Begin typing your search above and press return to search.

మీ చావు మీరు చావండి... ఏపీ తెలంగాణా కు కేంద్రం చెప్పింది ఇదేనా ..?

తెలంగాణా తో ఏపీకి ఉన్న సమస్యలు ఆస్తుల రూపేణారావాల్సిన నిధులు ఇత్యాది వాటి విషయం లో మీరూ మీరొ చూసుకోండి అంటూ ఒక ఉచిత సలహా ఇచ్చేశారు.

By:  Tupaki Desk   |   25 July 2023 5:37 PM GMT
మీ చావు మీరు చావండి... ఏపీ తెలంగాణా కు కేంద్రం చెప్పింది ఇదేనా ..?
X

తాంబూలాలు ఇచ్చేశాం తన్నుకు చావండి అని అంటూంటారు. అచ్చం ఇదే తీరున కేంద్రం తాపీ గా అంటే తొమ్మిదేళ్ల సుదీర్ఘ కాలం తరువాత ఏపీ తెలంగాణ కి చావు కబురు చల్లగా చెప్పింది. మీ చావు మీరు చావండి అన్న మాట అనలేదు కానీ చెప్పినది తీసుకుంటే అచ్చం అలాగే అనిపిస్తుంది. విభజన తరువాత ఆస్తులు బకాయిలు ఇలా చూసుకుంటే చాలా పేచీలు తెలంగాణా తో ఏపీ కి ఉన్నాయి.

తెలంగాణా ఉన్న చోటనే రాష్ట్రం అయింది. ఆస్తులు అన్నీ అలాగే అక్కడే ఉన్నాయి. ఏపీ మాత్రం తానున్న చోటకు వెనక్కి రావాల్సి వచ్చింది. అందువల్ల ఏపీ తెలంగాణా కు సంబంధించిన సమస్యల ను సామరస్యంగా వీలైతే ఒద్దికగా లేకుంటే గద్దించి మరీ చెప్పి ఒక పరిష్కారం చేయాల్సిన బాధ్యత కేంద్రం మీద ఉంది.

కానీ కేంద్రం మాత్రం మాకు ఏమీ సంబంధం లేనట్లుగా వ్యవహరిస్తోంది. ఆ మాటను కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి నిత్యానందరాయ్ చెప్పడం విశేషం. ఆయన టీడీపీ ఎంపీలు కేశినేని నాని, రామ్మోహన్ నాయుడు అడిగిన ప్రశ్నల కు జవాబు గా ఏకంగా పార్లమెంట్ ముందు ఒక లిఖిత పూర్వక నివేదికను ఉంచారు.

అందులో ఏపీ కి విభజన హామీల ను నెరవేర్చామని చెప్పుకున్నారు. దాంతో పాటుగా తెలంగాణా తో ఏపీకి ఉన్న సమస్యలు ఆస్తుల రూపేణారావాల్సిన నిధులు ఇత్యాది వాటి విషయం లో మీరూ మీరొ చూసుకోండి అంటూ ఒక ఉచిత సలహా ఇచ్చేశారు. నిజంగా ఇదే దారుణం అని చెప్పాలి. 2014 తరువాత కేంద్రం మాట మీద ఏపీ ప్రభుత్వం ఆనాడు తెలంగాణా కు విద్యుత్ అవసరాలు తీర్చింది. ఆ బకాయిలు మొత్తం ఆరు వేల కోట్ల దాకా ఉన్నాయి.

అంతే కాదు తెలంగాణా లో ఉన్న ఉమ్మడి ఆస్తుల నుంచి ఏపీ కి రావాల్సిన నిధుల మొత్తాలు చూసుకుంటే లక్షన్నర కోట్ల దాకా ఉంటాయి. ఇవన్నీ తొమ్మిది, పది షెడ్యూల్ లో ఉన్నాయి. వీటిని తెలంగాణా తో చెప్పి ఒప్పించి ఏపీకి నిధులు ఇప్పించాల్సిన బాధ్యత కేంద్రానికి ఉంది. కానీ కేంద్రం లోని బీజేపీ తన రాజకీయ ప్రయోజనాల కోసం ఏపీ ని బలిపెడుతోంది అని అంటున్నారు.

తెలంగాణా లో బీజేపీ కి రాజకీయాలు చేసుకోవాల్సిన అవసరం ఉంది. అందుకే బీజేపీ అక్కడ జనాల కోసం తాను నిలబడినట్లుగా ఉండాలి. ఈ కారణంగానే కేంద్రం ఏపీకి అన్యాయం చేస్తోంది అని అంటున్నారు. నిజంగా తెలంగాణా కూర్చుకి చర్చినుకుని ఉంటే తొమ్మిదేళ్ళ కాలం ఎలా పడుతుంది అన్నది మౌలికమైన ప్రశ్నగా ఉంది. అదే టైం లో తెలంగాణా ఏపీ ని విభజించి పెద్దన పాత్ర నాడు పోషించిన కేంద్రం ఇపుడు మాత్రం మీరే అంతా చూసుకోవాలి అని చెప్పడం అంటే పలాయనవాదం అవకాశవాదం అనుకోవాల్సిందే.

ఇంకో మాట కూడా ఉంది. అదేంటి అంటే విభజన హామీలు అన్నీ తీర్చేశమని కేంద్రం చెప్పడం. ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టం 2014లోని హామీల ను కేంద్రం చాలా వరకు నెరవేర్చిందని.. కేంద్రం ఇచ్చిన హామీల్లో ఎక్కువ భాగం నెరవేర్చిందని, మిగతా హామీలు వివిధ దశల్లో అమలు లో ఉన్నాయని చెప్పడం నిజంగా దారుణం అంటున్నారు.

ఏపీ లో రాజధాని నగరాన్ని ఏర్పాటు చేసేందుకు రాష్ట్రానికి నిధులు కేటాయించినట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఎంత అంటే 2,500 కోట్ల రూపాయలట. వాటితో రాజధాని తయారవుతుందా లేదా అన్నది కేంద్రమే చెప్పాలి. అంతే కాదు, ఎయిమ్స్, ఐఐటీ, గిరిజన విశ్వవిద్యాలయం ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వానికి నిధులు మంజూరు చేసినట్లు కూడా తెలిపింది. గిరిజన విశ్వవిద్యాలయానికి సిబ్బంది జీతాలకే ఇస్తున్న అరకొర నిధులు సరిపోవడం లేదు, ఇంక వర్శిటీ ఎపుడు పూర్తి అవుతుందో కేంద్రమే చెప్పాలని అంటున్నారు.

అలగే కడప స్టీల్‌ ప్లాంట్‌ పై సెయిల్‌ పరిశోధన చేసి కడప స్టీల్‌ ప్లాంట్‌ సాధ్యం కాదని నివేదిక సమర్పించడంతో కేంద్రం దాని ని తోసిపుచ్చింది. ఇది నిజంగానే ఏపీ రాష్ట్ర ప్రభుత్వానికి, కడప ప్రజలకు పెద్ద షాక్. ఇలా అనేక అంశాలలో తలా తోకా లేకుండా కేంద్ర హోం మంత్రి చెప్పాల్సింది చెప్పేసి నివేదిక ఇచ్చేసి మీకు అంతా చేశామని అంటున్నారు. మరి ఏపీ వారి కష్టాలు నష్టాలు పగ వారికి రాకూడదు అంతే ఇదేనేమో.