Begin typing your search above and press return to search.

జగన్ ఓ డిఫరెంట్ ...బాబు సంచలన కామెంట్స్ !

జగన్ భిన్న మనస్తత్వం తనకు మాత్రమే కాదని రాష్ట్రానికే ప్రమాదకరమని చంద్రబాబు చెప్పడం విశేషం.

By:  Satya P   |   24 Oct 2026 3:01 PM IST
జగన్ ఓ డిఫరెంట్ ...బాబు సంచలన కామెంట్స్ !
X

వైసీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తో ప్రమాదం అని టీడీపీ అధినేత ముఖ్యమంత్రి చంద్రబాబు సంచలన కామెంట్స్ చేశారు. అంతే కాదు జగన్ ది భిన్న మనస్తత్వం అని ఆయన అన్నారు. వైఎస్సార్ తో పాటుగా ఎంతో మంది కాంగ్రెస్ నాయకులను తాను చూశాను అని బాబు తాజా ప్రెస్ మీట్ లో చెప్పుకొచ్చారు. అయితే వారిలో ఎవరికీ లేని భిన్నమైన మనస్తత్వం జగన్ కి ఉందని చంద్రబాబు విశ్లేషించారు.

రాష్ట్రానికే అంటూ :

జగన్ భిన్న మనస్తత్వం తనకు మాత్రమే కాదని రాష్ట్రానికే ప్రమాదకరమని చంద్రబాబు చెప్పడం విశేషం. ఆయన ఇక్కడ కాంగ్రెస్ లోని ఇతర నాయకులను కూడా జగన్ తో సరి పోల్చారు. అంతే కాదు వైఎస్సార్ ని కూడా ఆయన పోల్చి చూసి అందరి కంటే కూడా జగన్ డిఫరెంట్ అని చెప్పుకొచ్చారు. చంద్రబాబు ఇదే మాట గతంలో పలు సందర్భాలలో కూడా అన్నారు. తాజాగా స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా ఆయన మరోసారి ఘాటు విమర్శలు జగన్ మీద చేశారు.

రాజధాని విషయంలోనూ :

జగన్ అమరావతి రాజధాని విషయంలో తీసుకున్న నిర్ణయాలను కూడా చంద్రబాబు తప్పు పడుతూ ఆయన మనస్తత్వం గురించి అప్పట్లో మాట్లాడారు. అంతే కాదు ఆయన పాలనా శైలి గురించి కూడా అనేక సందర్భాలలో మరీ ముఖ్యంగా 2024 ఎన్నికల వేళ ప్రచారాలలో పలు ఇంటర్వ్యూలలో కూడా చంద్రబాబు విమర్శించారు. జగన్ ది నియంతృత్వ ధోరణి భిన్నమైన మనస్తత్వం అని చంద్రబాబు ఆరోపిస్తూ వస్తున్నారు.

లేటెస్ట్ కామెంట్స్ :

ఇపుడు స్థానిక సంస్థల ఎన్నికల వేళ రాష్ట్రంలో నామినేషన్ల పర్వంలో పలు చోట్ల చెలరేగిన ఘర్షణలు హింస వంటి వాటి మీద మాట్లాడుతూ చంద్రబాబు జగన్ వైఖరిని పూర్తి స్థాయిలో తప్పుపట్టారు. లోకల్ బాడీస్ కి ఎన్నికలు జరగకూడదు అన్నది జగన్ ఆలోచన అన్నారు. కోర్టులకు వెళ్ళి 54 దాకా కేసులు వేయించారు అని నిందించారు. ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలు పెట్టకపోతే నిధులు రావని బాబు ఈ సందర్భంగా చెప్పారు. అయినా జగన్ తన వైఖరితో స్థానిక ఎన్నికలను జరగకూడదని భావిస్తున్నారు అని అన్నారు.

హిట్ అండ్ రన్ :

జగన్ వైఖరి హిట్ అండ్ రన్ అన్న తీరున ఉందని బాబు చెప్పారు. ఆయన బెంగళూరు నుంచి తాడేపల్లి కి రావడం ప్రెస్ మీట్ పెట్టి అసత్యాలు ప్రచారం చేసి వెళ్ళిపోతున్నారు అని మండిపడ్డారు. జగన్ తీరు చూస్తే క్రిమినల్ లిటిగెంట్‌గా వ్యవహరిస్తూ ప్రజాస్వామ్య వ్యవస్థలను నాశనం చేశారని మండిపడ్డారు. వైసీపీ అయిదేళ్ళ పాలన అంతా కూడా విద్వంశం చోటు చేసుకుందని బాబు విమర్శించారు. వైసీపీ హయాంలో జరిగిన ఘటనలపై అదే హింస అవే అబద్ధాలు పేరుతో బుక్‌లెట్ ని బాబు ఈ సందర్భంగా రిలీజ్ చేశారు.

ఏపీ బ్రాండ్ ఇమేజ్ :

ఏపీ అంటే కుమ్ములాటలు అన్నట్లుగా పొరుగు రాష్ట్రాల వారు మాట్లాడుతున్నారని బాబు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతిపక్ష వైసీపీ వైఖరి వల్ల రాష్ట్ర ప్రతిష్ట దెబ్బతింటోందని బాబు అన్నారు. మొత్తం మీద చూస్తే ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా ఘర్షణలు చెలరేగడం వెనక వైసీపీ ఉందని బాబు ఆరోపిస్తున్నారు. జగన్ ఒక డిఫరెంట్ అని అంటున్నారు. ఆయనతో ఏకంగా ఏపీకే ప్రమాదం అని చెబుతున్నారు. జగన్ కంటే వైఎస్సార్ అలాగే కాంగ్రెస్ నేతలు నయం అన్నట్లుగా బాబు చేసిన వ్యాఖ్యలు ఉన్నాయి. మరి దీని మీద వైసీపీ రియాక్షన్ ఏమిటి అన్నది చూడాల్సి ఉంది.