Begin typing your search above and press return to search.

నేత‌లకు ప‌ని: 'బ్లూ ప్రింట్' రెడీ చేస్తున్న చంద్ర‌బాబు

ప్ర‌జ‌ల‌కు ప్ర‌భుత్వం చేస్తున్న‌ మేళ్ల‌ను వివ‌రించ‌డంతోపాటు.. ప్ర‌జ‌ల‌కు చేరువ కావాల్సిన స‌మ‌యం కూడా మొద లైంది. ఇప్పుడు చంద్ర‌బాబు అనుస‌రిస్తున్న విధానాలు, బ్లూ ప్రింట్‌లో పేర్కొన్న‌వి కూడా ఇవేన‌ని తెలిసింది.

By:  Garuda Media   |   19 Dec 2025 6:00 PM IST
నేత‌లకు ప‌ని: బ్లూ ప్రింట్ రెడీ చేస్తున్న చంద్ర‌బాబు
X

ఏపీలో టీడీపీ ఎమ్మెల్యేల‌కు అస‌లు సిస‌లు లెక్క‌లు ఇప్ప‌టి నుంచే ప్రారంభం అవుతున్నాయి. ఏ రాష్ట్రం లో అయినా.. ప్ర‌భుత్వాలు ఏర్ప‌డిన త‌ర్వాత‌.. రెండేళ్ల పాటు ప్ర‌జ‌లు పెద్ద‌గా ప‌ట్టించుకోరు. ఒక‌వేళ ప‌ట్టిం చుకున్నా.. మ‌రోసారి ఎన్నిక‌ల‌కు స‌మ‌యం ఉంటుంది. కాబ‌ట్టి ఇబ్బంది ఉండ‌దు. అలానే ఏపీలోనూ టీడీపీ ఎమ్మెల్యేల‌కు వ‌చ్చే రెండున్న‌రేళ్లు అత్యంత కీల‌క‌మ‌ని సీఎం చంద్ర‌బాబు చెబుతున్నారు. ఈ క్ర‌మంలో ఆయ‌న ప్ర‌జ‌ల‌కు చేరువ అయ్యేందుకు ఉన్న అవ‌కాశాల‌తో బ్లూ ప్రింట్‌ను రెడీ చేస్తున్నారు.

ఈ రెండేళ్ల‌లో ఏం జ‌రిగింద‌న్న‌ది ఎలా ఉన్న‌ప్ప‌టికీ.. వ‌చ్చే రెండు సంవ‌త్స‌రాలు త‌మ్ముళ్ల‌కు అత్యంత కీల‌క స‌మ‌యం అనేది చంద్ర‌బాబు కూడా చెబుతున్న మాట‌. ఎందుకంటే.. వ‌చ్చే ఎన్నిక‌ల‌కు ఇప్ప‌టి నుంచే ప్రిప‌రేష‌న్ చేయ‌డం పార్టీ ప‌రంగా.. ప్ర‌భుత్వ ప‌రంగా జ‌రుగుతున్న కీల‌క చ‌ర్య‌లు. పెట్టుబ‌డులు తీసుకువ‌చ్చారు. సంస్థ‌లు వ‌స్తున్నాయి. సో.. వ‌చ్చే రెండేళ్ల‌లో రాష్ట్రంలో అనేక మార్పులు రానున్నాయి. వీటిని ముందుకు తీసుకువెళ్లేది ప్ర‌భుత్వ‌మే కాదు.. నాయ‌కులు కూడా!. దీనినే బ్లూ ప్రింట్‌లో పేర్కొన్నార‌ని స‌మాచారం.

ప్ర‌జ‌ల‌కు ప్ర‌భుత్వం చేస్తున్న‌ మేళ్ల‌ను వివ‌రించ‌డంతోపాటు.. ప్ర‌జ‌ల‌కు చేరువ కావాల్సిన స‌మ‌యం కూడా మొద లైంది. ఇప్పుడు చంద్ర‌బాబు అనుస‌రిస్తున్న విధానాలు, బ్లూ ప్రింట్‌లో పేర్కొన్న‌వి కూడా ఇవేన‌ని తెలిసింది. ఇప్ప‌టి వ‌ర‌కు చేసిన మంచిని కొన‌సాగిస్తూనే వాటిపై ప్ర‌చారానికి ఆయ‌న శ్రీకారం చుట్ట‌నున్నారు. దీనిలో ఎమ్మెల్యేలు పాలు పంచుకుని.. ప్ర‌భుత్వాన్ని, పార్టీని స‌మాంత‌రంగా ముందుకు తీసుకువెళ్లందుకు ప్ర‌య‌త్నాలు చేయాలి. త‌ద్వారా ఇప్ప‌టి వ‌ర‌కు ఏమైనా తేడా ఉన్న‌ప్ప‌టికీ తుడుచుకునేందుకు ప‌రిస్క‌రించుకునేందుకు అవ‌కాశం ఉంది.

ప్ర‌స్తుతం రాష్ట్రంలో టీడీపీనే అతిపెద్ద పార్టీగా ఉంది. కూట‌మి జ‌న‌సేన, బీజేపీ ఉన్నా... 134 మంది ఎమ్మెల్యేల‌తో టీడీపీ అతి పెద్ద పార్టీగా అవ‌త‌రించిన ద‌రిమిలా.. అంద‌రి ఆశ‌లు, ఆకాంక్ష‌లు కూడా.. ఈ పార్టీ నేత‌ల‌పైనే ఉంటాయి. కాబ‌ట్టి ఈ విష‌యాన్ని టీడీపీ ఎమ్మెల్యేలు గుర్తించాలి. ప్ర‌జ‌ల‌కు చేరువ కావ‌డం.. స‌మ‌స్య‌ల ప‌రిష్కారానికి ప్ర‌య‌త్నించాలి. ఇలా.. చంద్ర‌బాబు వ‌చ్చే రెండేళ్ల‌కు సంబంధించిన బ్లూప్రింట్‌ను రెడీ చేస్తున్నారు. త‌ద్వారా.. పార్టీని.. బ‌లోపేతం చేయ‌డంతోపాటు.. ప్ర‌జ‌ల సంతృప్త స్థాయిని పెంచేందుకు ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు.