Begin typing your search above and press return to search.

వైసీపీ వైపు చూడొద్దు...బాబు ఓపెన్ అప్పీల్

ఇక వైసీపీ దుష్ప్రచారం చూస్తే వివేకానంద రెడ్డి మర్డర్ నుంచి మొదలెట్టి ఈ రోజు పెన్షన్లు తీసేస్తున్నామని ఫేక్ ప్రచారానికి దిగారని అన్నారు.

By:  Tupaki Desk   |   23 Aug 2025 8:35 PM IST
వైసీపీ వైపు చూడొద్దు...బాబు ఓపెన్ అప్పీల్
X

ఏపీలో ప్రజల భవిష్యత్తును బంగారం చేసే బాధ్యత కూటమి ప్రభుత్వానిది అని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేస్తున్నారు. అభివృద్ధి సంక్షేమం రెండు కళ్ళుగా పాలన చేస్తామని హామీ ఇచ్చారు. పదిహేను నెలల పాలనలో సూపర్ సిక్స్ హామీలు అమలు చేశామని ఆయన గుర్తు చేశారు. అభివృద్ధితో సంపద సృష్టి జరుగుతుందని అన్నారు. అలాగే పేదరికం పోగొట్టడానికి సంక్షేమ పధకాలు ఇస్తుమ్మాని చెప్పుకొచ్చారు. మాది ఒకటే ఫోకస్. ఒకటే చూపూ అదే ఏపీని బ్రహ్మాండంగా అభివృద్ధి చేయడం అని తూర్పు గోదావరి జిల్లా పెద్దాపురం సభలో బాబు చెప్పారు.

వైసీపీ వద్దే వద్దు :

ఏపీకి వైసీపీ అవసరం లేదని చంద్రబాబు అన్నారు. ఆ పార్టీది విధ్వంసమైన విధానం అని ముఖ్యమంత్రి తీవ్ర స్థాయిలో ద్వజమెతారు. దుష్ప్రచారానికి పాల్పడడమే వారి లక్ష్యమని అన్నారు లేని విషయాన్ని ఉన్నది ఉన్నట్లుగా చెబుతూ జనంలో గందరగోళం సృష్టిస్తారు అని అన్నారు. సోషల్ మీడియాలో ముందు పోస్టు పెడతారని తరువాత దానిని నీలి మీడియాలో ప్రచురిస్తారని ఆ మీదట వారి నాయకులు ప్రెస్ మీట్లు పెట్టి జనంలో బుర్రలో పదే పదే విష ప్రచారం చేస్తారు అని అన్నారు.

వివేకా మర్డర్ నుంచి :

ఇక వైసీపీ దుష్ప్రచారం చూస్తే వివేకానంద రెడ్డి మర్డర్ నుంచి మొదలెట్టి ఈ రోజు పెన్షన్లు తీసేస్తున్నామని ఫేక్ ప్రచారానికి దిగారని అన్నారు. ఈ మధ్యలో కోడి కత్తి, గులకరాళ్ళ సంఘటన అమరావతి మునిగింది వంటివెన్నో ఉన్నాయని అన్నారు. ఇక పెట్టుబడులు ఏపీకి రాకుండా వైసీపీ ప్రయత్నాలు చేస్తూ అడ్డుకోవాలని చూస్తోంది అన్నారు. కూటమీది అభివృద్ధి అజెండా అని తాము నిర్మాణాత్మకమైన పంధాలో ముందుకు సాగుతూంటే వారు మాత్రం అబద్ధాలతో అవాంతరాలతో అభివృద్దిని అడ్డుకోవాలని చూస్తున్నారు.

ఎన్డీయే ఒక్కటే ఆప్షన్ :

ఏ ఎన్నిక ఏపీలో జరిగినా ఒకే ఒక్క ఆప్షన్ గా ఎన్డీయేనే జనాలు ఎంచుకోవాలని చంద్రబాబు పిలుపు ఇచ్చారు. మీరు వేరే ఆలోచనలు చేయవద్దు. రాష్ట్ర భవిష్యత్తుని దృష్టిలో ఉంచుకోవాలని బాబు కోరారు. అంతే కాదు మీరు ఏమి ఆలోచినా ఏపీ గురించే ఉండాలని సూచించారు. అభివృద్ద్షి సంక్షేమం విజన్ కలగలసి ఉన్న కూటమి ప్రభుత్వం అధికారంలో ఉందని బాబు చెప్పుకొచ్చారు. వైసీపీది అనర్థం, సంక్షోభం, క్రిమినల్ రాజకీయమని ఆయన తేడా ఎత్తి చూపారు. కూటమి ప్రభుత్వానికి మద్దతుగా నిలవాలని ఆయన పదే పదే కోరారు.

రెండిందాల ప్రచారం :

చంద్రబాబు వ్యూహాత్మకంగా వైసీపీ మీద రాజకీయ విమర్శలు చేస్తూ వస్తున్నారు ప్రతీ సభలో తాము ఏమి చేసింది చెబుతున్నారు. ఇంకా ఏమి చేయబోయేది కూడా వివరిస్తున్నారు. అదే సమయంలో వైసీపీ గతంలో ఎలా నష్టం చేసింది రాష్ట్రానికి ఇపుడు చేస్తున్న నష్టం ఏమిటో తనదైన శైలిలో చెబుతున్నారు. ఏపీ అభివృద్ధిని కోరుకునే వారు అంతా వైసీపీ వైపు వెళ్ళరు అని కూడా బాబు ఇస్తున్న ఈ పిలుపు జనాల్లో ఆలోచన ఏ మేరకు పెంచుతుంది అన్నది చూడాల్సి ఉంది.