జగన్ కు చంద్రబాబు సలహా.. పాటిస్తే తిరుగులేదు!
దీనిని పాటిస్తే.. జగన్‌కు ముఖ్యంగా రాష్ట్రానికి కూడా ఎలాంటి ఇబ్బందీ లేదని టీడీపీనాయకులు.. నెటిజన్లు కూడా వ్యాఖ్యానిస్తున్నారు.
By: Garuda Media | 6 April 2026 10:11 PM ISTవైసీపీ అధినేత జగన్‌కు.. సీఎం చంద్రబాబు మంచి సలహా ఇచ్చారు. దీనిని పాటిస్తే.. జగన్‌కు ముఖ్యంగా రాష్ట్రానికి కూడా ఎలాంటి ఇబ్బందీ లేదని టీడీపీ నాయకులు.. నెటిజన్లు కూడా వ్యాఖ్యానిస్తున్నారు. తాజాగా అనంతపురం జిల్లాలో పర్యటించిన చంద్రబాబు నీటి సంరక్షణకు సంబంధించిన కీలక కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం.. నిర్వహించిన సభలో ఆయన మాట్లాడుతూ.. అమరావతికి చట్టబద్ధత అంశాన్ని ప్రస్తావించారు. అమరావతిని ఎవరూ మార్చలేరని.. ఇక, రాజధానికి తిరుగులేదని కూడా చెప్పారు.
అయితే.. ఇదేసమయంలో జగన్‌ను ఉద్దేశించి కీలక సలహా ఇచ్చారు. అమరావతి పేరును పలికేందుకు కూడా ఇష్టపడని జగన్.. అంటూ ఎద్దేవా చేశారు. ``ఈయనకు అమరావతి అంటే ఇష్టం లేదు. కానీ.. అమరావతి దేవతల భూమి. ఒక్కసారి పలికినా.. చేసిన పాపాలు కొంతైనా పోతాయి.`` అని వ్యాఖ్యానించారు.. ఈ కామెంట్లకు ప్రజల నుంచి చప్పట్లో జోరు వినిపించింది. ఇక,దీనికి కొనసాగింపుగా.. ``ఒకవేళ జగన్..అమరావతిని పలకడం ఇష్టం లేకపోతే.. గమ్మున ఉండి.. ఇంట్లోనే కూర్చోవాలి. అప్పుడు రాష్ట్రం.. రాజధాని కూడా ప్రశాంతంగా ఉంటుంది.`` అని చంద్రబాబు సలహా ఇచ్చారు.
అంతేకాదు.. ``జగన్ ఇంట్లో ఉంటే.. ఎవరికీ ఎలాంటి ఇబ్బంది ఉండదన్నారు. ఆయన బయటకు వచ్చి.. మావిగన్.. అంటూ.. ఏదో పిచ్చిపిచ్చి మాటలు మాట్లాతున్నాడు. దీనివల్ల ఆయనకు ఏదైనా జరిగిందేమో అని మావాళ్లంతా నన్నడుతున్నారు. ఏదైనా అయిందేమోనని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వాళ్లు కూడా ఆవేదనలో ఉన్నారని చెబుతున్నారు. ఇవన్నీ ఎందుకు నీకు అమరావతి అంటే ఇష్టం లేదు. ఆ పేరు పలికేందుకు కూడా ఇష్టం లేదు. గమ్మున ఇంట్లో కూర్చో. నీకు అన్నీ ఇంటికే పంపించే బాధ్యత మావాళ్లు తీసుకుంటారు. `` అని సూచించారు.
జోకైపోయింది..
రాజధాని అంటే జోకై పోయిందని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. సమావేశం అనంతరం.. తనను కలిసి మీడియా మిత్రులతో ఆయన మాట్లాడుతూ.. వేల మంది రైతులు పిచ్చివాళ్లయి ఇచ్చారా? రైతులకు ఉన్న జ్ఞానం ఒక రాజకీయ పార్టీని నడిపించేవాడికి ఉండదా? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశం మొత్తం రాజధానికి అండగా ఉందన్నారు. ఒక్క వైసీపీ వాళ్లు మాత్రమే రాజధానిపై విషం కక్కుతున్నారని ఎద్దేవా చేశారు. ``వాళ్లు ఓకే చెప్పనంత మాత్రాన ఏమీ జరగదు`` అని బాబు వ్యాఖ్యానించారు.
