Begin typing your search above and press return to search.

నేను ఉంటా...అన్నీ వింటా !

తెలుగుదేశం అధినేత ముఖ్యమంత్రి చంద్రబాబు చెబుతున్న మాట ఇది. ఎవరికో కాదు, కూటమి ఎమ్మెల్యేలకు మంత్రులకు, బడ్జెట్ సెషన్ ఏపీలో స్టార్ట్ అయింది.

By:  Satya P   |   12 Feb 2026 7:00 AM IST
నేను ఉంటా...అన్నీ వింటా !
X

తెలుగుదేశం అధినేత ముఖ్యమంత్రి చంద్రబాబు చెబుతున్న మాట ఇది. ఎవరికో కాదు, కూటమి ఎమ్మెల్యేలకు మంత్రులకు, బడ్జెట్ సెషన్ ఏపీలో స్టార్ట్ అయింది. ఏకంగా 17 పని దినాలతో సాగబోతున్న ఈ సెషన్ లో ఎన్నో కీలక అంశాలు ప్రస్తావనకు రానున్నాయి. సాధారణంగా బడ్జెట్ సెషన్ మీదనే జనాలకు ఎక్కువ ఆసక్తి ఉంటుంది. ఎందుకంటే బడ్జెట్ అంటే నిధులు, గ్రాంట్స్, తమ ఊరికి తమ నేలకు, తమ ప్రాంతానికి నిధులు తమ సమస్యల పరిష్కారానికి పెండింగ్ ప్రాజెక్టులు ఎంతెంత నిధులు విడుదల చేశారు అన్నది అంతా ఆసక్తిగా చూస్తారు. ఇక బడ్జెట్ మీద జరిగే డిస్కషన్స్ అలాగే తాము ఎన్నుకున్న ఎమ్మెల్యేలు, మంత్రులు అయిన వారు చేసే ప్రసంగాలు ఇవన్నీ జనాలు చాలా జాగ్రత్తగా గమనిస్తూంటారు.

అందుకే బాబు అలా :

ఈ సంగతి అర్ధ శతాబ్దం అనుభవం కలిగిన చంద్రబాబుకు తెలియనిది కాదు, అందుకే ఆయన కూటమి పార్టీల ఎమ్మెల్యేలతో నిర్వహించిన సమావేశంలో ఒక మాట అన్నారు బడ్జెట్ సెషన్ కి అంతా క్రమం తప్పకుండా రావాలని. ఉదయం తొమ్మిది నుంచి మధ్యాహ్నం రెండు వరకూ సాగే సభా కార్యక్రమాలలో ప్రతీ ఒక్కరూ పాలు పంచుకోవాలని కూడా బాబు కోరారు. సభలో అంతా చక్కగా వ్యవహరించాలని కూడా సూచించారు.

సబ్జెక్ట్ మీదనే అంతా :

ప్రతీ ఒక్కరూ సబ్జెక్ట్ మీదనే మాట్లాడాలని బాబు కోరారు, బాగా ప్రిపేర్ అయి రావాలని కూడా ఆయన సూచించారు. తాను అంతా గమనిస్తారు అని ఆయన చెప్పారు. ఏ ఎమ్మెల్యే ఏమి మాట్లాడుతున్నారు, అలాగే ఏ మంత్రి ఏ విధంగా మాట్లాడుతున్నారు అంతా రికార్డు అవుతుందని కూడా బాబు చెప్పడం విశేషం. తానే కాదు ప్రజలు కూడా అన్నీ గమనిస్తూనే ఉంటారు అని అందువల్ల ప్రజలలో కూడా మంచి పేరు తెచ్చుకోవాలీ అంటే బడ్జెట్ సెషన్ కి మించినది లేదని సభకు ఎమ్మెల్యేలు కచ్చితంగా హాజరై సబ్జెక్ట్ మీదనే మాట్లాడాలని బాబు కోరడం విశేషం.

మంత్రులకు మరో బాధ్యత :

ఇక మంత్రులు మధ్యాహ్నం తరువాత తమ ప్రాతానికి చెందిన ఎమ్మెల్యేలతో అసెంబ్లీ లాబీల వద్ద సమావేశాలు నిర్వహించి వారి సమస్యలను తెలుసుకుని పరిష్కరించాలని బాబు కోరారు. తాను నిరంతరం అందరికీ అందుబాటులో ఉంటాను అని కూడా ఆయన చెప్పారు. ప్రజా సమస్యల మీద ఎంత ఎక్కువగా చర్చ జరిగితే అంత మంచిదని కూడా సూచించారు. కూటమి ఎమ్మెల్యేలు మంత్రులు అంతా పూర్తిగా కసరత్తు చేసి సభకు రావాలని సభలో ప్రస్తావించే విషయాలు అన్నీ ప్రజలకు సంబంధించినవి అయి ఉండాలని కూడా కోరారు. మొత్తానికి బడ్జెట్ సెషన్ లో చంద్రబాబు ఒక పరీక్ష అయితే పెట్టారు, తాను ఉంటాను వింటాను అని కూడా అన్నారు. దాంతో మొత్తం కూటమికి చెందిన 164 మంది ఎమ్మెల్యేలూ సభలో కనిపించి తమ గళం విప్పాల్సిందే.