చంద్రబాబు ఓ రాజకీయ ఉద్గ్రంధం.. నేడు.. రేపు..!
``టీడీపీ అధినేతగా చంద్రబాబు ఒక పేరు తెచ్చుకోవచ్చు.. కానీ, ఆయన రాజకీయాలను గమనిస్తే.. నడిచే లైబ్రరీని తలపిస్తారు.`
By: Tupaki Desk | 20 April 2025 4:00 PM IST``టీడీపీ అధినేతగా చంద్రబాబు ఒక పేరు తెచ్చుకోవచ్చు.. కానీ, ఆయన రాజకీయాలను గమనిస్తే.. నడిచే లైబ్రరీని తలపిస్తారు.``- కొన్నాళ్ల కిందట మనకు గవర్నర్‌గా పనిచేసిన.. ఈఎల్ ఎస్ నరసింహన్.. చేసిన వ్యాఖ్య ఇది.(ఐ థింగ్ హీ ఈజ్ నాటోల్నీ ఏ లీడర్. హీ ఈజ్ వాకింగ్ లైబ్రరీ!) అని అన్నారు. నిజం. పాలను పాలగా చూసినంత వరకు దానిలో దాగి ఉన్న పెరుగు-మజ్జిగ-వెన్న-నెయ్యి వంటివి కనిపించవు. దీనికి ఆవల కొంత సాధన చేస్తే.. చంద్రబాబులోనూ మనకు అనేక ద్రుగ్విషయాలు కనిపిస్తాయి.
1) తగ్గడం-నెగ్గడం: రాజకీయాల్లో ఎంతసేపూ.. నెగ్గేందుకు నాయకులు ప్రయత్నిస్తారు. కానీ.. చంద్రబాబు అలా కాదు.. తగ్గడం కూడా తెలిసిన నాయకుడు. అన్నగారు ఎన్టీఆర్ విషయాన్ని తీసుకుంటే.. వ్యవస్థీ కృతంగా పాడైపోతున్న టీడీపీని గాడిన పెట్టేందుకు పార్టీని చేతుల్లోకి తీసుకున్న తీరు.. తగ్గి నెగ్గిన విషయాన్ని కళ్లకు కడుతుంది. ``నిజానికి అప్పుడు బావ(చంద్రబాబు) స్పందించకపోతే.. పార్టీ వేరే వారి చేతిలోకి వెళ్లిపోయేది``అని అన్నగారి కుమారుడు, ఎమ్మెల్యే బాలయ్య చేసిన వ్యాఖ్యలు గుర్తుండే ఉంటుంది.
2) ప్రపంచ అవనికపై: ఎక్కడో ఓ మూలన ఉండే ఏపీని ప్రపంచ స్థాయిలో గుర్తింపు తీసుకురావడంలో చంద్రబాబును మించిన నాయకుడు లేరు. ఒకప్పుడు ఢిల్లీకి వెళ్లేందుకే.. సంకోచించిన నాయకులు.. తర్వాత.. ప్రపంచ దేశాలకు వెళ్లి(వైఎస్) రాష్ట్రాన్ని పారిశ్రామికంగా తీర్చిదిద్దే ప్రయత్నాలకు బీజం చేసింది చంద్రబాబే. ఆయనే కనుక ప్రపంచానికి ఏపీని పరిచయం చేయకపోయి ఉంటే.. ఇతర రాష్ట్రాల్లోఏపీ కూడా ఒకటిగా ఉండిపోయేది అనడంలో సందేహం లేదు.
3) సామాజిక న్యాయం: నేడు ఇతర పార్టీలుఅనుసరిస్తున్న సామాజిక న్యాయాన్ని చంద్రబాబు ఎప్పుడో అవలంభించారు. ఎస్సీ, ఎస్టీ బీసీలకు ప్రాధాన్యం ఇవ్వడంలో అన్నగారిని మించిన దూకుడుతో వ్యవ హరించారు. తొలిసారి ఎస్సీని లోక్‌సభ స్పీకర్‌ను చేసినా.. అసెంబ్లీ స్పీకర్‌ను చేసినా.. అది చంద్రబాబు దూరదృష్టికి నిదర్శనమనే చెప్పాలి. ``నేడు తినడం కాదు.. రేపటి పరిస్థితి ఏంటి? అని ఆలోచించుకోవా లి`` అని పదే పదే చెప్పే చంద్రబాబు.. అచ్చంగా అలానే చేశారు. నాయకులు మారొచ్చు... కానీ,, చంద్రబాబు వేసిన అడుగులు.. చేసిన పనులు మాత్రం భవిష్యత్ తరాలకు మార్గదర్శకంగా నిలిచిపోతాయనడంలో సందేహం లేదు.
