన్స్ ఎంపిక చేసిన తర్వాత.. జగన్ తన టీంపై ఎక్కడా ఒక్క మాట కానీ.. ఒక హెచ్చరిక కానీ చేసినట్టు వార్తలు రాలేదు. అయితే.. అంతర్గతంగా తన టార్గెట్లు వివరించి ఉంటారు. లేదా.. వలంటీర్ వ్యవస్థ ద్వారా.. కీలక పనులు పూర్తి చేయించే ప్రక్రియ నడిచింది. ఇలా.. మొత్తంగా జగన్ హయాంలో మంత్రులకు క్లాసు ఇచ్చారు... వార్నింగులు ఇచ్చారు.. అనే వార్తలు ఎక్కడా కనిపించలేదు.
కానీ, చంద్రబాబు హయాంలో గతంలోనూ.. ఇప్పుడు కూడా అదే పద్ధతి కొనసాగుతోంది. దీనివల్ల.. చంద్ర బాబు ఒక్కరే పనిచేస్తున్నారన్న ఫీలింగ్ ప్రజల్లో కలుగుతుందని అంచనా వేసుకున్నా.. అసలు.. పనిచేసే అమాత్యులు కూడా క్షేత్రస్థాయిలో చులకన అవుతారు. అధికారుల నుంచి సిబ్బంది వరకు.. కూడా మం త్రులు పలుచన అవుతారన్నది వాస్తవం. గతంలో కేఈ కృష్ణమూర్తి వంటి వారు.. ఈ విషయాన్నే వెల్లడిం చారు. ఇప్పుడు కూడా ఒకరిద్దరు ఇదే అభిప్రాయంతో ఉన్నారు. సో.. చంద్రబాబు ఇలా అదిరించడం బెదిరించడం అనే అంశాలను నాలుగు గోడలకు పరిమితం చేస్తే.. మంత్రులు స్వేచ్ఛగా పనిచేయగలుగుతారు.
