Begin typing your search above and press return to search.

మంత్రుల ర్యాంకింగ్స్ : ఫస్ట్ లాస్ట్ ఆ రీజియన్ లోనే !

పాలనలో అనుకూల ఫలితాలు రావాలీ అంటే ఫైళ్ల క్లియరెన్స్ లో వేగం పెంచాలని మంత్రులకు ముఖ్యమంత్రి చంద్రబాబు సూచిస్తున్నారు.

By:  Satya P   |   14 March 2026 8:30 AM IST
మంత్రుల ర్యాంకింగ్స్ : ఫస్ట్ లాస్ట్ ఆ రీజియన్ లోనే !
X

ఏపీలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయకత్వంలో టీడీపీ కూటమి ప్రభుత్వం ఏర్పడి 21 నెలలు మార్చి 12 తో పూర్తి అయ్యాయి. ప్రస్తుతం 22వ నెల కొనసాగుతోంది. ఇక తొందరలోనే మంత్రి వర్గంలో భారీ మార్పులు చేర్పులు ఉంటాయని ఒక వైపు ప్రచారం సాగుతోంది. అది కూడా ఉగాది శుభ వేళ ఉంటుందని కూడా చెబుతున్నారు. ఈ ప్రచారంలో నిజానిజాలు ఎలా ఉన్నా ప్రతీ నెలా మంత్రులకు ర్యాంకులు ఇస్తూ కూటమి ప్రభుత్వ పెద్దగా చంద్రబాబు వారి పనితీరుని గుర్తు చేస్తున్నారు. అంతే కాదు అలెర్ట్ చేస్తున్నారు. సరిదిద్దుకోమని కోరుతున్నారు. అలా చూస్తే కొందరు మంత్రులు ముందుకు వచ్చారు మరి కొందరు వెనకబడుతున్నారు.

లేటెస్ట్ ర్యాంకులు ఇవే :

ఇదిలా ఉంటే తాజాగా ముఖ్యమంత్రి చంద్రబాబు మంత్రుల పనితీరు మీద ఇచ్చిన ర్యాంకులు చూస్తే ఇంట్రెస్టింగ్ గా ఉన్నాయి. ఈ ర్యాంకులకు కొలమానం ఏంటి అంటే మంత్రులు తమకు కేటాయించిన శాఖలకు సంబంధించి ఫైళ్ళను ఎంత వేగంగా క్లియర్ చేస్తున్న్నారు అన్న దాని మీద ఇస్తారు అన్న మాట. ఫైళ్ళను వేగంగా క్లియర్ చేస్తేనే పాలన జోరుగా సాగుతుంది. అది పరిపాలన మీద చాలా స్పష్టంగా ముద్ర పడేలా చేస్తుంది అందుకే బాబు ఈ కొలమానాన్ని ఎంచుకున్నారు అని అంటున్నారు. ఇక ఫస్ట్ ర్యాంక్ ఉత్తరాంధ్రా రీజియన్ లోని ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాకు చెందిన వ్యవసాయ శాఖ మంత్రి కె అచ్చెన్నాయుడుకు దక్కింది. అలాగే చివరి ర్యాంక్ కూడా అదే ఉత్తరాంధ్రా రీజియన్ లోని ఉమ్మడి విశాఖ జిల్లాకు చెందిన వంగలపూడి అనితకు దక్కింది. దీంతో హోం మంత్రిగా అనిత తమ ఫైళ్ల క్లియరెన్స్ లో వెనకబడి ఉన్నారా అన్న చర్చ సాగుతోంది.

పవన్ ర్యాంక్ ఇదే :

ఇక ఫైళ్ల క్లియరెన్స్ లో పవన్ కూడా జోరు చూపిస్తున్నారు. ఆయన చేతిలో అయిదు శాఖలు ఉన్నాయని అంటున్నారు. పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖలు చాలా పెద్దవి, తీరిక కూడా లేని శాఖలు అయినా సరే పవన్ తన మంత్రిత్వ శాఖల విషయంలో ఫుల్ గోకస్ పెడుతున్నారు. అందుకే ఆయనకు ర్యాంకింగ్ లో నాలుగవ ప్లేస్ వచ్చింది అని అంటున్నారు. ఇది మంచి నంబర్ గా చెబుతున్నారు. ఉప ముఖ్యమంత్రిగా అనేక శాఖల మంత్రిగా ఉంటూ జనసేన అధినేతగా పార్టీ వ్యవహారాలు చూసుకుంటూ మరో వైపు సినిమాలలో కూడా కీలకంగా ఉంటూ పవన్ చూపిస్తున్న ఈ వేగం మెచ్చదగినదే అంటున్నారు.

వేగం పెంచమంటున్న బాబు :

పాలనలో అనుకూల ఫలితాలు రావాలీ అంటే ఫైళ్ల క్లియరెన్స్ లో వేగం పెంచాలని మంత్రులకు ముఖ్యమంత్రి చంద్రబాబు సూచిస్తున్నారు. ఈ విషయంలో అలసత్వం తగదని ఆయన పదే పదే హెచ్చరిస్తున్నారు. ఇక ప్రజలకు మంచి పాలన అందిస్తామని కూటమి అధికారంలోకి వచ్చిందని గుర్తు చేస్తున్నారు. ఇదిలా ఉంటే మంత్రులు ఒక్కో ఫైల్ క్లియర్ చేసేందుకు ఎంత సమయం తీసుకుంటున్నారు అన్నది కూడా సమయం తో సహా వివరిస్తూ ఈ ర్యాంకులు ఇస్తున్నారు అని అంటున్నారు. దీంతో దేశంలో ఎక్కడా లేని విధంగా మంత్రుల పనితీరు మీద ఇది మంచిగా చేసే ఒక మధింపు అని అంటున్నారు. దీని వల్ల ప్రభుత్వం పరుగులు పెడుతుందని అలాగే ప్రజలకు మేలు జరుగుతుందని అంటున్నారు.

అధికారులకు ర్యాంకులు :

ఇక కలెక్టర్ల సమావేశం రెండు రోజుల పాటు జరింది. ఇందులో కూడా కలెక్టర్లకు కూటమి ప్రభుత్వం ర్యాంకులు ఇచ్చింది వినూత్నమైన ఆలోచనతో పాలనను ముందుకు తీసుకుని పోతున్న వారిని మెచ్చుకుంటూనే కాస్తా జోరు తగ్గించిన వారిని కూడా అలెర్ట్ చేస్తున్నారు. అలా పాలనకు అటు అధికారులు ఇంటు మంత్రులు ఇద్దరూ సారధులు కాబట్టి జోడు గుర్రాల స్వారీగా రెండు వైపులా కో ఆర్డినేట్ చేసుకుంటూ కూటమి పాలన సాగుతోంది అని అంటున్నారు.