ఏపీకి పెట్టుబడులు మంచివే కానీ... ఇవి ఇంకా ఇంపార్టెంట్.. !
సీఎం చంద్రబాబు ప్రస్తుతం ఏపీ పునరుజ్జీవానికి తపిస్తున్నారు. ఆర్థిక వ్యవస్థను వైసీపీ ప్రభుత్వం అస్త వ్యస్తం చేసిందని చెబుతున్న ఆయన.. దీనిని లైన్‌లో పెట్టేందుకు.. నిరుద్యోగ సమస్యను పరిష్కరించేం దుకు ప్రాధాన్యం ఇస్తున్నారు.
By: Garuda Media | 27 Oct 2025 4:00 PM ISTసీఎం చంద్రబాబు ప్రస్తుతం ఏపీ పునరుజ్జీవానికి తపిస్తున్నారు. ఆర్థిక వ్యవస్థను వైసీపీ ప్రభుత్వం అస్త వ్యస్తం చేసిందని చెబుతున్న ఆయన.. దీనిని లైన్‌లో పెట్టేందుకు.. నిరుద్యోగ సమస్యను పరిష్కరించేం దుకు ప్రాధాన్యం ఇస్తున్నారు. ఈ క్రమంలో దేశ, విదేశాల్లోనూ పర్యటించి ఏపీకి పెట్టుబడులు తీసుకు వస్తున్నారు. ఇది మంచి పరిణామం. ఇది చేయాల్సిందే. అయితే.. ఇదొక్కటే ప్రభుత్వానికి గీటు రాయి కాదు. ఇంకా కొన్ని ఇంపార్టెంట్ సమస్యలు ఉన్నాయి. వాటిపైనా చంద్రబాబు దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది.
పార్టీ పరంగా ఉన్న సమస్యలు.. ఇప్పుడు ప్రజలకు అవసరం లేదు. వచ్చే ఎన్నికల నాటికి వాటిని సరిచేసుకునే అవకాశం ఉంది. కానీ, ప్రజల కోణంలో చూసుకుంటే.. కొన్ని కీలకమైన సమస్యలు వెంటాడుతు న్నాయి. వీటిని చంద్రబాబు కేవలం 48 గంటల్లోపరిష్కారం చేయొచ్చు. వీటిలో ఆర్థికేతర అంశాలే ఎక్కు వగా ఉన్నాయి. వీటిని ఆయన పట్టించుకోవాలని ప్రజాసంఘాలు కూడా కోరుతున్నాయి. ప్రధానంగా ప్రజారోగ్య సమస్యలు వెంటాడుతున్నాయి. ప్రాదమిక వైద్య కేంద్రాల్లో సరైన వైద్యం అందడం లేదు.
ఇది ముమ్మాటికీ వాస్తవం. చంద్రబాబు అనేక సందర్భాల్లో హెచ్చరించినా.. వైద్యుల తీరు మారడం లేదు. ఇటీవల ఏలూరులో నిండు గర్భిణీ ఆసుపత్రికి వస్తే.. ఆమెకు వైద్యం చేసే దిక్కులేకుండా పోయింది. దీంతో పొరుగున ఉన్న తెలంగాణకు వెళ్లాల్సి వచ్చింది. ఇది ఒక్క ఘటనే కావొచ్చు. దీనికి వచ్చిన ప్రచారం అంతా ఇంతా కాదు. ఇది ప్రభుత్వానికి ఇబ్బందికర అంశం. అదేవిధంగా రిజిస్ట్రార్ కార్యాలయాల్లో చేతులు తడపకుండా.. పనులు జరగడం లేదని.. రైతులు, మద్యతరగతి ప్రజలు లబోదిబోమంటున్నారు.
దీనిని కట్టడి చేయడం చాలా సులువు. పైగా దీని వల్ల ప్రభుత్వానికి మంచి పేరు మరింత పెరుగుతుంది. ఇదేసమయంలో కలెక్టరేట్లలో ప్రతి సోమవారం తీసుకుంటున్న ప్రజల నుంచి అర్జీలకు మోక్షం లభిం చడం అరుదుగా మారింది. ఇవన్నీ.. చిన్నపాటి సమస్యలు. కానీ.. ప్రజల దృష్టిలో ఇవి పెద్దవి అవుతున్నా యి. ``చంద్రబాబు పెట్టుబడుల కోసం వెళ్తున్నారు. ఇక్కడ మమ్మల్ని ఎవరూ పట్టించుకోవడం లేదు.`` అనే టాక్ ప్రజల మధ్య పెరుగుతోంది. ఇది రాకుండా చూసుకుంటే.. దీనిని ప్రాధాన్యం ఇస్తే.. చంద్రబాబు కు అదే మరో విజయాన్ని తీసుకువస్తుంది.
