Begin typing your search above and press return to search.

సుఖీభ‌వ‌, త‌ల్లికివంద‌నం లేటైనా ఇచ్చేద్దాం.. అంద‌రూ హ్యాపీ..!

రాష్ట్ర ప్ర‌భుత్వం అమ‌లు చేస్తున్న కీల‌క ప‌థ‌కాల‌కు సంబంధించి సీఎం చంద్ర‌బాబు తాజాగా కీల‌క నిర్ణ‌యం తీసుకున్నారు.

By:  Garuda Media   |   28 Aug 2025 2:00 PM IST
సుఖీభ‌వ‌, త‌ల్లికివంద‌నం లేటైనా ఇచ్చేద్దాం.. అంద‌రూ హ్యాపీ..!
X

రాష్ట్ర ప్ర‌భుత్వం అమ‌లు చేస్తున్న కీల‌క ప‌థ‌కాల‌కు సంబంధించి సీఎం చంద్ర‌బాబు తాజాగా కీల‌క నిర్ణ‌యం తీసుకున్నారు. అన్న‌దాత సుఖీభ‌వ‌, త‌ల్లికి వంద‌నం ప‌థ‌కాల‌కు సంబంధించి నిధులు ఎప్పుడో విడుద‌లైనా.. ల‌బ్ధిదారుల‌కు చేర‌డంలో కొంత జాప్యం చోటు చేసుకుంది. అదేవిధంగా మ‌రికొంద‌రు ల‌బ్ధి దారుల‌ను కూడా చేర్చుకోవాల్సి వ‌చ్చింది. నిజానికి ఈ రెండు ప‌థ‌కాల‌కు నిధులు కేటాయించ‌డం స‌ర్కా రుకు తీవ్ర ఇబ్బందిగా మారింది. అయినా... ఎన్నిక‌ల స‌మ‌యంలో ఇచ్చిన హామీ మేర‌కు నిధులు కేటా యించారు.

ఈ రెండు ప‌థ‌కాల‌కు సంబంధించి అనుకున్న దానిక‌న్నా ఎక్కువ‌గా ల‌బ్ధిదారుల సంఖ్య పెరిగింది. ముం దుగా స‌ర్వే చేసి కొంద‌రు ల‌బ్ధి దారుల‌ను ఎంపిక చేశారు. అయితే.. ఆ త‌ర్వాత ఎమ్మెల్యేలు, ఎంపీల సిఫా రసుల‌తో జిల్లాలు, నియోజ‌క‌వ‌ర్గాల్లో ల‌బ్ధిదారుల సంఖ్య మ‌రింత పెరిగింది. అయితే.. అప్ప‌టికే నిధులు కేటాయించిన నేప‌థ్యంలో కొత్త‌గా ల‌బ్ధిదారులుగా ఎంపికైన వారికి నిధులు స‌రిపోలేదు. దీంతో త‌ల్లికి వంద‌నం, అన్న‌దాత సుఖీభ‌వ ప‌థ‌కాల‌కు సంబంధించి ల‌బ్ధిదారుల ద‌ర‌ఖాస్తుల‌ను పెండింగులో పెట్టారు.

దీనిపై స‌ర్వ‌త్రా ఆందోళ‌న రేగింది. కార్యాల‌యాల చుట్టూ తిరుగుతున్న ల‌బ్ధిదారులు, క‌లెక్ట‌ర్ల నుంచి విన తులు, ఎమ్మెల్యేలు, ఎంపీల నుంచి కూడా విజ్ఞ‌ప్తులు పెరిగిపోయాయి. ఈ నేప‌థ్యంలో చంద్ర‌బాబు ఈ లెక్క‌లు తేల్చాల‌ని అధికారుల‌ను ఆదేశించారు. మొత్తంగా 332 కోట్ల రూపాయ‌ల వ‌ర‌కు అద‌నంగా ఈ ల‌బ్ధిదారుల‌కు నిధులు కేటాయించాల్సి వచ్చింది. ఈ సొమ్మును కూడా ఇచ్చేయాల‌ని చంద్ర‌బాబు ఆర్థిక శాఖ‌కు విన్న‌వించ‌డంతో స‌ద‌రు నిధుల విడుద‌ల‌కు మార్గం సుగ‌మం అయింది.

ఇదిలావుంటే.. త‌ల్లికి వంద‌నం ప‌థ‌కాన్ని గ‌త నెల‌లోనూ.. అన్న‌దాత సుఖీభ‌వ ప‌థ‌కాన్ని ఈ నెల ప్రారం భంలోనూ చంద్ర‌బాబు ప్రారంభించారు. ఈ క్ర‌మంలో ఇంత ఆల‌స్యంగా నిధులు విడుద‌ల చేయ‌డం స‌రికాద‌న్న వాద‌న కూడా వినిపించింది. దీనిపై విప‌క్షాలు ఎద్దేవా చేస్తాయ‌ని కూడా భావించారు. అయిన‌ప్ప‌టికీ.. చంద్ర‌బాబు నిధుల విడుద‌ల‌కు గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చారు. ఫ‌లితంగా త‌ల్లికి వంద‌నం, అన్న‌దాత సుఖీభ‌వ ప‌థ‌కాల అద‌న‌పు ల‌బ్ధి దారుల‌కు నిధులు జ‌మ కానున్నాయి. పండుగ ముందు నిర్ణ‌యంతో స‌ర్కారుకు మరింత పేరు వ‌స్తుంద‌ని భావిస్తున్నారు.