Begin typing your search above and press return to search.

మంత్రులకు బాబు మార్క్ క్లాస్ ?

మరి ఆయనలా కాకుండా అందులో సగమైనా పనిచేస్తే మంత్రులు అయినా ఎవరైనా సూపర్ సక్సెస్ సాధించినట్లే.

By:  Tupaki Desk   |   7 May 2025 10:54 AM IST
మంత్రులకు బాబు మార్క్ క్లాస్ ?
X

ముఖ్యమంత్రి చంద్రబాబుని పని రాక్షసుడు అని అంతా అంటారు. ఆయన ఏడున్నర పదుల వయసులో కూడా అందరి కంటే ఎక్కువగా పనిచేస్తారు రోజుకీ పదహారు నుంచి పద్దెనిమిది గంటల పాటు తాను అనుకున్న పనిలోనే ఉంటారు ఒక విధంగా చూస్తే బాబుతో ఎవరూ పోటీ పడలేరు.

మరి ఆయనలా కాకుండా అందులో సగమైనా పనిచేస్తే మంత్రులు అయినా ఎవరైనా సూపర్ సక్సెస్ సాధించినట్లే. కానీ బాబు కేబినెట్ లోని చాలా మంది మంత్రులు ఈ రోజుకూ తమ జోరు చూపించలేకపోతున్నారు అని అంటున్నారు. అప్పగించిన బాధ్యతలను వారు సక్రమంగా నెరవేర్చలేకపోతున్నారు అని అంటున్నారు.

కీలక శాఖలను నిర్వహిస్తున్న మంత్రుల నుంచి చాలా మంది వరకూ లైట్ తీసుకుంటున్నారు అన్న భావన అయితే సీఎంలో ఏర్పడింది అని అంటున్నారు ఇటీవల సింహాచలం చందనోత్సవం ఘటనలో ఏకంగా ఏడుగురు అమాయక భక్తులు తమ ప్రాణాలను కోల్పోయారు. ఈ దుర్ఘటన వల్ల ప్రభుత్వానికి చెడ్డ పేరు వచ్చింది

ఈ విధంగా జరగకుండా మంత్రులు ఎందుకు చర్యలు తీసుకోలేకపోయారు అన్నది ప్రభుత్వాధినేత మనసులో ఉంది అని అంటున్నారు. మంత్రులతో హైలెవెల్ కమిటీని ఏర్పాటు చేశారు. అంతే కాదు దేవాదాయ శాఖ మంత్రి విశాఖ వచ్చి సమీక్ష నిర్వహించారు. ఇంచార్జి మంత్రి ఉన్నారు. స్థానిక మంత్రి ఉన్నారు. ఇతర మంత్రులు ఉన్నారు.

అందరూ కలసి ఎంతో కీలకమైన చందనోత్సవంలో రివ్యూలను సమర్ధంగా చేయలేకపోయారా అన్నది కూడా ప్రభుత్వ పెద్దలో బాధగా ఉంది అని అంటున్నారు. అంతే కాదు జిల్లాలకు ఇంచార్జిలుగా నియమించిన మంత్రులు ప్రభుత్వ పరంగా కో ఆర్డినేట్ చేసుకోలేకపోతున్నారు అని అంటున్నారు. అలాగే టీడీపీలో నేతల మధ్యన కో ఆర్డినేట్ చేస్తూ అందరినీ కలసికట్టుగా చేయలేకపోతున్నారు అని అంటున్నారు.

దీంతో పాటు శాఖపరంగా కూడా ఆశించిన పనితీరు అయితే కనిపించడం లేదు అని అంటున్నారు. దీంతోనే ముఖ్యమంత్రి ఇటీవల లంచ్ మీట్ పేరుతో మంత్రులను పిలిచి కాస్తా సీరియస్ గానే క్లాస్ తీసుకున్నారు అని అంటున్నారు. తీరు మార్చుకోవాలని కూడా సూచించారు అని అంటున్నారు లేకపోతే మంత్రివర్గ విస్తరణకు వెళ్ళడం నిహనా మార్గం లేదని స్పష్టం చేశారు అని ప్రచారం సాగుతోంది.

నిజంగా సీఎం కనుక తలచుకుంటే చాలా మందికి కేబినెట్ లో చోటు ఉండదు, ఆ ప్లేస్ లోకి కొత్త వారు వస్తారు ఈసారి బాబు ఎక్కువగా జూనియర్స్ కి చాన్స్ ఇచ్చారు మరి వారు తమకు దక్కిన అవకాశాన్ని వాడుకోవాలి. సీఎం మనసేరిగి ప్రవర్తించాలని అంటున్నారు. ఏది ఏమైనా జూన్ 12 తరువాత కూటమి సర్కార్ రెండవ ఏడాదిలోకి ప్రవేశిస్తోంది. ఆనాటికి కొందరి మంత్రుల ప్రొగ్రెస్ రిపోర్టులో ఏమైనా మంచి మార్పు కనిపించకపోతే బాబు సీరియస్ డెసిషన్ దిశగా అడుగులు వేసినా ఆశ్చర్యం లేదనే అంటున్నారు.