ఒకే రోజున విశాఖలో బాబు..లోకేష్ !
విశాఖ పర్యటనకు ముఖ్యమంత్రి చంద్రబాబు అలాగే విద్యా శాఖ మంత్రి నారా లోకేష్ ఒకే రోజు వస్తున్నారు.
By: Tupaki Desk | 7 Jun 2025 9:28 AM ISTవిశాఖ పర్యటనకు ముఖ్యమంత్రి చంద్రబాబు అలాగే విద్యా శాఖ మంత్రి నారా లోకేష్ ఒకే రోజు వస్తున్నారు. దీంతో రాజకీయంగా ఇదే విశేషం అని అంటున్నారు. చంద్రబాబు లోకేష్ కలిసి వచ్చింది జనవరి 8న మాత్రమే. ఆనాడు విశాఖలో మోడీ సభ ఉంది. అందుకే అలా తండ్రీ కొడుకులు కలసి విశాఖ వేదిక మీద కనిపించారు.
మళ్ళీ ఇన్ని నెలల తరువాత విశాఖ వస్తున్నారు. అయితే కలిసి రావడం లేదు. కలసి వెళ్లడం కూడా లేదు. ముందుగా చూసుకుంటే నారా లోకేష్ ఈ నెల 9న విశాఖ వస్తున్నారు. ఆయన ఆ రోజు ఉదయమే విశాఖ చేరుకుని అక్కడ నుంచి నేరుగా పార్వతీపురం మన్యం జిల్లాకు వెళ్తారు.
పార్వతీపురం పట్టణంలో పదవ తరగతి, ఇంటర్మీడియట్ పరీక్షలలో ఉత్తమ ర్యాంకులు సాధించిన విద్యార్థులకు సత్కార కార్యక్రమంలో లోకేష్ పాల్గొంటారు. వారితో ఆయన ముఖాముఖి మాట్లాడతారు. అనంతరం తిరిగి విశాఖ చేరుకుని ఆయన విజయవాడకు వెళ్తారని అంటున్నారు.
ఇక చంద్రబాబు విషయానికి వస్తే ఆయన హైదరాబాద్ నుంచి ఈ నెల 9న సాయంత్రం నేరుగా విశాఖ చేరుకుంటారు. ఆయన ఆ రోజు రాత్రికి విశాఖలోనే బస చేస్తారు. ఈ నెల 10న విశాఖకు రానున్న భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు స్వాగతం పలుకుతారు. విశాఖ ఏయూలో జరిగే రాష్ట్రపతి కార్యక్రమంలో ముఖ్యమంత్రి పాల్గొంటారు. ఆ విధంగా రెండు రోజుల పర్యటన కోసం బాబు విశాఖకు వస్తున్నారు.
అయితే చంద్రబాబు లోకేష్ ఇద్దరూ విశాఖకు ఒకే రోజున వస్తున్నా ఇద్దరూ కలుసుకునే అవకాశాలు లేవని అంటున్నారు బాబు వచ్చే సమయానికి లోకేష్ విశాఖ నుంచి విజయవాడకు వెళ్తారని అంటున్నారు. అయితే లోకేష్ టూర్ లో మార్పులు ఉంటే ఆయన విశాఖలో ఉండొచ్చు అని అంటున్నారు. మొత్తానికి చూస్తే చంద్రబాబు లోకేష్ ఒకే రోజు విశాఖలో పర్యటనలు చేయడం టీడీపీ వర్గాలకు ఆనందం కలిగిస్తోంది.
