Begin typing your search above and press return to search.

బాబు ఒక ఇంటాయన కాదు సుమా !

ఇదిలా ఉంటే చంద్రబాబు అమరావతి రాజధానిలో ఇప్పటికే అయిదు ఎకరాల సువిశాల స్థాంలో ఒక భరీ బంగళా నిర్మించడానికి శంకుస్థాపన చేశారు.

By:  Tupaki Desk   |   14 May 2025 12:09 PM
బాబు ఒక ఇంటాయన కాదు సుమా !
X

టీడీపీ అధినేత ముఖ్యమంత్రి చంద్రబాబుని విపక్షాలు ప్రత్యేకించి వైసీపీ ఎన్నెన్ని మాటలు అనాలో అన్నీ అన్నది. ఆయన ఏపీకి టూరిస్టు మాదిరిగా వచ్చిపోతున్నారు అని విమర్శించేది. ఆయన కరకట్ట వద్ద ఉన్న ఇంట్లో ఉంటున్నారని ఆ ఇల్లు ఆక్రమలతో నిర్మించినది అని చెబుతూ అలాంటి ఇంట్లో ఉంటూ అక్రమార్కులను ఎలా కట్టడి చేస్తారు అని లాజిక్ పాయింట్ ని బయటకు తీసేది.

ఇక చూస్తే 2014 నుంచి 2019 మధ్యలో ఉండవల్లి కరకట్ట వద్ద ఉన్న చంద్రబాబు నివాసం గురించే ఎక్కువగా వైసీపీ మాట్లాడేది. దాంతో టీడీపీ నుంచి కౌంటర్లు ఉన్నా కూడా ఇరకాటం మాత్రం ఎక్కువగానే ఉండేది. ఇక కుప్పంలో 1989 నుంచి వరసబెట్టి గెలుస్తూ వస్తున్న చంద్రబాబు తనకంటూ ఒక ఇల్లు అక్కడ కట్టుకోలేకపోయారు ఆయన ఎప్పటికీ స్థానికేతరుడే అని వైసీపీ కుప్పంలోనూ గట్టిగా విమర్శలు చేసి జనాలను ఎగదోసేది.

మొత్తానికి ఎవరు ఏమన్నారు అన్నది ఒక పక్కన పెడితే చంద్రబాబు మాత్రం కుప్పంలో ఒక ఇల్లు కట్టేసుకున్నారు. ఏకంగా అతి పెద్ద భవంతినే కట్టుకున్నారు. ఆ భవంతిలో సకల సదుపాయాలు ఉన్నాయి. రెండున్నర ఎకరాల స్థలంలో బాబు 2022లో మొదలెట్టిన గృహ నిర్మాణం ఇపుడు పూర్తి అయింది.

ఈ నెల 25న ఆ ఇల్లు గృహ ప్రవేశానికి చంద్రబాబు సతీసమేతంగా వెళ్తున్నారు. ఇక ఈ కార్యక్రమానికి కుప్పం ప్రజానీకం మొత్తం అతిధులుగా ఉండబోతున్నారు. అలాగే నారా వారి పల్లె నుంచి పెద్ద ఎత్తున జనాలు తరలివెళ్ళే అవకాశం ఉంది అని అంటున్నారు.

ఇదిలా ఉంటే చంద్రబాబు అమరావతి రాజధానిలో ఇప్పటికే అయిదు ఎకరాల సువిశాల స్థాంలో ఒక భరీ బంగళా నిర్మించడానికి శంకుస్థాపన చేశారు. ఒక ఏడాది కాలంలో అది పూర్తి అయ్యే చాన్స్ ఉది. వెలగపూడి పరిసరాలలో రైతుల నుంచి కొనుగోలు చేసి తీసుకున్న భూమిలో బ్రహ్మాండమిన భవనాన్ని బాబు నిర్మిస్తున్నారు మరో వైపు చూస్తే హైదరాబాద్ లో ఇప్పటికే బాబుకు ఒక రాజ ప్రసాదం ఉంది.

ఇలా లెక్క వేసుకుంటే బాబు ఒక ఇంటాయన కాదు సుమా అని అంటున్నారు. ఏది ఏమైనా బాబుకు ఏపీలో ఇల్లు లేదు అని ఇపుడు ఎవరూ అనలేరని అంటున్నారు. అలాగే కుప్పంలో ఆయనకు నివాసం లేదని స్థానికేతరుడు అన్న విమర్శలు కూడా చేయడానికి వైసీపీ సహా ఎవరూ సాహసించలేరని అంటున్నారు అందుకే బాబుని ఎవరూ విమర్శిన్వద్దు అని అంటారు. ఆయన తన మీద వచ్చే ప్రతీ విమర్శకూ రీ సౌండ్ లో బదులిస్తారు. సో బాబు కంటే ఏపీలో నిజమైన అసలైన ఇంటాయన ఎవరుంటారు అంటే ఎంతటి విపక్షం అయినా నోరు వెళ్ళబెట్టాల్సిందే.