కుప్పానికి కృష్ణమ్మ.. బాబు బ్రహ్మానందం!
ఏపీ సీఎం చంద్రబాబు తన సొంత నియోజకవర్గం చిత్తూరు జిల్లాలోని కుప్పంలో పర్యటిస్తున్నారు.
By: Garuda Media | 30 Aug 2025 4:36 PM ISTఏపీ సీఎం చంద్రబాబు తన సొంత నియోజకవర్గం చిత్తూరు జిల్లాలోని కుప్పంలో పర్యటిస్తున్నారు. శనివారం ఉదయమే ఆయన కుప్పం నియోజకవర్గానికి చేరుకున్నారు. అనంతరం.. కుప్పం నియోజకవర్గాని కి ఇటీవల తరలించిన కృష్ణానది నీటికి జల హారతి ఇచ్చారు. ఈ ప్రాజెక్టును కీలకంగా తీసుకున్న కూటమి ప్రభుత్వం 300 కోట్ల రూపాయల వ్యయంతో దీనిని ఆగమేఘాలపై పూర్తి చేసింది. గతంలో జగన్ దీనికి ప్లాన్ చేశారు. అనంతరం.. కొంత ప్రయత్నం చేసినా.. అప్పట్లో వర్షాలు రావడంతో పనులు ఆగాయి.
ఇక, ఇప్పుడు నాటి ప్లాన్ ప్రకారమే నిర్మాణాలు పూర్తి చేసి.. కృష్ణానదిని కుప్పం వరకు పారించారు. ఈ సం దర్భంగా చంద్రబాబు మురిసిపోయారు. తన సొంత నియోజకవర్గానికి తొలిసారి కృష్ణమ్మ పరుగులు పెట్టి రావడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. నియోజకవర్గం నీటి సమస్యలు పరిష్కారం అవుతాయని పేర్కొన్నారు. రైతులకు సాగునీరు, ప్రజలకు తాగునీటి ఇబ్బందులు తొలిగిపోతాయన్నారు. కాగా.. ఈ పర్యటనలో చంద్రబాబు పెట్టుబడుల కు సంబంధించి జరిగే సదస్సులో పాల్గొంటారు.
అదేవిధంగా కుప్పంలో ఇంటిని పరిశీలిస్తారు. గత రెండు మాసాల కిందటే కుప్పంలో కొత్తగా నిర్మించిన ఇల్లు ప్రస్తుతం ఖాళీగా ఉంది. దీనిలో పార్టీ కార్యాలయం ఏర్పాటు చేయాలన్న ఆలోచన ఉంది. ఈ నేప థ్యంలో దీనిపై స్థానిక నాయకులతో చర్చించి.. కార్యాలయంగా వినియోగించడమా.. లేక పార్టీ కార్యక్రమా లకు వినియోగించడమా? అనే విషయంపై నిర్ణయం తీసుకుంటారు. అదేవిధంగా ప్రజాదర్బార్ నిర్వహిస్తా రు. స్థానిక నాయకులతో కూడా చర్చించనున్నారు. సమస్యల పరిష్కారంపై ఇప్పటికే నియమించిన.. త్రిసభ్య కమిటీ తీర్మానాన్ని కూడా చంద్రబాబు పరిశీలించనున్నారు.
