Begin typing your search above and press return to search.

మంత్రులతో బాబు కీలక వ్యాఖ్యలు

ప్రతిపక్షం చేస్తున్న ప్రచారాన్ని అడ్డుకోకపోతే కూటమి ప్రభుత్వం ఎంత మంచి చేసిన ప్రజలకు చేరదన్న భావన అయితే ప్రభుత్వ పెద్దల్లో ఉంది.

By:  Satya P   |   30 April 2026 11:32 PM IST
మంత్రులతో బాబు కీలక వ్యాఖ్యలు
X

మంత్రి వర్గ సమావేశంలో తన మంత్రులకు చంద్రబాబు ఎపుడూ దిశా నిర్దేశం చేస్తొంటారు. అంతే కాదు వారికి సరైన సూచనలు సలహాలు ఇస్తూంటారు. తాజాగా శుక్రవారం జరిగిన మంత్రి వర్గ సమావేశంలోనూ చంద్రబాబు ఇదే తీరున కీలక వ్యాఖ్యలు చేశారు. మంత్రులు దూకుడుగా వ్యవహరించాలని ఆయన కోరినట్లుగా చెబుతున్నారు. మంత్రుల పనితీరు మీద మాట్లాడుతూ మరింత జోరు పెంచాలి సూచించినట్లుగా సమాచారంగా ఉంది. ముఖ్యంగా వైసీపీ నిరంతరం కూటమి ప్రభుత్వం మీద చేస్తున్న అసత్య ప్రచారాలను మంత్రులు గుర్తించాలని సరైన సమయంలో వాటిని ఖండించాలని ముఖ్యమంత్రి దిశా నిర్దేశం చేసినట్లుగా భోగట్టా. వైసిపి చేస్తున్న విమర్శల మీద మంత్రులు అప్రమత్తంగా ఉండాలని ఎప్పటికప్పుడు వాటిని తిప్పి కొట్టాలని చంద్రబాబు కోరారు. ప్రజలలో ప్రతిపక్షం చేస్తున్న అసత్య ప్రచారాన్ని నియంత్రించాలని సూచించినట్లుగా చెబుతున్నారు.

రాజకీయ రాద్ధాంతమే :

వైసీపీ చేస్తున్నది రాజకీయ రాద్ధాంతమే అని ముఖ్యమంత్రి పేర్కొన్నట్లుగా చెబుతున్నారు. ఏపీలో డీజిల్ పెట్రోల్ విషయంలో వైసీపీ నానా యాగీ చేస్తోందని చంద్రబాబు అన్నట్లుగా చెబుతున్నారు. రాష్ట్రంలో డీజిల్ పెట్రోల్ కొరత ఉందని దానికి కూటమి ప్రభుత్వం కారణమని వైసిపి అదే పనిగా ప్రచారం చేస్తోందని బాబు పేర్కొంటూ నిజానికి ఆ పరిస్థితి అయితే లేదని అన్నారు. కానీ వైసీపీ చేస్తున్న ఈ తరహా తప్పుడు ప్రచారం మీద కూటమి నుంచి ఆశించిన స్థాయిలో ప్రతి విమర్శలు అయితే రావడం లేదని, అందుకే దీని మీదనే ముఖ్యమంత్రి మంత్రులకు సూచనలు చేసినట్లుగా చెబుతున్నారు.

మంత్రుల పర్యటన మీద:

ఇదిలా ఉంటే ఇటీవల కొందరు మంత్రులు సింగపూర్ పర్యటన చేశారు. అయితే రాష్ట్ర అభివృద్ధి కోసం చేసిన ఈ పర్యటన కూడా వైసీపీ కేవలం రాజకీయాల కోసం రాద్ధాంతం చేస్తుందని ముఖ్యమంత్రి మంత్రి వర్గ సమావేశంలో పేర్కొన్నట్టుగా చెబుతున్నారు. మంత్రులు వైసీపీ చేస్తున్న తప్పుడు ప్రచారాన్ని ఎప్పటికప్పుడు ఖండించాలని వాస్తవ పరిస్థితులు ప్రజలకు తెలియజేయాలని బాబు కోరారు. ఇక విపక్షాన్ని గట్టిగా కౌంటర్ చేయడంలో చాలామంది మంత్రులు వెనకబడి ఉన్నట్టుగా ప్రభుత్వ పెద్దలు భావిస్తున్నారని అంటున్నారు. అందుకే ప్రతి మంత్రివర్గ సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు ఇదే విషయం మీద మంత్రులకు సూచనలు చేస్తూనే ఉన్నారు. అయితే వైసిపి చేస్తున్న విమర్శలను కొందరు మాత్రమే తిప్పి కొడుతున్నారు. చాలామంది ఈ విషయంలో పెద్దగా పట్టించుకోవట్లేదు అన్న అసంతృప్తి ప్రభుత్వ పెద్దల్లో ఉందని అంటున్నారు. అందుకే చంద్రబాబు పదే పదే మంత్రులకు సూచనలు చేస్తున్నారు.

వాస్తవాలు చెప్పండి :

ప్రతిపక్షం చేస్తున్న ప్రచారాన్ని అడ్డుకోకపోతే కూటమి ప్రభుత్వం ఎంత మంచి చేసిన ప్రజలకు చేరదన్న భావన అయితే ప్రభుత్వ పెద్దల్లో ఉంది. ఇదిలా ఉంటే మంత్రులకు చంద్రబాబు మరి కొన్ని విషయాల్లో కూడా ముఖ్యమంత్రి దిశా నిర్దేశం చేసినట్లుగా తెలిసింది. మంత్రులు తప్పనిసరిగా ఐటి ఏఐ వంటి సాంకేతిక పరిజ్ఞానం విషయంలో అవగాహన పెంచుకోవాలని ముఖ్యమంత్రి సూచించినట్లుగా తెలుస్తోంది. అదేవిధంగా మంత్రులు తమ పేషీల్లో పనిచేస్తున్న సిబ్బందిని సమర్ధత నిబద్ధత చూసి ఎంపిక చేసుకోవాలని ముఖ్యమంత్రి సూచించినట్లుగా సమాచారం. అలాగే పేషీ లో పనిచేస్తున్న సిబ్బంది విషయంలో అప్రమత్తంగా ఉండాలని ట్రాక్ రికార్డు చూసి మాత్రమే తీసుకోవాలని కోరారని అంటున్నారు.

గొంతు విప్పుతారా :

అదే విధంగా వేసవి కాలం ప్రస్తుతం కొనసాగుతున్న నేపథ్యంలో రాష్ట్రంలో ప్రజలు ఎక్కడ తాగునీటి విషయంలో ఇబ్బందులు పడకుండా చూడాలని ముఖ్యమంత్రి మంత్రులను కోరారు. ఇదిలా ఉంటే చంద్రబాబు ఎంత చెబుతున్నా ఈ రోజుకీ చాలామంది మంత్రులు మౌన ముద్రలోనే ఉంటున్నారు. వైసీపీ చేస్తున్న ఆరోపణలకు దీటైన కౌంటర్లు ఇవ్వడం లేదన్న అసంతృప్తి కూటమి పెద్దలలొ ఉందని అంటున్నారు. ప్రతిసారి ఈ విషయంలో మంత్రులకు బాబు సూచనలు చేస్తున్నప్పటికీ కొందరు మాత్రమే స్పందిస్తున్నారన్న భావన అయితే వ్యక్తం అవుతోంది. మరి ఇకనైనా ఎంతమంది మంత్రులు ముఖ్యమంత్రి చంద్రబాబు చేసిన పాటించి వైసిపి మీద ఎటాక్ చేస్తారు అన్నది చూడాల్సి ఉంది.