Begin typing your search above and press return to search.

చేనేత‌ల‌పై మ‌న‌సు పెట్టేసిన‌ చంద్ర‌బాబు!

దేశం గర్వించే కళ చేనేత అని చంద్ర‌బాబు పేర్కొన్నారు. మన రాష్ట్రం అనేక చేనేత కళలకు నిలయ మ‌ని అన్నారు. అలాంటి వర్గానికి ఆసరాగా ఉంటున్నామ‌న్నారు.

By:  Garuda Media   |   7 Aug 2026 4:21 PM IST
చేనేత‌ల‌పై మ‌న‌సు పెట్టేసిన‌ చంద్ర‌బాబు!
X

రాష్ట్రానికి త్వ‌ర‌లోనే హ్యాండ్లూమ్ క‌ళ రానుంద‌ని సీఎం చంద్ర‌బాబు తెలిపారు. ఉప్పాడలో ప్రత్యేక మౌలిక సదుపాయాల ప్రాజెక్టు, మంగళగిరిలో హ్యాండ్లూమ్ పార్కు ఏర్పాటు చేస్తున్నారు. టీడీపీ ప్ర‌భుత్వం గ‌తం లోను.. ప్ర‌స్తుతం కూడా చేనేత‌ల‌కు అనుకూలంగా అనేక నిర్ణ‌యాలు తీసుకుంద‌న్నారు. చేనేతలకు రూ.25 వేల చొప్పున ఆర్ధిక సహకారాన్ని అందించే `నేతన్న సేవ`లో పథకాన్ని చంద్ర‌బాబు ప్రారంభించా రు. 71,536 చేనేత కుటుంబాలకు రూ.179 కోట్లను విడుదల చేశారు.

స్వదేశీ ఉద్యమ స్ఫూర్తిని గుర్తు చేసుకునేలా ఆగస్ట్ 7న జాతీయ చేనేత దినోత్సవాన్ని జరుపుకుంటున్నా మ‌న్నారు. `నేతన్న సేవ`లో పథకం కింద 71,536 కుటుంబాలకు రూ.25 వేల చొప్పున ఇస్తున్నామ‌ని చం ద్రబాబు తెలిపారు. రూ.179 కోట్లు నేతన్నలకు అందిస్తున్నామ‌న్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలే కాదు... చెప్పని వాటినీ అమలు చేస్తున్నాం అనడానికి నేతన్న సేవలో పథకమే నిదర్శనమ‌ని అన్నారు. చేనేత కేవలం ఒక వృత్తే కాదు... భారతీయ సంస్కృతికి ప్రతీక అని పేర్కొన్నారు.

దేశం గర్వించే కళ చేనేత అని చంద్ర‌బాబు పేర్కొన్నారు. మన రాష్ట్రం అనేక చేనేత కళలకు నిలయ మ‌ని అన్నారు. అలాంటి వర్గానికి ఆసరాగా ఉంటున్నామ‌న్నారు. చీరాల పేరు వింటేనే ఇక్కడి నేతన్నల నైపుణ్యం గుర్తుకు వస్తుందన్నారు. చీరాల పట్టు, కాటన్ చీరలు దేశవ్యాప్తంగా గుర్తింపు పొందాయన్నారు. చీరాల ఖర్చీఫ్‌లు ఒకప్పుడు విదేశాలకు భారీగా ఎగుమతి అయ్యేవన్నారు. చేనేత ఉత్పత్తుల్లో ఒకప్పుడు ‘మినీ ముంబై’గా పేరొందిన చీరాలకు పూర్వ వైభవం తెస్తామ‌ని చంద్ర‌బాబు తెలిపారు

చీరాల, వెంకటగిరి, ధర్మవరం, ఉప్పాడ, మంగళగిరి, పొందూరు, పెడన, శ్రీకాళహస్తి, నరసాపురం... ఇలా రాష్ట్రంలో అనేక చేనేత ఉత్పత్తులు విశిష్ట గుర్తింపు పొందాయని చంద్ర‌బాబు తెలిపారు. 1.27 లక్షల మం ది చేనేత రంగంపై ఆధారపడి జీవిస్తున్నారని పేర్కొన్నారు. సంప్రదాయం, సృజనాత్మకత కలగలిసిన అపూర్వమైన నైపుణ్యం వీరందరిలో కనిపిస్తుందన్నారు. నేతన్న సేవ పథకమే కాదు... ఇప్పటికే నేతన్నలకు ఉచిత విద్యుత్ అందిస్తున్నామ‌న్నారు.

చేనేత కుటుంబాలకు నెలకు 200 యూనిట్లు, పవర్‌లూమ్ యూనిట్లకు 500 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ ఇస్తున్నామ‌ని చంద్ర‌బాబు తెలిపారు. 62,541 చేనేత కుటుంబాలు, 10,032 పవర్‌లూమ్ యూనిట్లకు ప్రయోజనం కలుగుతోందన్నారు. చేనేతలకు 50 ఏళ్లకే ఎన్టీఆర్ పెన్షన్ భరోసా పెన్షన్ అందిస్తున్నామ‌న్నారు. 85 వేల మంది చేనేతలకు ఫించన్‌గా రూ.4 వేల చొప్పున నెలకు రూ.35 కోట్లు ఇస్తున్నాం. రూ.420 కోట్లు ఏడాదికి ఖర్చు పెడుతున్నామ‌న్నారు.