ఢిల్లీలో బాబు బిజీ షెడ్యూల్
ఏపీ సీఎం చంద్రబాబు ఢిల్లీ పర్యటన పెట్టుకున్నారు. ఏపీకి సంబంధించిన పలు అంశాలను చర్చించేందుకు ఆయన ఈ టూర్ చేపడుతున్నారు.
By: Satya P | 9 Feb 2026 6:34 PM ISTఏపీ సీఎం చంద్రబాబు ఢిల్లీ పర్యటన పెట్టుకున్నారు. ఏపీకి సంబంధించిన పలు అంశాలను చర్చించేందుకు ఆయన ఈ టూర్ చేపడుతున్నారు. ఏపీకి కేంద్రం నుంచి రావాల్సిన వాటిని గురించి కేంద్ర మంత్రులకు తెలియజేయడంతో పాటు వాటిని రాబట్టుకునేందుకు భేటీ కానున్నారు. అదే విధంగా వివిధ ప్రాజెక్టులను కేంద్రం నుంచి కోరనున్నారు. ఆర్ధికంగా రావాల్సిన వాటి మీద కూడా ఈ సమావేశాలలో ఆయన చర్చించనున్నారు.
బిజీ బిజీగా :
ఏపీ సీఎం చంద్రబాబు ఢిల్లీ వెళ్ళారు అంటే ఫుల్ బిజీగా గడుపుతారు అన్నది తెలిసిందే. ఆయన మంగళవారం రోజంతా బిజీ షెడ్యూల్ తో నిండిపోయింది. ఇదిలా ఉంటే బాబు సోమవారం రాత్రి ఢిల్లీ వెళ్తున్నారు. ఆయన మంగళవారం రోజంతా ఢిల్లీలో కేంద్ర మంత్రులను వరుసగా కలుస్తారు అని అంటున్నారు.
హోం మంత్రి సహా :
ఇక ముఖ్యమంత్రి తన తాజా పర్యటనలో కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో భేటీ కానున్నారు. ఆయనతో అనేక కీలక అంశాలు చర్చిస్తారు అని అంటున్నారు. ఏపీ రాజధాని అమరావతికి చట్టబద్ధత కల్పించే అంశం మీద బిల్లు పెట్టే విషయం కూడా చర్చకు వస్తుందని అంటున్నారు. అలాగే గత కొద్ది రోజులుగా ఏపీలో జరుగుతున్న రాజకీయ పరిణామాలు కూడా చర్చకు వస్తాయని అంటున్నారు. అలాగే కేంద్రం నుంచి ఏపీకి రావాల్సిన సాయం ప్రాజెక్టుల మీద కూడా చర్చ సాగనుంది అని అంటున్నారు.
ఆర్థిక మంత్రితో భేటీ :
అదే విధంగా కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మల సీతారామన్ తో కూడా బాబు భేటీ అవుతారు అని అంటున్నారు. ఏపీకి బడ్జెట్ లో జరిగిన కేటాయింపుల గురించి చర్చించడమే కాకుండా ఏపీకి రావాల్సిన నిధుల గురించి మరింత సాయం గురించి కూడా ముఖ్యమంత్రి చర్చిన్స్తారు అని అంటున్నారు. అదే విధంగా బాబు పలువురు కేంద్ర మంత్రులను మంగళవారం కలవనున్నారు.
కీలక మంత్రులతోనే :
ఇక ఈ పర్యటనలో చంద్రబాబు మంగళవారు ఉదయం నుంచి సాయంత్రం వరకూ వరసబెట్టి పలువురు కేంద్ర మంత్రులతో భేటీ అవుతారని చెబుతునారు. కేంద్ర జల్ శక్తి మంత్రి సిఆర్ పాటిల్ అలాగే కేంద్ర వ్యవసాయ శాఖా మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్, రైల్వే శాఖ మంత్రి అశ్వనీ వైష్ణవ్‌లతో ముఖ్యమంత్రి భేటీ అయి అనేక అంశాలు ఏపీకి సంబంధించిన వాటి మీద చర్చించనున్నారు. రాష్ట్రానికి సంబంధించిన పలు ప్రాజెక్టులు, వివిధ పథకాలు, కార్యక్రమాలకు నిధుల కేటాయింపుపై కేంద్ర మంత్రులతో చంద్రబాబు చర్చిస్తారని తెలుస్తోంది. ఇక ఈ భేటీల అనంతరం మంగళవారం రాత్రికి ఢిల్లీ నుంచి చంద్రబాబు అమరావతికి తిరుగు ప్రయాణం అవుతారని భోగట్టా.
