ఆయన మరో పేరు చాణక్యుడు
చంద్రబాబుకు చాణక్యుడు కి దగ్గర పోలికలు ఉన్నాయి. పైగా ఇద్దరు పేర్లలో మొదటి అక్షరం కూడా చ తో నే మొదలవుతుంది. సవాళ్ళను సోపానాలుగా ఎలా మలచుకోవాలో ఈ ఇద్దరికీ బాగా తెలుసు. చాణక్యుడి వ్యూహాలు అని అంటారు.
By: Tupaki Desk | 20 April 2025 12:20 PM ISTచంద్రబాబుకు చాణక్యుడు కి దగ్గర పోలికలు ఉన్నాయి. పైగా ఇద్దరు పేర్లలో మొదటి అక్షరం కూడా చ తో నే మొదలవుతుంది. సవాళ్ళను సోపానాలుగా ఎలా మలచుకోవాలో ఈ ఇద్దరికీ బాగా తెలుసు. చాణక్యుడి వ్యూహాలు అని అంటారు. ఆయన అర్ధ శాస్త్రంలో నిష్ణాతుడు.
ఇక బాబు చూస్తే ఆయన కూడా అర్ధ శాస్త్రంలోనే పీజీ చేశారు. బాబు కూడా వ్యూహాల పుట్టగా పేరు తెచ్చుకున్నారు. నాడు నందవంశాన్ని నిర్మూలించి చంద్రగుప్త సామ్రాజ్యాన్ని చాణక్యుడు తన తెలివి తేటలతో స్థాపించారు. చంద్రబాబు ఉమ్మడి ఏపీలో తెలుగుదేశం పార్టీని గత నాలుగున్నరేళ్ల పాటు బలోపేతం చేయడమే కాకుండా తాను కూడా నాలుగు సార్లు ముఖ్యమంత్రి అయ్యారు.
జాతీయ స్థాయిలో తెలుగుదేశం పార్టీని కీలకం చేశారు. తెలుగు వారు తలెత్తుకుని తిరిగేలా చూశారు. అతి సామాన్య కుటుంబంలో జన్మించిన చంద్రబాబు అసమాన్యుడిగా ఎదిగిన తీరు ఎందరికో స్పూర్తి దాయకం. బాబు బాల్యం గురించి తెలిస్తే ఆశ్చర్యపోతారు. ఆయన తన ప్రాథమిక విద్యాభ్యాసం కోసం ప్రతీ రోజూ ఏకంగా పదహారు కిలోమీటర్ల దూరంలో ఉన్న బడికి వెళ్ళారు.
తండ్రి కర్జూరం నాయుడుతో కలిసి పొలం పనులలో పాల్గొని దుక్కి దున్నారు. తల్లి వెనకాల ఉంటూ పొగ గొట్టాం తో కళ్ళు మండిపోయేలా ఊదుతూ వంటలో సాయం చేశారు. ఒక సాధారణ వ్యవసాయ కుటుంబంలో రాయలసీమలో చిత్తూరు జిల్లా నారావారి పల్లెలో పుట్టిన చంద్రబాబు ఈ రోజున జాతీయ స్థాయిలో తిరుగులేని నాయకుడిగా ఉన్నారు అంటే అది ఆయన కష్ట ఫలితం. ఆయన పట్టుదల ఆయన సంకల్పానికి అది నిదర్శనంగా చెప్పాలి.
మిన్ను విరిగి మీద పడినా చలించని వ్యక్తిత్వం చంద్రబాబు సొంతం. ఓటమిని సైతం ధీటుగా తీసుకుని మళ్ళీ మొదటి నుంచి పోరాటం చేయడం ఆయన స్వభావం. ఈ సందర్భంగా బాబు గురించి ఒక విషయం చెప్పాలి. 1989లో లోక్ సభకు ఏపీ అసెంబ్లీకి ఒకేసారి ఎన్నికలు జరిగాయి.
ఆ ఎన్నికల్లో టీడీపీకి మొత్తం ఉమ్మడి ఏపీలో 42 లోక్ సభ సీట్లకు గానూ రెండంటే రెండే దక్కాయి. ఇక 294 అసెంబ్లీ సీట్లకు గానూ 73 దక్కాయి. ఈ ఓటమిని నాటి టీడీపీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ తట్టుకోలేకపోయారు. ఆయన మీడియాకు అందుబాటులోకి రాలేదు.
అయితే మీడియా టీడీపీ రియాక్షన్ కోసం చూసింది. ఆ సమయంలో పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఉన్న చంద్రబాబు మీడియాను ఎంతో ధైర్యంగా ఫేస్ చేశారు. వారు అడిగిన ప్రతీ ప్రశ్నకు ఓపికగా లాజిక్ గా జవాబు ఇచ్చారు. ఓటమిని స్పోర్టివ్ గా తీసుకున్నారు. మళ్ళీ మేము జనంలోకి వెళ్తాం, కష్టపడతాం, అధికారంలోకి వస్తామని బాబు చాలా ఆత్మ విశ్వాసంతో చెప్పారు. దటీజ్ చంద్రబాబు.
అలాగే ఆయన టీడీపీ నుంచి 1995లో సీఎం అయ్యాక 1999లో రెండోసారి గెలిచారు. కానీ 2004, 2009లో ఓటమిని చవి చూశారు. కానీ ఎక్కడా మొక్కవోని ధైర్యంతో టీడీపీని నడిపించారు. ఆ సమయంలో టీడీపీని ఎంతో మంది వీడిపోయారు ఒక వైపు తెలంగాణా ఉద్యమం, మరో వైపు వైసీపీని ఏర్పాటు చేసి యువ నేత జగన్ నుంచి ఎదురైన సరికొత్త సవాల్ ఇలాంటి వాటి మధ్యన టీడీపీని కాపాడుకుని 2014లో అధికారం అందుకున్నారు.
ఇక 2019లో మరోసారి ఘోర ఓటమి దక్కింది. అయినా ఆయన ఎక్కడా కుంగిపోలేదు. ఓడిన మొదటి రోజు నుంచి జనంలో ఉంటూ వచ్చారు. అలాగే తాను ఎక్కడా తగ్గాలో ఎలా నెగ్గాలో తెలుసుకున్నారు. కలిసి రాని మిత్రులను చేరదీసి మళ్ళీ పొత్తులను కలుపుకున్నారు.
చరిత్రలో ఎన్నడూ లేని విధంగా 2024 ఎన్నికల్లో టీడీపీ కూటమిని అధికారంలోకి తెచ్చారు ఇక 2024 ఎన్నికల్లో బాబు చేసిన ప్రచారం మరే నాయకుడూ చేయలేదు. ఆ మాటకు వస్తే దేశంలో కూడా ఎవరూ కూడా అంత విగరస్ గా చేయలేదు అని చెప్పాలి. వేసవి ఎండలు ఏకంగా 50 డిగ్రీల సెల్సియస్ లో మిట్ట మధ్యాహ్నం సభలను బాబు నిర్వహించారు. ఆయన షర్ట్ చెమటతో తడిసి ఒంటికి అతుక్కుపోయింది ఆయన చూస్తే పూర్తిగా ఎండ దెబ్బకు గురి అయినా ఎక్కడా వెరవకుండా అత్యధిక సభలను నిర్వహించి మరీ జనాలకు కూటమిని చేరువ చేశారు. అప్పటికి బాబు వయసు 74 ఏళ్ళు.
మరి ఇవన్నీ కావా బాబుని ఈనాటి యువత ఆదర్శంగా తీసుకోవడానికి. చిన్న పాటి బాధకే ఆత్మహత్యలు చేసుకునే వారు బాబు జీవితాన్ని ఒకసారి చూస్తే చాలు ఎక్కడ లేని స్పూర్తి పొందుతారు. బాబు ఎలా పడి లేచిన ప్రతీ సారి ఉవ్వెత్తిన కడలి తరంగంలా లేచి నిలబడ్డారో అందరికీ జీవిత పాఠమే.
బాబు నడిచే రాజకీయ విశ్వవిద్యాలయం. ఆయన లివింగ్ లెజెండ్. ఏపీకి వేరే బ్రాండ్ ఎందుకు చంద్రబాబు ఉండగా అని లోకేష్ చెబుతూ ఉంటారు. అది అక్షర సత్యం. ఏపీ అడ్డగోలు విభజనకు గురి అయినా రాజధాని లేకపోయినా ఏ ఆశలూ అండ దండ లేకపోయినా ఒకే ఒక నిబ్బరం అయిదు కోట్ల ఆంధ్రులకు ఉంది. అదే చంద్రబాబు.
ఆయన ఒక్కడు చాలు. మళ్ళీ ఏపీని జాతీయ స్థాయిలో నిలబెడతారు అన్నది జనం నమ్ముతారు. అమరావతి రాజధానిని ప్రపంచంలో నిలబెడతారు అని విశ్వసిస్తారు. బాబు అంటే అభివృద్ధికి మారు పేరు. ఆయన ఏపీకి నాలుగవ సారి సీఎం కావడం ఆయన కంటే ఏపీకే ఎక్కువ అవసరం అని చెప్పాలి బాబు ఇలాగే మరింత కాలం ఉత్సాహంగా ఉత్తేజంగా పనిచేయాలని ఏపీ అభివృద్ధికి పాటుపడాలని అయిదు కోట్ల ఆంధ్రులూ మనసారా కోరుకుంటున్నారు. బాబు లాంగ్ లివ్ అని అంతా నిండు మనసుతో దీవిస్తున్నారు. ఈ సందర్భంగా బాబుకు 75వ జన్మ దిన శుభాకాక్షలు
