జగన్.. క్రిమినల్ లిటిగెంట్: చంద్రబాబు
వైసీపీ అధినేత జగన్.. క్రిమినల్ లిటిగెంట్ అని టీడీపీ అధినేత, సీఎం చంద్రబాబు వ్యాఖ్యానించారు. ఇలాంటి వారి వల్ల ప్రజాస్వామ్యం కూడా ఖూనీ అవుతోందని చెప్పారు.
By: Garuda Media | 22 Oct 2026 3:54 PM ISTవైసీపీ అధినేత జగన్.. క్రిమినల్ లిటిగెంట్ అని టీడీపీ అధినేత, సీఎం చంద్రబాబు వ్యాఖ్యానించారు. ఇలాంటి వారి వల్ల ప్రజాస్వామ్యం కూడా ఖూనీ అవుతోందని చెప్పారు. స్థానిక సంస్థల ఎన్నికలను అత్యంత పారదర్శకంగా ని ర్వహిస్తుంటే.. ఓర్చుకోలేక బెంగళూరు ప్యాలెస్‌లో కూర్చుని ఏపీలో విధ్వంసాలకు ప్లాన్ చేశారని దుయ్యబట్టారు. ఇలాంటి నాయకుడి వల్ల రాజకీయాలు భ్రష్టు పట్టి పోతున్నాయని అన్నా రు. ఈ సందర్భంగా తనకు ఎదురైన ఓ అనుభవాన్ని చంద్రబాబు పంచుకున్నారు. గతంలో తాను యూరప్‌లో పర్యటించినప్పుడు.. యువత రాజకీయాల్లోకి రావాలని ఆహ్వానించిన విషయాన్ని గుర్తు చేసుకున్నారు.
అయితే.. జగన్ వంటి నాయకులు ఉన్నంత వరకు తాము వచ్చేది లేదంటూ.. వారు చెప్పారని, ఏపీలో తమ బంధువులకు కూడా రాజకీ యాలంటే ఆసక్తి ఉందని.. కానీ, జగన్ ను చూసి వారు రాజకీయాలంటేనే అసహ్యం వేస్తోందని అన్నారని చంద్రబాబు వివరించారు. తాజాగా పార్టీ నాయకులు, మంత్రులతో టెలీకాన్ఫరెన్సు నిర్వహించిన చంద్రబాబు స్థానిక సంస్థల ఎన్నికల్లో ఏ విధంగా ముందుకు సాగాలన్న విషయంపై దిశానిర్దేశం చేశారు. పల్నాడు, కడప, ప్రకాశం జిల్లాల్లో జరుగుతున్న ఘర్షణలను ఆయన ప్రస్తావించారు. ఇవన్నీ వైసీపీ చేస్తున్న ప్రయత్నాలేనని తెలిపారు. వారే విధ్వంసం సృష్టించి.. వారే కోర్టుకు వెళ్లే సంస్కృతి జగన్‌కు మాత్రమే ఉందన్నారు.
ఏం జరిగిందని కోర్టుకు వెళ్లారో వారే చెప్పాలన్నారు. కడపలో ఎంపీ అవినాష్‌రెడ్డి, రాజంపేటలో ఎంపీ మిథున్‌రెడ్డిలు ఎలా బరితెగించారో కూడా అందరూ చూశారని.. ఎంపీలకు ఈ ఎన్నికలతో సంబంధం ఏంటని ఆయనప్రశ్నించారు. ఏదో విధ్వంసం సృష్టించి, రాష్ట్రంలో శాంతి భద్రతలకు విఘాతం సృష్టించాలన్న ఏకైక లక్ష్యంతోనే ఇలా చేశారని అన్నారు. చివరకు సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలను కూడా వక్రీకరించి.. ప్రభుత్వాన్ని బద్నాం చేసే ప్రయత్నం చేస్తున్నారని దుయ్యబట్టారు. క్షేత్రస్థాయిలో వైసీపీ ప్రచారాన్ని అడ్డుకోవాలని నాయకులను, మంత్రులను సీఎం చంద్రబాబు కోరారు. ఎక్కడా తగ్గాల్సిన అవసరం లేదన్నారు.
కూటమిగానే..
ప్రస్తుత ఎన్నికల్లో కూటమిగానే నాయకులు ముందుకు వెళ్లాలని చంద్రబాబు మరోసారి చెప్పారు. ఎన్ని ఇబ్బందులు ఎదురైనా నాయకు లు కలివిడిగానే ఉండాలని.. వ్యాఖ్యానించారు. క్షేత్రస్థాయిలో పార్టీ నేతలు అందరినీ కలుపుకొని పోవాలని అన్నారు. ఏకగ్రీవాల విషయం ఎలా ఉన్నా.. ప్రజలను కలుసుకుని ప్రభుత్వం చేసిన మంచిని వివరించాలనిసూపర్ సిక్స్ హామీలపై మరింత ప్రచారం చేయాలని చంద్రబా బు దిశానిర్దేశం చేశారు. అంతేకాదు.. మూడు పార్టీల నాయకులు కూడా ఐక్యంగా ప్రచారానికి వెళ్లాలన్నారు. గెలుపు అనేదిఏకపక్షంగా ఉండాలని.. ఎక్కడా ఉదాసీనత వద్దని చంద్రబాబు దిశానిర్దేశం చేశారు. ఎన్నికలు సజావుగా సాగడంతోపాటు.. ప్రజలు కూడా మెచ్చేలా ఉండాలని అన్నారు.
