Begin typing your search above and press return to search.

15 ఏళ్ళ సీఎం బాబు...ఆ రెండూ చేస్తే చరిత్రలో శాశ్వత స్థానం

ఇక చూస్తే కూటమి పాలన ఏడాది పూర్తి అయిన తరువాత బాబుకు సీఎం గా వయసు ఏకంగా 15 ఏళ్ళకు చేరింది. మరో నాలుగేళ్ళు చేతిలో ఆయనకు అధికారం ఉంది.

By:  Tupaki Desk   |   13 May 2025 3:00 AM
15 ఏళ్ళ సీఎం బాబు...ఆ రెండూ చేస్తే చరిత్రలో  శాశ్వత స్థానం
X

తెలుగుదేశం అధినేత చంద్రబాబు తెలుగు నాట సరికొత్త రికార్డు సృష్టించారు. ఆయన 2024లో నాలుగో సారి సీఎం కావడమే ఒక రికార్డు. ఉమ్మడి ఏపీలో ఇప్పటిదాకా ఆ రికార్డు ఎవరికీ లేదు. రెండు సార్లు సీఎంలు అయిన వారే ఎక్కువ మంది ఉన్నారు. దాంతో పాటుగా సుదీర్ఘ కాలం సీఎం గా పనిచేసిన రికార్డు గతంలో కాంగ్రెస్ సీఎం బ్రహ్మానందరెడ్డికి ఉండేది. ఆయన తర్వాత ఎన్టీఆర్ కి ఆయన నుంచి చంద్రబాబుకు దక్కింది. అయితే విభజన తెలంగాణాలో తొమ్మిదిన్నరేళ్ళ పాటు సీఎం గా పనిచేసి బాబు తరువాత స్థానంలో కేసీఆర్ ఉన్నారు.

ఇక చూస్తే కూటమి పాలన ఏడాది పూర్తి అయిన తరువాత బాబుకు సీఎం గా వయసు ఏకంగా 15 ఏళ్ళకు చేరింది. మరో నాలుగేళ్ళు చేతిలో ఆయనకు అధికారం ఉంది. దాంతో ఈ టెర్మ్ లోనే బాబు 19 ఏళ్ళ పాటు సీఎం గా పనిచేసిన రికార్డుని అందుకుంటారు. అలా ఆయన దేశంలో జ్యోతిబసు, నితీష్ కుమార్ నవీన్ పట్నాయక్ వంటి వారి సరసన నిలుస్తారు.

ఇవన్నీ ఇలా ఉంటే బాబు ఉమ్మడి ఏపీకి సీఎంగా ఉండగా చెప్పుకోదగిన అభివృద్ధిని అంతా హైదరాబాద్ కే చేశారు అన్నది అంతా అంటారు. హైదరాబాద్ అత్యంత వేగంగా అభివృద్ధి చెందేలా బాబు తీసుకున్న అనేక నిర్ణయాలు కానీ సైబరాబాద్ సృష్టి కానీ అలాగే ఐటీ క్యాపిటల్ గా హైదరాబాద్ ని మార్చడం కానీ బాబు చేసిన కార్యక్రమాలు ఎన్నో కళ్ల ముందు కనిపిస్తాయి.

ఇక ఏపీకి బాబు చేయాల్సింది ఇపుడే మొదలైంది అని అంటున్నారు. పోలవరం దాదాపు వందేళ్ళ ఆంధ్రుల కోరిక. అది పూర్తి చేసే మహత్తర అవకాశం బాబుకే దక్కబోతోంది అని అంటున్నారు. 2027 నాటికల్లా పోలవరం పూర్తికి తగిన చర్యలు తీసుకుంటున్నారు. పోలవరం ఆంధ్రులకు జీవనాడి అన్నది తెలిసిందే. పోలవరం పరిపూర్తి అయితే ఏపీకి ఎంతో మేలు జరుగుతుంది.

అలా బాబుకి కూడా కీర్తి శాశ్వతంగా వస్తుంది. అదే విధంగా ఆంధ్రులకు రాజధాని లేదు అన్నది ఒక చేదు నిజం. దాని వెనక దశాబ్దాల ఇబ్బందులు ఉన్నాయి. దాంతో ఏపీకి అద్భుతమైన రాజధానిగా అమరావతిని బాబు నిర్మించేందుకు పూనుకున్నారు. అమరావతి రాజధాని కూడా 2027 నాటికి పూర్తి చేయడానికి బాబు ఒక ప్రణాలిక వేసుకున్నారు

నాలుగవసారి సీఎం గా బాబు బాధ్యతలు తీసుకున్న మరుక్షణం అమరావతి గురించే ఎక్కువగా ఫోకస్ పెడుతున్నారు. దానికి తగినట్లుగా పనులు శరవేగంగా మొదలయ్యాయి. అనుకున్నట్లుగా జరిగితే ఈ టెర్మ్ లోనే బాబు స్వప్నమైన అమరావతి రాజధాని పూర్తి అవుతుంది. ఇలా ఏ అంటే అమరావతి పీ అంటే పోలవరం పూర్తి చేయడం ద్వారా బాబు తన పేరుని చరిత్రలో నిలుపుకుంటారు అని అంటున్నారు. మొత్తానికి చంద్రబాబు చేసిన కార్యక్రమాలను కానీ సాధించిన రికార్డులు కానీ సమీప భవిష్యత్తులో ఎవరూ కొట్టలేరని అంటున్నారు.

అంతే కాదు రాజకీయంగా బాబుకు అర్ధ శతాబ్దం పైగా అనుభవం, పాలనానుభవం, ఆయన ఆలోచనలు దార్శనీకత వ్యూహాలు ఇవన్నీ కూడా ఆయనకు రానున్న కాలంలో ఒక ఉన్నత స్థానంలో శాశ్వతంగా ఉంచుతాయని అంటున్నారు. మొత్తానికి బాబు సరైన సమయంలో ఏపీకి సీఎం గా ఉన్నారు దాంతో బాబు చేతుల మీదుగా ఆ రెండు బృహత్తరమైన కార్యక్రమాలు పరిపూర్తి అయి ఆంధ్రులకు రాబోయే తరాలకు శాశ్వత ఆస్తిగా మారనున్నాయి.