ఫోన్ లేకుండా ఇద్దరూ ఉండలేరు...బాబు చెప్పిన నిజం
టీడీపీ అధినేత చంద్రబాబు కేవలం 45 ఏళ్ళ వయసులోనే దక్షిణాదిని అతి పెద్ద రాష్ట్రంగా ఉన్న ఉమ్మడి ఏపీకి సీఎం అయ్యారు.
By: Tupaki Desk | 30 Jun 2025 6:48 PMటీడీపీ అధినేత చంద్రబాబు కేవలం 45 ఏళ్ళ వయసులోనే దక్షిణాదిని అతి పెద్ద రాష్ట్రంగా ఉన్న ఉమ్మడి ఏపీకి సీఎం అయ్యారు. ఆయన యువ ముఖ్యమంత్రిగా పేరు గడించారు. ఆయనకు ఆ రోజులలో ఎంతో తపన ఉండేది. ఏదో సాధించాలని ఉండేది. అపుడే సెల్ ఫోన్ టెక్నాలజీ ప్రపంచానికి పరిచయం అవుతున్న దశ.
దాంతో టెక్నాలజీని బాగా ఇష్టపడే బాబు అయితే మీడియా ముఖంగానూ సభలలోనూ చిట్ చాట్ సందర్భంగానూ సెల్ ఫోన్ గురించి ఎక్కువగా చెబుతూ ఉంటే వారు. సెల్ ఫోన్లు ఫ్యూచర్ ని శాసిస్తాయని ఆనాడే బాబు గట్టిగా చెప్పుకొచ్చేవారు.
అయితే ఇప్పటికి పాతిక ముప్పయ్యేళ్ళ క్రితం అయితే సెల్ ఫోన్ల గురించి అంతగా అవగాహన లేదు. దాంతో చాలా మంది కనీస సదుపాయాలు అవసరం కానీ సెల్ ఫోన్ గోల ఏమిటి అన్నారు. అంతేకాదు అదేమైనా కూడు పెడుతుందా అనేవారు.
ఈ విషయాన్నే క్వాంటం వాలీ జాతీయ వర్క్ షాప్ లో బాబు చెబుతూ సభలో ఉన్న వారిని తెగ నవ్వించేశారు. ఇంతకీ ఆయన ఏమన్నారు అంటే అప్పట్లో నేను సెల్ ఫోన్ గురించి మాట్లాడినప్పుడు సెల్ ఫోన్ తిండి పెడుతుందా, నీళ్లు ఇస్తుందా, షెల్టర్ ఇస్తుందా అని హేళన చేశారు. అయితే సరిగా 25 సంవత్సరాల తర్వాత ఈరోజు భర్త లేకుండా భార్య ఉంటుంది, భార్య లేకుండా భర్త ఉంటాడు కానీ ఫోన్ లేకుండా ఇద్దరూ ఉండలేరు అని ప్రజెంట్ సిట్యువేషన్ ఏమిటన్నది కళ్ళకు కట్టినట్లుగా చెప్పి సెల్ ఫోన్ ప్రభావం ఎంత అన్నది విడమరచారు.
నిజంగా అంటే బాబు చెప్పినదే నిజం. సెల్ ఫోన్ ఈ రోజు సమాజాన్ని శాసిస్తోంది. ఒక్క ఫోన్ ఎన్నో చేయిస్తోంది. ఫోన్ ఉంటే చాలు ఎవరూ లేకపోయినా అన్న ధీమా అయితే వచ్చింది. ఈ ప్రపంచంలో ఎన్నో టెక్నాలజీలు వచ్చాయి. కనేఎ సెల్ టెక్నాలజీ తెచ్చిన విప్లవం సాటి మరోటి రాదు అని ఆ రంగం నిపుణులు అంటారు.
ఇక చంద్రబాబు తాను విజనరీ కాబట్టే ఆనాడు సెల్ ఫోన్ ఎంతదాకా వెళ్తుంది. దాని ప్రభావం ఎంతమేరకు ఉందని గమనించారు అని అంటారు. అదే విషయం బాబు ఎపుడు చెబుతూంటారు. టెక్నాలజీ అంతలా ఇపుడు విస్తరించింది అన్నది ఆయన భావన. ఇపుడు క్వాంటం వాలీ కూడా రేపటి తరాన్ని శాసిస్తుంది అని బాబు అంటున్నారు. మొత్తానికి చూస్తే చంద్రబాబు సెల్ ఫోన్ చాలానే చేస్తోంది అని చెప్పి ఊరుకున్నారు.
అది ఇంకా చాలానే చేస్తోంది. అదొక ప్రపంచమే అయిపోయింది. ఏ టెక్నాలజీ అయినా మేలు చేసేదే. అయితే అది పొదుపుగా అదుపుగా వాడినప్పుడే అన్న సత్యాన్ని కూడా నిపుణులు చెబుతారు. మరి సెల్ ఫోన్ విషయంలో చూస్తే శాసిస్తోంది, పాలిస్తోంది జనాలనే అంటున్నారు.