అమరావతిలో క్రియేటివ్ సిటీ - గ్లోబల్ లీడర్ షిప్ సెంటర్
కానీ ఇప్పుడు హైదరాబాద్ నాలెడ్జి ఎకానమీకి కేంద్రంగా మారిందని ఆయన ఉదహరించారు.
By: Satya P | 7 March 2026 7:49 PM ISTఏపీ రాజధాని అమరావతిని ప్రపంచ స్థాయి నగరంగా తీర్చిదిద్దనున్నామని ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పారు. అమరావతి రానున్న కాలంలో ప్రపంచం దృష్టిని ఆకట్టుకునే మహా నగరం అవుతుందని ఆయన చెప్పారు. ఢిల్లీలో జరిగిన ప్రతిష్టాత్మక రైసినా డైలాగ్ 2026 సదస్సుకు చంద్రబాబు హాజరయ్యారు. 2016 నుంచి నిర్వహిస్తున్న ఈ ప్రతిష్టాత్మక సదస్సులో తొలిసారిగా ఒక రాష్ట్ర ముఖ్యమంత్రికి రైసినా డైలాగ్ నిర్వాహకులు ఆహ్వానం పలికారు. ఆ విధంగా బాబు అరుదైన గౌరవం అందుకున్నారు. ఇక ఈ కార్యక్రమానికి 110 దేశాల నుంచి 2700 మందికి పైగా ప్రతినిధులు మేధావులు నిపుణులు వ్యూహకర్తలు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో చంద్రబాబు ఏపీ గురించి, దేశం గురించి ప్రపంచం గురించి భవిష్యత్తులో జరిగే పరిణామాల గురించి సోదాహరణంగా వివరించడం గమనార్హం.
అమరావతి ఈజ్ గ్రేట్ :
ఇక ఏపీ రాజధాని అమరావతి ఈజ్ గ్రేట్ రూపుదిద్దుకుంటోందని చంద్రబాబు చెప్పడం విశేషం. తొమ్మిది అంశాలతో కూడిన నగరాలను అమరావతిలో ఏర్పాటు చేస్తున్నామని అన్నారు. అలాగే క్రియేటివ్ సిటీని కూడా అమరావతిలో నెలకొల్పుతున్నామని చెప్పారు. ఇక ప్రముఖ ఐటీ కంపెనీలను భారతీయులే లీడ్ చేస్తున్నారని బాబు గుర్తు చేశారు. అందుకే అమరావతిలో గ్లోబల్ లీడర్ షిప్ సెంటర్ ను సైతం ఏర్పాటు చేస్తున్నామని అన్నారు. సైబరాబాద్ తో పాటు అమరావతిని బ్లూ గ్రీన్ సిటీగా నిర్మించే అవకాశం తనకు లభిచింది అని బాబు ఎప్పారు. టెక్నాలజీని, ఇన్ ఫ్రాను మిళితం చేసి కాలుష్య రహిత నగరంగా అమరావతిని నిర్మిస్తున్నామని అన్నారు.
నాలెడ్జి ఎకానమీ గురించి :
తాను ఉమ్మడి ఏపీకి సీఎం గా ఉన్నపుడు ఐటీ విప్లవం గురించి మాట్లాడితే అంతా విమర్శించారని బాబు అన్నారు. కానీ ఇప్పుడు హైదరాబాద్ నాలెడ్జి ఎకానమీకి కేంద్రంగా మారిందని ఆయన ఉదహరించారు. అలాగే ఇప్పుడు ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ అనేది గేమ్ చేంజర్ గా మారబోతోందని బాబు జోస్యం చెప్పారు ఏఐ, క్వాంటం కంప్యూటర్లను ఎలా వినియోగించుకుంటామన్న అంశం ఆధారంగానే భవిష్యత్తు ఆధారపడి ఉంటుందని విశ్లేషించారు. ఇక మూడు దశాబ్దాల క్రితం అందిపుచ్చుకున్న ఐటీ విప్లవం ప్రపంచ వ్యాప్తంగా వివిధ దేశాలకు తెలుగు రాష్ట్రాల నుంచి సమర్ధులైన నిపుణులను ఎంతో మందిని అందించిందని బాబు చెపపరు.
భారత్ ది నాయకత్వం :
ఇదిలా ఉంటే భారతదేశం ఈ రోజున శరవేగంగా అభివృద్ధి వైపు సాంకేతికత వైపు సాగుతోంది అని చంద్రబాబు చెప్పారు. నాలెడ్జి ఎకానమీలో లీడింగ్ భాగస్వామిగా భారత్ ఉందని ఆయన చెప్పారు. ఏకంగా 60 శాతం జీసీసీలు భారత్ లోనే ఏర్పాటు అయ్యాయని ఆయన గుర్తు చేశారు. డిజిటల్ కరెన్సీ సంస్కరణల ద్వారా యూపీఐ పేమెంట్ వ్యవస్థ కూడాదేశంలో కీలకంగా మారిందని అన్నారు గూగుల్ సంస్థ 15 బిలియన్ డాలర్ల పెట్టుబడితో విశాఖలో డేటా సెంటర్ ఏర్పాటుకు ముందుకు వచ్చిందని అలాగే, క్వాంటం కంప్యూటింగ్ ను అందిపుచ్చుకునేలా అమరావతిని క్వాంటం వ్యాలీగా మారుస్తున్నామని బాబు చెప్పుకొచ్చారు. త్వరలోనే క్వాంటం కంప్యూటింగ్ పరికరాలను కూడా తయారు చేసి ప్రపంచానికి అందిస్తామని బాబు ధీమా వ్యక్తం చేయడం విశేషం.
డ్రోన్ అంబులెన్స్ కూడా :
ఇక డ్రోన్ అంబులెన్స్ కూడా త్వరలోనే రియాలిటీగా మారబోతోందని బాబు ధీమాగా చెప్పారు. ప్రైవేటు శాటిలైట్లను కూడా తయారు చేసి లాంచ్ చేసేలా ఓ స్పేస్ సిటీని డ్రోన్ల కోసం డ్రోన్ సిటీని ఏపీలో ఏర్పాటు చేస్తున్నామని అన్నారు. ఎలక్ట్రానిక్స్, ఏరో స్పేస్ సిటీని ఏర్పాటు చేసి పెట్టుబడులను ఆకర్షిస్తున్నామని ఆయన అంటున్నారు. ప్రివెంటివ్ హెల్త్ అనేది రియాలిటీ, క్యూరేటివ్ విధానంపైనా అంతా దృష్టి సారించాల్సి ఉందని సమావేశంలో బాబు సూచించారు. అలాగే * మేధావులు, నిపుణులు, వ్యూహకర్తలు ఇచ్చిన ఆలోచనల్ని అమలు చేసేందుకు భారత్ తో పాటు ఏపీసన్నద్ధంగా ఉంటుందని బాబు స్పష్టం చేయడం విశేషం.
