Begin typing your search above and press return to search.

కూటమి సంక్షేమ క్యాలెండర్...లబ్దిదారుడే హైలెట్

ఏపీలో టీడీపీ కూటమి సంక్షేమంలో కొత్త పుంతలు తొక్కాలని చూస్తోంది. సూపర్ సిక్స్ హామీలతో అధికారంలోకి వచ్చిన కూటమి వాటిని ఒక్కోటిగా చేసుకుంటూ వస్తోంది.

By:  Satya P   |   13 March 2026 8:32 AM IST
కూటమి సంక్షేమ క్యాలెండర్...లబ్దిదారుడే హైలెట్
X

ఏపీలో టీడీపీ కూటమి సంక్షేమంలో కొత్త పుంతలు తొక్కాలని చూస్తోంది. సూపర్ సిక్స్ హామీలతో అధికారంలోకి వచ్చిన కూటమి వాటిని ఒక్కోటిగా చేసుకుంటూ వస్తోంది. సామాజిక పెన్షన్లు నాలుగు వేల రూపాయలకు చేసింది. తల్లికి వందనం పధకం అమలు చేస్తోంది. ఉచిత బస్సు పధకం ద్వారా మహిళలను ఆకట్టుకునే ప్రయత్నం చేసింది. ఉచిత గ్యాస్ సిలెండర్లతో కూడా కూటమి ప్రభుత్వం తమది సంక్షే బాట అని గట్టిగా చెప్పుకుంది. అయితే ఈ పధకాలు అన్నింటికీ బ్రాండ్ అంబాసిడర్ తామే అని ఒకటికి పదిసార్లు చెప్పుకోవాలని కూటమి ఇపుడు చూస్తోంది.

లబ్దిదారులతో కనెక్షన్ :

పధకాలు అన్నీ అమలు చేస్తున్నా వాటిని అందుకుంటున్న లబ్దిదారులతో డైరెక్ట్ కనెక్షన్ ఉండాలని కూటమి పెద్దలు భావిస్తున్నారు. తాము ఏమి చేశామో చెప్పుకోవడమే కాదు, ఏమి చేయబోతున్నామో కూడా చెప్పనున్నారు. అంతే కాదు సంక్షేమ క్యాలెండర్ ఒక దానిని రిలీజ్ చేయాలని అనుకుంటున్నారు. దాని ప్రకారం ఎపుడు ఏ నెలలో ఏమి పధకాలు వస్తాయో కూడా లబ్దిదారులకు వివరించనున్నారు. ఈ బాధ్యతను కూటమికి చెందిన ప్రజా ప్రతినిధులు నిర్వహించాలని పెద్దలు ఆదేశిస్తున్నారు. అలాగే పధకాలు ఏ లబ్దిదారునికి ఎంతెంత వస్తోంది అన్నది వివరించాలని అధికారులను కోరుతున్నారు.

బాబు వ్యూహాత్మకం :

సంక్షేమ పధకాలను తాము వేల కోట్లు కేటాయించి అ అమలు చేస్తున్నామని వాటిని లబ్దిదారుల చెంతకు చేర్చాల్సిన బాధ్యత అధికారులు ప్రజా ప్రతినిధులదే అని ముఖ్యమంత్రి చంద్రబాబు కోరుతున్నారు. సంక్షేమ క్యాలెండర్ ని త్వరలో విడుదల చేయనున్నట్టుగా కూడా చంద్రబాబు ప్రకటించారు. జిల్లాల కలెక్టర్ల సదస్సులో బాబు ఈ మేరకు ప్రతిపాదించారు సూపర్ సిక్స్, సంక్షేమ పథకాల అమలుపై ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహిస్తూ కొత్త ప్రతిపాదన చేశారు.

కూటమి ప్రభుత్వం ఏపీలో కోట్లాది మంది లబ్దిదారులకు అందించే పెన్షన్, ఉచిత సిలెండర్, తల్లికి వందనం, ఫీజు రీఎంబర్సుమెంట్ లాంటి సంక్షేమ పధకాల గురించి లబ్దిదారులకు పూర్తి వివరంగా తెలియచేయాలని అన్నారు. అలాగే దీపం 2.0 పథకానికి డిజిటల్ ఓచర్ జారీ చేసే అంశాన్ని పరిశీలించాలని చెప్పారు. ఇక ఏపీలో అమలు చేస్తున్న స్త్రీ శక్తి పధకం సూపర్ హిట్ అయింది అని అన్నారు. మార్చి 9 నాటికి 50.45 కోట్ల ఉచిత ప్రయాణాలను మహిళలు చేశారని ఆయన చెప్పారు. కూటమి ప్రభుత్వం కూడా 1,775 కోట్ల రూపాయలను ఆర్టీసీకి రీఎంబర్సు చేసిందని బాబు చెప్పుకొచ్చారు.

పేదరికం తగ్గాలి :

ఏపీలో పేదరికం గణనీయంగా తగ్గాలని బాబు కలెక్టర్ల సదస్సులో కోరారు. పీ 4 వంటి పధకాలను అందుకోసమే తీసుకుని వచ్చామని అన్నారు. ఒక వైపు ఏపీకి పెద్ద ఎత్తున పెట్టుబడులు వస్తున్నాయని. అలాగే ఫోకస్ కూడా ఆ వైపు అధికారులతో సహా అంతా పెట్టారని ఆయన అంటూనే అదొక్కటే చాలదని చెప్పారు. ఏపీలో సంపద సృష్టితో పాటు ప్రజలకు మెరుగైన జీవన ప్రమాణాలు అందేలా కలెక్టర్లు చూడాలని చంద్రబాబు గట్టిగా చెప్పారు. ఏపీ ప్రజలు ఆర్ధికంగా మంచి స్థితిలో ఉండాలన్నదే కూటమి అజెండా అని ఆయన అన్నారు.