చంద్రబాబు: 75 ఏళ్ల రాజకీయ నిఘంటువు.. !
ఏపీ సీఎం చంద్రబాబు 75వ వసంతంలోకి అడుగు పెడుతున్నారు. ఏప్రిల్ 20(ఆదివారం) చంద్రబాబు పుట్టిన రోజు. ఆరోజుకు ఆయనకు 75 ఏళ్లు రానున్నాయి.
By: Tupaki Desk | 20 April 2025 2:00 AM ISTఏపీ సీఎం చంద్రబాబు 75వ వసంతంలోకి అడుగు పెట్టారు. ఈ రోజు ఏప్రిల్ 20(ఆదివారం) చంద్రబాబు పుట్టిన రోజు. ఈ రోజుతో ఆయనకు 75 ఏళ్లు వచ్చాయి . నారా చంద్రబాబు నాయుడు .. సుదీర్ఘ రాజకీయ జీవితంలో అనేక ఎత్తుపల్లాలు చవిచూశారు. అనేక ఒడిదుడుకులు కూడా ఎదుర్కొన్నా రు. 1951, ఏప్రిల్ 20న చంద్రగిరి మండలం నారావారిపల్లెలో జన్మించిన చంద్రబాబు.. విద్యార్థి ఉద్యమాల నుంచి రాజకీయాల్లోకి వచ్చారు.
తరిమెల నాగిరెడ్డి, చండ్ర రాజేశ్వరరావు వంటివారితోనూ కలిసి ఆయన రాజకీయాలు చేశారు. తొలినాళ్లలో కాంగ్రెస్, తర్వాత.. టీడీపీలోనూ చక్రం తిప్పిన చంద్రబాబు మంత్రి పదవులు అందుకున్నారు. 1995లో జరిగిన టీడీపీ వ్యవహారంలో ఆయన తెలుగు దేశం పార్టీ అధ్యక్షుడు అయ్యారు. ఆ తర్వాత.. వెనక్కి తిరిగి చూసుకునే అవకాశం లేకుండా.. పదేళ్ల పాటు అధికారంలో ఉన్నారు. 2014లో తిరిగి రాష్ట్ర విభజన తర్వా త.. చంద్రబాబు.. పుంజుకున్నారు.
ఇలా.. మొత్తంగా నాలుగు సార్లు ముఖ్యమంత్రి పీఠం అధిరోహించిన చంద్రబాబు అలుపెరుగని నాయకుడిగా నిరంతర ప్రజా సేవలో తనేమిటో నిరూపించుకున్నారు. నాయకులను ప్రత్యేకంగా పోల్చాల్సివస్తే.. ఒకప్పుడు.. నెహ్రూ.. పటేల్ అంటూ.. కొందరు నాయకుల పేర్లు చెప్పుకొనే పరిస్థితి ఉండేది. ఇక, తెలుగు రాష్ట్రాలకు సంబంధించి చెప్పాల్సివస్తే.. చంద్రబాబు పేరు తెరమీదికి వస్తుంది. ఇలా.. రాజకీయంగా చంద్రబాబు ఓ ప్రత్యేకతను సాధించారు.
75 ఏళ్ల వయసు శరీరానికే తప్ప.. మనసుకు కాదని నిరూపించే నాయకుల్లో ముందు వరసులో ఉన్నారు చంద్రబాబు. ఆయనకు ఏదీ కష్టం కాదు.. ఎంత సవాల్‌తో కూడుకున్న పనినైనా ఎంతో ఇష్టంగా ముందు కు తీసుకువెళ్లి సాధించేందుకు ప్రయత్నిస్తారు. యువత కంటే ఎక్కువగా దూకుడుగా ఉంటూ.. ప్రజలకు చేరువ కావడంతో చంద్రబాబు ఇప్పుడు న్న నాయకులకే కాదు.. భవిష్యత్ తరం నాయకులకు కూడా ఆదర్శమనే చెప్పాలి. ఆయన విజన్, సమకాలీన రాజకీయాలను ఒడిసిపట్టిన తీరు.. నభూతోనే కాదు.. నభిష్యత్తు కూడా!!
