Begin typing your search above and press return to search.

55 లక్షల ఫోన్ నంబర్లు డీయాక్టివేట్.. కేంద్ర నిర్ణయంతో దేశం యావత్తు షాక్..

చేతిలోకి స్మార్ట్ ఫోన్ వచ్చిన తర్వాత ప్రపంచం కుగ్రామంగా మారిపోయింది. పెరుగుతున్న టెక్నాలజీ ఉన్న చోటు నుంచి చాలా వరకు పనులు చక్కబెడుతుంది.

By:  Tupaki Desk   |   18 Dec 2023 8:21 AM GMT
55 లక్షల ఫోన్ నంబర్లు డీయాక్టివేట్.. కేంద్ర నిర్ణయంతో దేశం యావత్తు షాక్..
X

చేతిలోకి స్మార్ట్ ఫోన్ వచ్చిన తర్వాత ప్రపంచం కుగ్రామంగా మారిపోయింది. పెరుగుతున్న టెక్నాలజీ ఉన్న చోటు నుంచి చాలా వరకు పనులు చక్కబెడుతుంది. ఇదంతా కేవల్ ఒక్క మీటతోనే సాధ్యం అవుతుంది. స్మార్ట్ ఫోన్ చేతికి వచ్చినప్పటి నుంచి సౌకర్యం ఎంత పెరిగిందో సైబర్ నేరాలు కూడా అంతే పెరిగాయి. ముఖ్యంగా ఆర్థిక నేరాలు అంతు పట్టకుండా పెరుగుతూనే ఉన్నాయి.

భారత్ 5జీ నెట్ వర్క్ లోకి విజయవంతంగా ప్రవేశించింది. దేశంలో ఏదో ఒక మూలన తప్పితే చాలా వరకు 5జీ సేవలు అందుబాటులోకి వచ్చాయి. అయితే సైబర్ నేరగాళ్లు మరింత వీరంగం సృష్టించడం ప్రారంభించారు. ముఖ్యంగా ఆర్థిక వ్యవస్థపై వారి దాడులు హెచ్చు మీరుతున్నాయి. అమాయకుల నుంచి వందలాది కోట్ల రూపాయలను కాజేశారు సైబర్ నేరగాళ్లు. చాలా కాలంగా దీన్ని పరిశీలిస్తున్న కేంద్ర ప్రభుత్వం చర్యలు మొదలుపెట్టింది.

నకిలీ మొబైల్ ఫోన్ కనెక్షన్లకు వ్యతిరేకంగా కేంద్రం ప్రభుత్వం నకిలీ పత్రాల ద్వారా సంపాదించిన 5.5 మిలియన్ (55 లక్షల) ఫోన్ నంబర్లను డియాక్టివేట్ చేసింది. సంచార్ సాథీ పోర్టల్ ద్వారా దేశ వ్యాప్తంగా నిర్వహించిన వెరిఫికేషన్ క్యాంపెయిన్ విజయవంతమైందని కమ్యూనికేషన్స్ మంత్రి దేవుసిన్హ్ చౌహాన్ వెల్లడించారు. అక్రమంగా సిమ్ తీసుకొని సైబర్ నేరాలు, ఆర్థిక మోసాలకు పాల్పడుతుండడంతో వాటిని అరికట్టడమే లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టారు.

గుర్తించిన కనెక్షన్లను డియాక్టివేట్ చేయడంతో పాటు సైబర్ క్రైమ్, ఆర్థిక మోసాలకు పాల్పడిన 1.32 లక్షల హ్యాండ్ సెట్లను ప్రభుత్వం బ్లాక్ చేసింది. 13.42 లక్షల అనుమానాస్పద కనెక్షన్లను సైతం తొలగించారు. ఫేక్ ఐడీ, ఫేక్ కాల్స్ ను కట్టడి చేసేందుకు ప్రభుత్వం వినియోగదారులకు అవగాహన కార్యక్రమాలను ప్రారంభించింది. సమగ్ర ప్రయత్నం సైబర్ భద్రతను పెంపొందించుకోవడం. మోసపూరిత ఫోన్ నంబర్ల ద్వారా మోసపూరిత కార్యకలాపాలతో సంబంధం ఉన్న ప్రమాదాలను తగ్గించడానికి ఈ కార్యక్రమం చేపట్టినట్లు మంత్రి తెలిపారు.

కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో ఆర్థిక నేరాలను చాలా వరకు తగ్గుతాయని అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ఫేక్ నెంబర్లను వేగంగా డియాక్టివేట్ చేస్తే ప్రజలకు ప్రయోజనం కలుగుతుందని ఈ కార్యక్రమాన్ని కొనసాగించాలన్న అభిప్రాయలు కూడా వ్యక్తం అవుతున్నాయి.