Begin typing your search above and press return to search.

బాబు అంటే ఎంత ప్రేమ...అప్యాయత చూపిన సీఎం

చంద్రబాబుది నాలుగున్నర దశాబదాల రాజకీయ చరిత్ర. మరో రెండేళ్ళు గడిస్తే ఆయన 50 ఏళ్ళ రాజకీయ జీవితం పూర్తి అవుతుంది.

By:  Satya P   |   8 Aug 2026 1:00 AM IST
బాబు అంటే ఎంత ప్రేమ...అప్యాయత చూపిన సీఎం
X

చంద్రబాబుది నాలుగున్నర దశాబదాల రాజకీయ చరిత్ర. మరో రెండేళ్ళు గడిస్తే ఆయన 50 ఏళ్ళ రాజకీయ జీవితం పూర్తి అవుతుంది. ఈ రోజుకీ యంగ్ అండ్ డైనమిక్ అన్నట్లుగా చంద్రబాబు పనిచేసే విధానం దేశంలో చాలా మందికి ఆదర్శం. ఇదిలా ఉంటే చంద్రబాబుకు ఎంతో మంది అభిమానులు ఉన్నారు. వయో భేదం లేకుండా బాబు అంటే ఎనలేని ప్రేమాభిమానాలను వారు కురిపిస్తున్నారు. ఇక తొంబై ఏళ్ళు పై బడిన వృద్ధ తరం అంటే బాబు పట్ల చూపించే ప్రేమ వేరే లెవెల్ అని చెప్పాల్సి ఉంటుంది. చీరాల ప్రాంతానికి చెందిన తొంబై ఏళ్ళ ఒక వృద్ధురాలి కూడా బాబుకు ఎవర్ గ్రీన్ ఫేవర్ గా వార్తల్లోకి ఎక్కింది. ఆమెను చంద్రబాబు తాజా పర్యటనలో పిలిపించుకుని ఎంతగానో ఆదరించారు. ఆ మధ్యన తూర్పు గోదావరి జిల్లాలో ఒక వయో వృద్ధుడు చంద్రబాబుని కలుస్తాను అని తన కోరిక వెళ్ళబుచ్చడం అది మీడియాలో రావడంతో బాబు స్వయంగా ఆయన్ని పిలిపించుకుని దగ్గరకు తీసి ఆప్యాయతను అందించారు.

ఆసక్తిగా స్పందించిన తీరు :

ఇదిలా ఉంటే పశ్చిమ గోదావరి జిల్లా ఆచంట నియోజకవర్గం కామధేనువు లంక గ్రామానికి చెందిన 96 ఏళ్ల వృద్ధుడు సానబోయిన సత్యనారాయణ విషయంలో ఇలాగే జరిగింది. చంద్రబాబును కలవాలన్న ఆయన కోరిక వీడియో సోషల్ మీడియాలో వైరల్ కాగా వెంటనే స్పందించిన చంద్రబాబు స్వయంగా ఆయన్ని సిద్ధాంతం పర్యటనలో పిలిపించుకుని ఆప్యాయంగా కలిసి మాట్లాడిన సంగతి గుర్తుండే ఉంటుంది. సానబోయిన సత్యనారాయణ అనే 96 ఏళ్ళ వయసు కలిగిన పెద్దాయన చంద్రబాబును ఒక్కసారైనా చూడాలని ఉందని చెప్పిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. దాంతో ఎక్స్ వేదికగా చంద్రబాబు స్పందన: స్పందించి సత్యనారాయణ గారు సిద్ధాంతంలో కలుద్దాం అంటూ బదులిచ్చారు. ఇచ్చిన మాట ప్రకారమే తన పర్యటనలో ఆ పెద్దాయనను దగ్గరకు పిలిచి ఆప్యాయంగా పలకరించి, ఆయన యోగక్షేమాలు తెలుసుకున్నారు. ఇపుడు అచ్చం అలాగే జరిగింది.

వృద్ధురాలి ఆకాంక్ష నెరవేర్చిన బాబు

తనను కలవాలని ఉందన్న చీరాలకు చెందిన 90 ఏళ్ల పుష్పావతిని తాజా పర్యటనలో ప్రత్యేకంగా కలిసిన చంద్రబాబు ఆమె ఆకాంక్షను నెరవేర్చిన తీరు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. చంద్రబాబును కలిసి ఫోటో దిగాలన్న ఆకాంక్షను పుష్పావతి సామాజిక మాధ్యమం ద్వారా వ్యక్తం చేసింది. ఈ విషయం తన దృష్టికి రావటంతో చీరాలలో కలిసి మాట్లాడతానంటూ ఎక్స్ వేదికగా పోస్ట్ చేసిన చంద్రబాబు ఆ హామీ నెరవేర్చారు. ఈ మేరకు చీరాలలో ఆ వృద్ధురాలిని ఆప్యాయంగా పలకరించి ఫోటో దిగడంతో ఆమె ఎంతగానో సంతోషించారు. అంతే కాదు చంద్రబాబుతో ఫోటో దిగటంపై పుష్పావతి ఎంతగనో ఆనందించిన వైనం అందరినీ ఆకట్టుకుంది. ఈ విధంగా చంద్రబాబు పట్ల వయో వృద్ధులు చూపిస్తున్న ప్రేమాభిమానాలు నిజంగా ఆయనకు శ్రీరామ రక్షగానే నిలుస్తాయని అంతా అంటున్నారు.