దేశంలో లాక్‌డౌన్ ఉందా? లేదా?: కేంద్రం క్లారిటీ
దేశంలో లాక్‌డౌన్ విధిస్తారంటూ.. గత రెండు రోజులుగా పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది.
By: Garuda Media | 27 March 2026 2:58 PM ISTదేశంలో లాక్‌డౌన్ విధిస్తారంటూ.. గత రెండు రోజులుగా పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. ముఖ్యంగా సోషల్ మీడియాలో ఈ విషయంపై చర్చ సాగుతోంది. పశ్చిమాసియాలో నెలకొన్న పరిస్థితుల నేపథ్యం లో దేశంలో పరిస్థితి బాగోలేదని.. దీంతో దేశంలో ఇంధన కొరత ఏర్పడిందని.. దీనిని తట్టుకునేందుకు కేంద్ర ప్రభుత్వం లాక్ డౌన్‌ను ఆయుధంగా చేసుకుంటోందన్న వాదన వినిపిస్తోంది.
గతంలో కరోనా సమయంలో వ్యాధి వ్యాపించకుండా ఎలా అయితే.. దేశవ్యాప్తంగాలాక్ డౌన్ విధించారో.. ఇప్పుడు గ్యాస్, ఇంధన కొరత.. వంటి సమస్యలు పెరగకుండా లాక్‌డౌన్ విధించేందుకు ప్రయత్నిస్తు న్నారన్న బలంగా వినిపిస్తోంది. దీంతో దాదాపు అన్ని వర్గాల్లో ప్రజల్లో తీవ్ర ఆందోళన నెలకొంది. దీనిపై పెద్ద ఎత్తున చర్చలు కూడా సాగుతున్నాయి. లాక్‌డౌన్ విధిస్తే.. మళ్లీ తమ జీవితాలు తలకిందులు అవుతా యని భావిస్తున్న వర్గాలు కూడా ఉన్నాయి.
అయితే.. ఈ వ్యవహారంపై కేంద్రం స్పందించింది. దేశంలో లాక్‌డౌన్ విధించే ప్రతిపాదన ఏదీ లేదని కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పురి వెల్లడించారు. లాక్ డౌన్ విధించనున్నారని..వస్తున్న వార్తలు.. జరుగు తున్న చర్చలపై ఆయన మండిపడ్డారు. సోషల్‌మీడియా బాధ్యతగా వ్యవహరించాలని కూడా తేల్చి చెప్పారు. కేంద్ర ప్రభుత్వం ప్రస్తుత పరిస్థితిని నిశితంగా గమనిస్తోందన్నారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూడాలని చూస్తోందని.. ఇలాంటి ప్రచారం మంచిది కాదని వ్యాఖ్యానించారు.
గ్యాస్‌కు కొరత లేదు..
దేశంలో గ్యాస్ సరఫరాకు కొరతలేదని కూడా కేంద్రం ప్రకటించింది. ఇప్పటికే రెండు నౌకలు విశాఖకు చేరుకున్నాయని తెలిపింది. అదేవిధంగాచమురు విషయంలోనూ ఎలాంటిఇబ్బందులు కొరత లేదని స్పష్టం చేసింది. కానీ, ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని.. ప్రతిపక్షాలు సహా సోషల్‌మీడియాపై కేంద్రం ఆగ్రహం వ్యక్తం చేసింది.
