Begin typing your search above and press return to search.

ఏపీలో 'ఇంద్ర‌ధ‌న‌స్సు'.. విశేషాలు ఇవే!

ఏపీలో ఇంద్ర ధ‌న‌స్సు.. అంటే ప్ర‌కృతి ప‌రంగా ఆకాశంలో ఏర్ప‌డే ఇంద్ర‌ధ‌న‌స్సుకాదు.. ప్ర‌భుత్వ ప‌రంగా పేద‌ల‌ను ఆదుకునేందుకు తీసుకువ‌చ్చిన కీల‌క ప‌థ‌కం

By:  Garuda Media   |   11 March 2026 3:40 PM IST
ఏపీలో ఇంద్ర‌ధ‌న‌స్సు.. విశేషాలు ఇవే!
X

ఏపీలో ఇంద్ర ధ‌న‌స్సు.. అంటే ప్ర‌కృతి ప‌రంగా ఆకాశంలో ఏర్ప‌డే ఇంద్ర‌ ధ‌న‌స్సుకాదు.. ప్ర‌భుత్వ ప‌రంగా పేద‌ల‌ను ఆదుకునేందుకు తీసుకువ‌చ్చిన కీల‌క ప‌థ‌కం. దీని కి సీఎం చంద్ర‌బాబు వినూత్నంగా ఉండాల‌న్న ఉద్దేశంతో 'ఇంద్ర‌ధ‌న‌స్సు'గా పేరు పెట్టారు. ఈ కార్య‌క్ర‌మం కింద‌.. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న దివ్యాంగుల‌కు.. ఎంపిక చేసిన‌ ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సదుపాయం కల్పిస్తారు.

తాజాగా జ‌రుగుతున్న 6వ క‌లెక్ట‌ర్ల స‌ద‌స్సులో సీఎం చంద్ర‌బాబు స్వ‌యంగా ఈ ప‌థ‌కాన్ని ప్ర‌క‌టించారు. గ‌త కొన్నాళ్లుగా దివ్యాంగుల నుంచి వ‌స్తున్న అభ్య‌ర్థ‌న మేర‌కు.. ఈ ప్ర‌తిపాద‌న‌పై నిర్ణ‌యం తీసుకున్న‌ట్టు వివ‌రించారు. వాస్త‌వానికి ఇప్ప‌టికే మ‌హిళ‌ల‌కు ఉచిత బ‌స్సు సౌక‌ర్యం అందుబాటులో ఉంది. దివ్యాంగు లైన మ‌హిళ‌లు ఈ సేవ‌లు పొందుతున్నారు. అయితే..పురుష‌ల స‌మ‌స్య ప్ర‌భుత్వానికి విన్న‌వించారు. ఈ క్ర‌మంలో దివ్యాంగులైన వారు ఎవ‌రైనా.. ఉచితంగా ఆర్టీసీ బ‌స్సుల్లో ప్ర‌యాణించేందుకు అవ‌కాశం క‌ల్పించారు.

ఈ క్ర‌మంలోనే వినూత్నంగా ఉండే ఉద్దేశంతో ఈ కార్య‌క్ర‌మానికి.. ఇంద్ర‌ధ‌నస్సు అని పేరు నిర్ధారించినట్టు.. సీఎం చంద్ర‌బాబు ప్ర‌క‌టించారు. రాష్ట్రంలో ఎంపిక చేసిన బ‌స్సుల్లో దివ్యాంగులు. ఉచితంగా ఎక్క‌డ నుంచి ఎక్క‌డికైనా.. త‌మ ఆధార్ కార్డును చూపించి ప్ర‌యాణించ‌వ‌చ్చ‌ని.. తెలిపారు. దీనికి స‌ద‌రం స‌ర్టిఫికెట్ కూడా ఇస్తున్న‌ట్టు తెలిపారు. ప్ర‌స్తుతం 1.5 కోట్ల మంది మ‌హిళ‌లు స్త్రీశ‌క్తి పేరిట అమ‌లు చేస్తున్న ఉచిత ఆర్టీసీ బ‌స్సుల‌ను వినియోగించుకుంటున్నార‌ని తెలిపారు.

వీరితోపాటు.. విద్యార్థులు, ఇప్పుడు దివ్యాంగుల‌కు కూడా ఉచిత ఆర్టీసీ సేవ‌ల‌ను అందుబాటులోకి తీసుకు వ‌స్తున్నామ‌న్నారు. దివ్యాంగుల‌కు మెరుగైన సౌక‌ర్యాలు క‌ల్పించ‌డంలోనూ.. వారిని విదేశాల‌కు పంపించి .. చ‌దివించ‌డంలోనూ టీడీపీ కూట‌మి ప్ర‌భుత్వం ముందుంద‌ని తెలిపారు. వృత్తుల‌ను కూడా ప్రోత్స‌హిస్తు న్నామ‌ని చెప్పారు. ట్రైసైకిళ్ల‌తోపాటు.. ట్రైస్కూటీల‌ను కూడా పంపిణీ చేయ‌నున్న‌ట్టు తెలిపారు. దివ్యాంగుల‌కు అండ‌గా ప్ర‌భుత్వం అనేక కార్య‌క్ర‌మాలు చేప‌డుతోంద‌ని వివ‌రించారు.