టీడీ జనార్దన్‌కు పదవీ యోగం.. నిజమేనా ..!
టీడీపీ సీనియర్ నేత.. టీడీ జనార్దన్‌కు సీఎం చంద్రబాబు కీలక చాన్స్ ఇస్తున్నారా? .. రాజ్యసభకు ఆయ నను పంపించాలని నిర్ణయించారా?
By: Tupaki Desk | 10 Feb 2026 3:49 PM ISTటీడీపీ సీనియర్ నేత.. టీడీ జనార్దన్‌కు సీఎం చంద్రబాబు కీలక చాన్స్ ఇస్తున్నారా? .. రాజ్యసభకు ఆయ నను పంపించాలని నిర్ణయించారా? అంటే.. ఔననే సమాధానమే వినిపిస్తోంది. సుదీర్ఘకాలంగా టీడీపీతో అనుబంధం పెంచుకున్న టి.డి. జనార్ధన్ మాజీ ఎమ్మెల్సీగా ఉన్నారు. కృష్ణా జిల్లా నుండి శాసనమండలి(ఎమ్మెల్సీ) సభ్యుడుగా గతంలో నామినేట్ అయ్యారు. కృష్ణాజిల్లాకు చెందిన టీడీ జనార్దన్..1957న జన్మించారు. పోస్ట్ గ్రాడ్యుయేట్ (ఎం.ఎ) చదువుకున్న ఆయనకు .. రాజకీయాలు కొత్తకాదు.
జనార్ధన్ తాత, తండ్రి కృష్ణాజిల్లాలోని లింగాల గ్రామానికి సర్పంచ్‌లుగా పనిచేశారు. ఆ తర్వాత.. రాజకీ యాల్లోకి వచ్చిన జనార్దన్.. కృష్ణా జిల్లా కో-ఆపరేటివ్ సెంట్రల్ బ్యాంక్ అధ్యక్షుడిగా 9 సంవత్సరాలు పని చేశారు. అనంతరం.. తెలుగుదేశం పార్టీ (టిడిపి)తో తన రాజకీయ ప్రయాణాన్ని ప్రారంభించారు. 1995లో ఆప్కోబ్ చైర్మన్‌గా తర్వాత.. జెడ్‌పిటిసిగా పనిచేశారు. సహకార సంఘం అధ్యక్షుడుగా కూడా బాధ్యతలు నిర్వహించారు.
ఇక, ప్రజాసేవలోనూ.. జనార్దన్‌రావుకు మంచి పేరుంది. కృష్ణా జిల్లాలోని లింగాల, పోచవరం, గంగెల్లి గ్రా మాలను దత్తత తీసుకున్నారు. జాతీయ సహకార వ్యవసాయం మరియు గ్రామీణాభివృద్ధి బ్యాంకుల సమా ఖ్యకు చైర్మన్‌గా వ్యవహరించారు. ఈ క్రమంలోనే వేలాది మంది రైతులకు ఆయన సాయం చేశారు. రుణా లు ఇప్పించి.. సాగును అభివృద్ధి చేశారు. 2015లో ఆంధ్రప్రదేశ్‌లోని కృష్ణ నుండి శాసనమండలి సభ్యుని గా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. పార్టీ తరఫున బలమైన వాయిస్ వినిపించేవారన్న పేరు తెచ్చుకున్నారు.
బాబు వెంటే..
సీఎం చంద్రబాబుకు నమ్మిన బంటు మాదిరిగా టీడీ జనార్దన్ వ్యవహరిస్తారు. ఆయన ఎక్కడ ఉంటే టీడీ కూడా అక్కడే ఉంటారన్న వాదనుంది. చంద్రబాబు ఢిల్లీ వెళ్లినా.. ఆయనకంటే ముందుగా టీడీ అక్కడకు చేరుకుని ఏర్పాట్లను పరిశీలిస్తారు. ఈ క్రమంలోనే రాజ్యసభకు టీడీని నామినేట్ చేయాలని చంద్రబాబు నిర్ణయించుకున్నట్టు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఈ ఏడాది జూన్‌లో నాలుగు స్థానాలు ఖాళీ అవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఒకసీటును టీడీకి ఖరారు చేసినట్టు అత్యంత విశ్వసనీయ వర్గాల సమాచారం.
